Andhra Pradesh

News April 30, 2024

అనంతలో భగభగమంటున్న భానుడు

image

జిల్లా వాసులను భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. గుంతకల్లులో సోమవారం అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. శింగనమల, తలుపులలో 44.1, బొమ్మనహాళ్ 43.9, యల్లనూరు, తాడిపత్రి, అనంతపురంలో 43.7, పెద్దవడుగూరు 43.2, కూడేరు, చెన్నేకొత్తపల్లి, కొత్తచెరువులో 43.0, విడపనకల్లు, బుక్కరాయసముద్రం 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. 

News April 30, 2024

అనంతపురం జిల్లాలో మొత్తం 20,18,162 మంది ఓటర్లు

image

అనంతపురం జిల్లాలో మొత్తం 20,18,162 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మే 13న జరిగే పోలింగ్‌లో వారు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇటీవల 16,962 మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారు. దీంతో జిల్లాలో మొత్తం ఓటర్లు ఓటర్ల సంఖ్య 20,18,162 మంది ఉండగా అందులో పురుషులు 9,97,792 మంది, స్త్రీలు 10,20,124, ఇతరులు 246 మంది ఉన్నారు.

News April 30, 2024

ఇచ్ఛాపురంలో పిడుగుపాటుకు ఐదుగురికి గాయాలు

image

పట్టణంలో సోమవారం పిడుగులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. బహుదానదీ తీరంలో ఒడిశా గ్రామం వద్ద ఇటుకల పరశ్రమలో పనిచేసే కార్మికులు , తమ గుడిసెల్లో ఉండగా పిడుగు పడడంతో ఐదుగురు గాయపడ్డారు.కుటుంబీకులు ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

News April 30, 2024

ప.గో.: టీడీపీ నుంచి శివరామరాజు సస్పెండ్

image

ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే.

News April 30, 2024

నందివాడ: ప్రేమ పేరుతో మోసం

image

నందివాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన పవన్ కుమార్ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి మోసం చేసిన ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. 8 నెలలుగా తనను బెదిరించి అత్యాచారం చేస్తున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News April 30, 2024

శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక అభ్యర్థులు బరిలో ఉన్నది ఇక్కడే..!

image

శ్రీకాకుళం జిల్లాలో మే13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. కాగా జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గాను అత్యధికంగా ఆమదాల వలస నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యల్పంగా టెక్కలి,శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండలో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.

News April 30, 2024

5న నెల్లూరుకు షర్మిల

image

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మే 5న నెల్లూరుకు రానున్నారు. ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన ప్రాంతాలపై డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు చర్చించారు. నెల్లూరులో ఆమె రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని పార్టీ వర్గాలకు సూచించారు.

News April 30, 2024

అనంత జిల్లాలో ఈ రెండు చోట్లా రెండేసి ఈవీఎంలు

image

అనంత ఎంపీ, తాడిపత్రి అసెంబ్లీ పరిధిలో రెండేసి ఈవీఎంలు ఉంటాయి. ఒక్కో ఈవీఎంలో గరిష్ఠంగా 16 మంది పేర్లు, గుర్తులు కేటాయించేందుకు అవకాశం ఉండగా.. అనంత ఎంపీ బరిలో 21, తాడిపత్రిలో 18 మంది ఉన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బూత్‌లో లోక్ సభ ఈవీఎంలు 2, అసెంబ్లీకి 1 ఉంటాయి. తాడిపత్రి పరిధిలో లోక్ సభకు సంబంధించి 2, అసెంబ్లీకి మరో 2 ఇలా ఒక్క తాడిపత్రి పరిధిలో ప్రతి పోలింగు కేంద్రంలో 4 ఉంటాయి.

News April 30, 2024

విశాఖలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై ఎఫ్ఐఆర్ 

image

విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుపై 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయింది. ఇటీవల మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ‘దుర్మార్గ ముఖ్యమంత్రి’ అని సంబోధించారంటూ ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాల మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ఆయనకు 41ఏ నోటీసు అందజేశారు.

News April 30, 2024

రేపు మిర్చియార్డుకు సెలవు

image

మే డే సందర్భంగా గుంటూరు మిర్చియార్డుకు బుధవారం సెలవు ప్రకటించినట్లు యార్డు అధికారులు తెలిపారు. సెలవు కారణంగా బుధవారం యార్డులో క్రయవిక్రయాలు జరగవని రైతులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. సోమవారం మొత్తం 90,353 మిర్చి బస్తాలను యార్డుకు రైతులు తరలించారని, ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కొంత మేరకు క్రయవిక్రయాలు తగ్గాయని అధికారులు తెలిపారు.