Andhra Pradesh

News April 30, 2024

మే 1లోగా పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో జరగనున్న సాధారణ ఎన్నికల విధుల్లో భాగంగా కొత్తగా ఓ.పి.ఓలుగా నియమితులైన వారు మే 1వ తేదీలోగా తమ ప్రాంత తహశీల్దారుకు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.నాగలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం వినియోగించుకోని ఓపిఓలు ఫారం-12 లో దరఖాస్తులు అందజేయాల్సి వుంటుందన్నారు.

News April 30, 2024

ఏలూరు పార్లమెంట్ బరిలో 13మంది అభ్యర్థులు

image

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కారుమూరి సునీల్(YCP), కావూరి లావణ్య(INC), అఖిల ధరణి పాల్ (BSP), పుట్టా మహేష్(TDP), బోడా అజయ్ బాబు(NCP), గొడుగుపాటి వీరరాఘవులు(PPOI), భైరబోయిన మల్యాద్రి(BCYP), రుద్రపాక రత్నారావు(ARPS), మెండెం సంతోష్ (LCP), కొండ్రు రాజేశ్వరరావు (BJKP), కొమ్మిన అగస్టీన్, కండవల్లి దయాకర్, బోకినాల కోటేశ్వరరావులు ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు.

News April 30, 2024

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలి: సత్యసాయి ఎస్పీ

image

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హిందూపురం సమీపంలోని బిట్స్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాలు నిరంతరం బందోబస్తు చేపట్టే గార్డ్, సీసీ కెమెరాలు తదితర ఏర్పాట్లు పరిశీలించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు నిరంతరం పహారా కాస్తు ఉండాలన్నారు.

News April 30, 2024

బ్యాంక్ ఖాతాకు పెన్షన్లు జమ: జిల్లా కలెక్టర్

image

మే 1వ తేదీన పెన్షనర్ల బ్యాంకు ఖాతాకు పెన్షన్లను జమ చేస్తామని జిల్లా కలెక్టర్ పగిలి షన్మోహన్ పేర్కొన్నారు. ఆధార్ సీడింగ్ అయిన బ్యాంక్ ఖాతాలకు నేరుగా నిధులు జమ చేస్తామన్నారు.2,72, 864 మంది పెన్షనర్లు ఉన్నారన్నారు.79 కోట్ల 87 లక్ష రూపాయలు పెన్షన్ మొత్తం పంపిణీ జరగాలన్నారు. ఇందులో 1,92,021 మందికి బ్యాంకు ఖాతాకి జమ చేస్తారు. 20,843మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

News April 30, 2024

నెల్లూరు పార్లమెంట్ బరిలో 14 మంది

image

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. సోమవారం సాయంత్రం నామినేషన్ ఉపసంహరణ అనంతరం అధికారిక జాబితా విడుదల చేశారు. మొత్తం 15 నామినేషన్‌లో ఉండగా వారిలో ఒకరు సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో 14 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి, వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మధ్య పోటీ నెలకొని ఉంది.

News April 30, 2024

నంద్యాల: ‘నూతన ఖాతాల నుంచే ఖర్చులను వినియోగించాలి’

image

ఎన్నికల ఖర్చుకు సంబంధించి అసెంబ్లీ అభ్యర్థికి రూ. 40లక్షలు, పార్లమెంట్ అభ్యర్థికి రూ.95 లక్షలు దాటకూడదని ఎన్నికల వ్యయ పరిశీలకులు మణికందన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఖర్చులకు సంబంధించి అన్ని రకాల రిజిస్టర్లను రూపొందించాలన్నారు. అభ్యర్థులు నూతనంగా బ్యాంకు ఖాతాలను ప్రారంభించి ఆయా ఖాతాల నుంచే ఎన్నికల ఖర్చుకు వినియోగించాలని సూచించారు. వచ్చే నెల ఖర్చు రిజిస్టర్లను తనిఖీ చేస్తామన్నారు.

News April 30, 2024

గుంటూరు: బరిలో 162 మంది అభ్యర్థులు

image

నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో సోమవారం గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. పార్లమెంట్ పోటీలో 30, అసెంబ్లీ స్థానాలైన తాడికొండ 10, మంగళగిరి 40, తెనాలి 13, పొన్నూరు 14, పత్తిపాడు 13, గుంటూరు ఈస్ట్ 14, గుంటూరు వెస్ట్ 28 అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 162 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారని చెప్పారు.

News April 30, 2024

ప్రకాశం: తనిఖీల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు

image

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా అన్నారు. తనిఖీల పేరుతో సామాన్య జనానికి ఇబ్బంది కలిగించరాదని స్పష్టం చేశారు. సోమవారం ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగేలా జిల్లా యంత్రాంగం చేపట్టినపై చర్యలపై సమీక్షించారు. కలెక్టర్ దినేశ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

News April 30, 2024

ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలి: కలెక్టర్

image

కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను తూచా తప్పక పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని కడప జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులు, బరిలో నిలిచిన అభ్యర్థులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉపసంహరణ అనంతరం.. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను, వారికి కేటాయించిన పార్టీ గుర్తుల జాబితాను కూడా తెలియజేయడం జరిగిందన్నారు.

News April 29, 2024

సంక్షేమ నిధిని మళ్లించకుండా చూస్తాం: పవన్

image

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే ఎవరూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని డైవర్ట్ చేయకుండా చూస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. సోమవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జి, తాతాజీ పాల్గొన్నారు.