Andhra Pradesh

News April 30, 2024

ప్రకాశం జిల్లా రాజకీయ వేడి పులుముకుంది

image

ప్రకాశం జిల్లాలో ఇవాళ నారా లోకేశ్ ఒంగోలు, పవన్ కళ్యాణ్ గిద్దలూరు, దర్శి, ఒంగోలు, సీఎం జగన్ కొండపి, నందమూరి బాలకృష్ణ సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీంతో అభ్యర్థులు జనసమీకరణలు చేస్తున్నారు. ఇక పోలీసులు వీరి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతను రెట్టింపు చేశారు. ఒకేసారి జిల్లాకు నలుగురు రావడంతో జిల్లాలో రాజకీయ వేడి పులుముకుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

News April 30, 2024

NLR: అప్పుడు.. ఇప్పుడు గ్లాసే

image

గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కావలిలో జనసేన అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ బరిలో నిలిచారు. అప్పుడు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేసిన ఆయనకు 10,647(5.46శాతం) ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కావలిలో జనసేన అభ్యర్థి లేకపోవడంతో పసుపులేటికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. మరి ఈసారి ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.

News April 30, 2024

ఉమ్మడి విజయనగరంలో 99 మంది పోటీ

image

ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఎంతమంది పోటీలో ఉంటారన్నది లెక్క తేలింది. నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణ అనంతరం మొత్తంగా 99 మంది బరిలో ఉన్నారు. అయితే అత్యధికంగా విజయనగరం నియోజకవర్గంలో 15 మంది పోటీచేస్తుండగా..అత్యల్పంగా చీపురుపల్లి, కురుపాం, సాలూరులో 7గురు చొప్పున బరిలో ఉన్నారు. ఎస్.కోట-12, నెల్లిమర్ల-12, గజపతినగరం-13, బొబ్బిలి-8, పార్వతీపురం-8 మంది చొప్పున పోటీ చేస్తున్నారు.

News April 30, 2024

విశాఖ: నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించనున్నట్లు సీఈఓ ఎం.పోలినాయుడు తెలిపారు. ఈ సమావేశం తోపాటు ఒకటి నుంచి 7 వరకు స్థాయి సంఘాల సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమాలకు లోబడి సమావేశాలు జరుగుతాయని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వివిధ అంశాలపై ఎలాంటి చర్చ జరగదన్నారు. కేవలం హాజరైన సభ్యుల నుంచి సంతకాలు తీసుకుని సమావేశం ముగిస్తామన్నారు.

News April 30, 2024

TDP నుంచి జేడీ రాజశేఖర్ సస్పెండ్

image

తిరుపతి జిల్లా సత్యవేడుకు చెందిన JD రాజశేఖర్‌ను TDP సస్పెండ్ చేసింది. 2019 ఎన్నికల్లో ఆయన TDP అభ్యర్థిగా పోటీ చేసి YCP అభ్యర్థి ఆదిమూలం చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మాజీ MLA హేమలతకు TDP ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆదిమూలానికి TDP టికెట్ దక్కడంతో రాజశేఖర్, హేమలత రెబల్‌గా నామినేషన్ వేశారు. హేమలత నామినేషన్ తిరస్కరణకు గురైంది. రాజశేఖర్ పోటీలో కొనసాగుతుండటంతో ఆయనపై TDP వేటు వేసింది.

News April 30, 2024

కమలాపురంలో యువకుని దారుణ హత్య

image

కమలాపురంలో ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం వేకువజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కమలాపురం పక్కీరి వీధిలో నివాసం ఉంటున్న మహమ్మద్ ఘని (26)ని గుర్తు తెలియని దుండగలు ఇంట్లోకి చొరబడి విచక్షణా రహితంగా కత్తులతో హత్యచేసినట్లు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు సీఐ రామకృష్ణారెడ్డి, SI హృషికేషవరెడ్డి కేసు నమోదు చేసి, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News April 30, 2024

నరసన్నపేటలో నిచ్చెనపై నుంచి పడి వ్యక్తి మృతి

image

మండలంలోని గొనపపేట గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కోడి శ్రీధర్(39) నిచ్చెనపై నుంచి పడి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు పశువుల శాల నిర్మాణ పనులు నిచ్చెన ఎక్కి చేస్తుండగా జారి పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని నరసన్నపేట సామాజిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ బాబు తెలిపారు.

News April 30, 2024

తూ.గో.: ‘అన్నయ్యా అప్పులు తీర్చండి.. నేను కాలువలోకి దూకేస్తున్నా’

image

నల్లజర్ల మండలం నభీపేటకు చెందిన ప్రవీణ్ కుమార్(26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. వరికోత మిషన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అతనికి రెండేళ్ల క్రితం పెళ్లైంది. కాగా సోమవారం అన్న రవితేజకు ఫోన్ చేశాడు. పనికి వస్తానని కొందరి వద్ద డబ్బులు తీసుకున్నా.. వాటిని బైక్ అమ్మి కట్టేయండి.. అనంతపల్లి కాలువలోకి దూకేస్తున్నానని చెప్పాడు. రవితేజ పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహం బయటకు తీయించారు. కేసు నమోదైంది.

News April 30, 2024

ప.గో.: ‘అన్నయ్యా అప్పులు తీర్చండి.. నేను కాలువలోకి దూకేస్తున్నా’

image

నల్లజర్ల మండలం నభీపేటకు చెందిన ప్రవీణ్ కుమార్(26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. వరికోత మిషన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అతనికి రెండేళ్ల క్రితం పెళ్లైంది. కాగా సోమవారం అన్న రవితేజకు ఫోన్ చేశాడు. పనికి వస్తానని కొందరి వద్ద డబ్బులు తీసుకున్నా.. వాటిని బైక్ అమ్మి కట్టేయండి.. అనంతపల్లి కాలువలోకి దూకేస్తున్నానని చెప్పాడు. రవితేజ పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహం బయటకు తీయించారు. కేసు నమోదైంది.

News April 30, 2024

గుంటూరు: ‘నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు’

image

గుంటూరు వెస్ట్ అసెంబ్లీకి నామినేషన్ వేసే సమయంలో స్వతంత్ర అభ్యర్థి విడదల రజనిని నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. విడదల రజని, ఆమె భర్త సోమవారం హైకోర్టు విచారణకు హజరై.. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. బంధువుల ఇంట్లో ఉన్నామని చెప్పగా.. కోర్టు విచారణ మూసేసింది. కాగా, ఎస్సీ మహిళ రజనిని అపహరించారని గుంటూరుకు చెందిన అస్మతుల్లా వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే.