Andhra Pradesh

News April 30, 2024

కడప : డిగ్రీ పరీక్షల్లో 8 మంది డిబార్

image

YVU డిగ్రీ పరీక్షలను వీసీ ప్రొ చింతా సుధాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. ఎన్.ఈశ్వర్ రెడ్డితో కలిసి బ్రహ్మంగారిమఠం, పుల్లంపేట డిగ్రీ కళాశాలను సందర్శించారు. దీనిలో భాగంగా కాపీలు రాస్తున్న నలుగురు విద్యార్థులను డిబార్ చేశారు. ప్రతి కేంద్రంలో తాగునీరు, ఫ్యాన్లు, టాయిలెట్ వసతి ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా మరో నలుగురు విద్యార్థులు డిబారయ్యారు.

News April 30, 2024

ఏసీబీ వలలో కురబలకోట విద్యుత్ ఏఈ

image

కురబలకోట విద్యుత్ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కురబలకోట మండలంలో ట్రాన్స్ కో కార్యాలయం ఏఈగా వెంకటరత్నం పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు కోసం ఓ రైతు వద్ద రూ.32 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

News April 30, 2024

 మెలియాపుట్టి: 17 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

image

మెలియాపుట్టి మండలంలోని మర, బాలేరు గ్రామాలతో పాటు ఒడిశాలోని మర్రిగుడ్డి, కొయ్యర గ్రామంలో ఎస్ఈబీ, పాతపట్నం, మెలియాపుట్టి, ఒడిశా పోలీసు బృందాలు నాటుసారాపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 వేల లీటర్ల బెల్లం ఊట, 370 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసినట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు. ఎస్ఈబీ ఉన్నతాధికారులు టీ.తిరుపతినాయుడు, ఐ.ఏ బేగం తదితర సిబ్బంది పాల్గొన్నారు.

News April 30, 2024

ప్రచారం మధ్యలో సొమ్మసిల్లి పడిపోయిన సంధ్యారాణి

image

మక్కువ మండలంలోని పెద్ద ఊటగడ్డ గ్రామంలో సాలూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి మంగళవారం మధ్యాహ్నం ప్రచారం చేశారు. ఎండ ఎక్కువగా ఉండటంతో వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన పార్టీ శ్రేణులు అర్ధాంతరంగా ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు. అనంతరం సంధ్యారాణిని సాలూరుకు తరలించారు.

News April 30, 2024

బొమ్ములూరు జాతీయ రహదారిపై ఇద్దరి మృతి

image

బాపులపాడు మండలం బొమ్ములూరు కలపర్రు టోల్ గేట్ సమీపంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై డివైడర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొని తండ్రీకూతురు అక్కడికక్కడే మృతి చెందారు. భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరు ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని తిరిగి ఏలూరు వెళ్తుండుగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం.

News April 30, 2024

దేవస్థానం సిబ్బంది రాజకీయ పార్టీల నాయకులతో కలవడం నిషేధం

image

శ్రీశైలం దేవస్థానం రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు రాజకీయ పార్టీల నాయకులను కలవడం, ఫోటోలు దిగటం నిషేధమని ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా క్షేత్ర పుర వీధులలో, వసతి భవనముల వద్ద, దుకాణముల సముదాయము వద్ద, ప్రైవేటు సత్రముల వద్ద రాజకీయ పార్టీలకు సంబందించిన కండువాలు, టోపీలు పెట్టుకుని
ఎన్నికల ప్రచారము చేయుట నిషేధమన్నారు.

News April 30, 2024

SKU: మెగా సప్లిమెంటరీ పరీక్షకు త్వరలో నోటిఫికేషన్

image

శ్రీ కృష్ణదేవరాయ విద్యాలయ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీబీఏ తదితర యూజీ కోర్సుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు త్వరలో మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ జారీ చేస్తామని వీసీ హుస్సేన్ రెడ్డి తెలిపారు.1994-95 నుంచి 2014-15, సెమిస్టర్ విధానంలో 2015-2019 మధ్య పరీక్ష తప్పిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్కేయూ పరీక్షల విభాగం తెలిపింది.

News April 30, 2024

అక్రమ రవాణాపై నిఘా పెంచాలి: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం అక్రమ రవాణాపై నిఘా పెంచాలని నెల్లూరు కలెక్టర్ ఎం.హరినారాయణన్ నోడల్ ఆఫీసర్లను ఆదేశించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నోడల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని చెక్‌పోస్ట్‌ల వద్ద పక్కాగా తనిఖీలు చేయాలని సూచించారు.

News April 30, 2024

పలాసలో వడదెబ్బతో వ్యక్తి మృతి

image

మండలంలోని బ్రాహ్మణతర్ల- కేదారిపురం గ్రామాలకు వెళ్లే రహదారి పక్కన పొలంలో మంగళవారం ఓ వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఎండకు వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై మృతి చెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టెక్కలిలోనూ మరో వ్యక్తి వడ దెబ్బతో మృతి చెందారు. స్థానికులు చుట్టు పక్కల గ్రామస్థులకు సమాచారం అందించారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే కుటుంబ సభ్యులకు తెలపాలని కోరారు.

News April 30, 2024

చెంగాళమ్మను విస్మరిస్తే పదవి గల్లంతే..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చెంగాళమ్మ దర్శనానికి వెళ్లకుండా ఉంటే పదవి పోతుందనే నమ్మకం ఉంది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆలయం దారిగుండా కారులో వెళ్లారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. మరో ప్రధాని ఐకే గుజ్రాల్ శ్రీహరికోటకు వచ్చినా అమ్మవారిని దర్శించుకోలేదు. 1998లో ఆయన పదవిని కోల్పోయారు. తమిళనాడు సీఎం జయలలిత, ఎన్టీఆర్‌కు కూడా ఇలాగే పదవీగండం కలిగిందని స్థానికులు చెబుతారు.