Andhra Pradesh

News April 30, 2024

ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగి సస్పెండ్: గుంటూరు కమిషనర్

image

ప్రభుత్వ ఉద్యోగులు, ఆప్కాస్ ఉద్యోగులు ఎవరైనా రాజకీయ పార్టీల ప్రచారాల్లో పాల్గొన్నా, ప్రచారం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏటుకూరులో టీడీపీ సమన్వయకర్త ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా.. బొకే ఇచ్చి ఫోటోలు దిగిన నగరపాలక సంస్థ ఔట్సోర్సింగ్ ఉద్యోగి అమరేశ్వర రావుని విధుల నుంచి తొలగించామన్నారు.

News April 30, 2024

వాకాడు: భర్తకు భోజనం పెట్టి వస్తూ భార్య తిరిగిరాని లోకానికి

image

వడదెబ్బ సోకి మహిళ మృతి చెందిన సంఘటన వాకాడు మండలం నిడుగుర్తి పంచాయతీ బాలాజీ నగర్లో మంగళవారం చోటుచేసుకుంది. మల్లాపు పుట్టమ్మ (52)  గ్రామ సమీపంలోని వేరుశనగ తోటలో పనిచేస్తున్న తన భర్తకి భోజనం ఇవ్వడానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఎండ తీవ్రతకు అక్కడే కుప్పకూలిపోయారు. అది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు.

News April 30, 2024

చిత్తూరు జిల్లాలో 16,43,593 మంది ఓటర్లు

image

చిత్తూరు పార్లమెంట్ పరిధిలో 16,43,593 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ ఎస్. షణ్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నగరి, జి.డి.నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీలలో 8,06,070 మంది పురుషులు, 8,34,000 మంది స్త్రీలు మొత్తం 16,43,593 మంది ఓటర్లు ఉన్నారన్నారు.

News April 30, 2024

అనంతపురం రూరల్ వైసీపీ ఎంపీటీసీ నగేశ్‌పై హత్యాయత్నం

image

ఎన్నికల నేపథ్యంలో అనంతపురం రూరల్ ఎంపీటీసీ నగేశ్‌పై మంగళవారం హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయనను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News April 30, 2024

28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు: కలెక్టర్ మల్లికార్జున

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 82 ఘటనల్లో కేసులు నమోదు చేశామని, నిబంధనలు అతిక్రమించిన 71 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని, 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలో రాజకీయ పార్టీలపై 54 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని సాధారణ పౌరుల కేసుల్లో 61 కేసుల్లో 57 కేసులు పరిష్కరించామని తెలిపారు.

News April 30, 2024

శ్రీకాకుళం: 7,812 మంది వాలంటీర్ల రాజీనామా

image

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన ఘటనలు 93 చోటు చేసుకోగా వాటిలో 34 కేసుల్లో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. 67 మంది ప్రభుత్వ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయగా 39 మందిని సర్వీస్ నుంచి తొలగించారు. 17 మందిపై ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే 7812 మంది గ్రామ, వార్డు వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేశారు. ఇంకా ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించిన 26 మంది రాజకీయ నాయకులపై 17 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.

News April 30, 2024

కొండపి: MLA స్వామిపై బాలకృష్ణ ఫన్నీ కామెంట్లు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ కొండపిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామిపై సరదాగా వ్యాఖ్యలు చేశారు. ‘మన ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడు. నాకంటే పొట్టి, కానీ వయసులో నేనే పెద్ద’ అంటూ నవ్వులు పూయించారు. ఇక్కడి పొగాకు చూస్తే తనకు వీరసింహారెడ్డి సినిమా గుర్తుకువచ్చిందన్నారు. ఈ సందర్భంగా బాలయ్య పలు సినిమాల డైలాగులు చెప్పి అభిమానులను ఉత్సాహపరిచారు.

News April 30, 2024

కోవూరు: నేను ఒంటరిని కాదు: వైసీపీ నేత

image

మేమందరం కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డితోనే ఉంటామని ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట వైసీపీ నేత కదురు రమేశ్ అన్నారు. నిన్న కొంతమంది డేవిస్ పేట నుంచి టీడీపీలో చేరారు. కదురు రమేష్ అనుచరులు కూడా టీడీపీలో చేరారని, ఆయన ఒంటరిగా మిగిలిపోయారని వార్తలు వచ్చాయి. ఇవ్వన్ని అపోహలేనని, మేమంతా వైసీపీలోనే ఉన్నామని వారు స్పష్టం చేశారు.

News April 30, 2024

 రాజంపేట పార్లమెంటు బరిలో 18మంది అభ్యర్థులు

image

రాజంపేట పార్లమెంటు బరిలో MP అభ్యర్థులుగా 18మంది బరిలో ఉన్నారు. NDA కూటమి-నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, YCP-మిథున్ రెడ్డి, కాంగ్రెస్-S.భాషీద్, BSP-యుగేంద్ర, అన్న YSR-అక్బర్, M.బాషా, జై భారత్ పార్టీ-రమణయ్య, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ-సల్మాన్ ఖాన్, ఇండిపెండెంట్లు-వేంకటాద్రి, ఓబయ్యనాయుడు, నాగరాజు, నాగేశ్వర్ రాజు, శ్రీనివాసులు, రెడ్డిశేఖర్, ప్రదీప్, శ్రీనివాసులు, మాడా రాజ, సుబ్బనరసయ్య ఉన్నారు.

News April 30, 2024

ఏపీలో అందుకే రైల్వేస్టేషన్ల పేర్లు మారలేదు: RRR

image

టీడీపీ- జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంతో అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులని ఎంపీ, కూటమి ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు భవిష్యత్తు గ్యారంటీని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. జగన్ ఒక దుష్టుడు అని విమర్శించారు. ఏపీలోని రైల్వే స్టేషన్‌కు జగన్ పేరు, ఫొటో వేసుకోవడం కుదరదు కనుకే ఆయా స్టేషన్ల పేర్లు మారలేదని ఎద్దేవా చేశారు.