Andhra Pradesh

News April 29, 2024

నెల్లూరు: దుస్తులు ఇస్త్రీ చేసిన మేకపాటి కోడలు

image

జలదంకిలోని పలు ప్రాంతాలలో సోమవారం వైసీపీ ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కోడలు శ్రేయ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ ఇంటికి వెళ్లి దుస్తులను ఇస్త్రీ చేసి పలువురిని ఆకట్టుకున్నారు. గడిచిన ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు.

News April 29, 2024

మదనపల్లె ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాస్ గుర్తు కేటాయింపు

image

మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్.షాజహాన్‌కు గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. దీంతో స్థానిక జనసేన పార్టీ నేతల్లో కలవరం చోటు చేసుకుంది. గాజు గ్లాసు గుర్తు షాజహాన్‌కు కేటాయించడం తగదన్నారు. మదనపల్లె జనసేన పార్టీ నేత దారం అనిత తదితరులు ఎన్నికల అబ్జర్వర్ కవిత(ఐఏఎస్), ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.

News April 29, 2024

విశాఖ: ఇకే గ్రామానికి చెందిన యువకులు మృతి

image

ఇటీవల గొడిచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఇద్దరు ఫార్మా ఉద్యోగులు విశాఖలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మేరకు నక్కపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన ఎస్.రాము రెండు రోజుల క్రితం మృతి చెందగా, ఎస్.పొట్టియ్య ఈ రోజు మృతి చెందారు. ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News April 29, 2024

కడప: వైసీపీలోకి కాంగ్రెస్ నేత నజీర్ అహ్మద్

image

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నజీర్ అహ్మద్ ఆ పార్టీని వీడారు. వైఎస్ షర్మిల వచ్చాక కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని భరించలేక, మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరానన్నారు. ఆయనకు అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాషా, మేయర్ సురేశ్ బాబులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న తనను అవమానపరిచారని ఆరోపించారు.

News April 29, 2024

శ్రీకాకుళం: అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు పూర్తి

image

నామినేషన్ల ఉపసంహరణ గడువు అనంతరం శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఆయన ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం గుర్తులు కేటాయించామన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ అభ్యర్థులు అధికారులు పాల్గొన్నారు.

News April 29, 2024

చంద్రగిరి : టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానికి 1+1 భద్రత

image

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానితో పాటు కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేసినా సెక్యూరిటీ ఇవ్వలేదని నాని హైకోర్టును ఆశ్రయించారు. నాని తరఫున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. పోటీ చేసిన అభ్యర్థికి భద్రత ఇవ్వాలి కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇవాళ నుంచి 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

News April 29, 2024

బూర్జ : శ్యాంమాస్టార్ కు డాక్టరేట్ ప్రదానం

image

బూర్జ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయోలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బొడ్డేపల్లి శ్యాంకు డాక్టరేట్‌‌కు ఎంపికయ్యారు. ఊటీలో ఐక్యరాజ్యసమితి శాంతి సంస్థ ఈ గౌరవ డాక్టరేట్‌ను అందించారు. పౌరాణిక నాటకాల్లో హరిశ్చంద్ర, గయోపాఖ్యానంలలో రాష్ట్ర స్థాయిలో విశేషంగా రాణిస్తున్నారు. నాటక రంగంలో చేస్తున్న ఈ విశేష కృషికి గుర్తింపుగా పీస్ కౌన్సిల్ వారు ఈ డాక్టరేట్ పట్టాను బహుకరించారు.

News April 29, 2024

మచిలీపట్నం పార్లమెంట్ బరిలో 15 మంది అభ్యర్థులు

image

నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల అనంతరం మచిలీపట్నం పార్లమెంట్ బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 25 మంది పోటీలో నిలువగా వారిలో 10 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. YCP అభ్యర్థిగా డా. సింహాద్రి చంద్రశేఖర్, జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లు కృష్ణ, తదితరులు పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News April 29, 2024

TPT: దూరవిద్య పీజీ ఫలితాల విడుదల

image

తిరుపతి : శ్రీవేంకటేశ్వర దూరవిద్య (DDE) విభాగం పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌లో పీజీ ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in, www.schools9.com ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News April 29, 2024

నెల్లూరు రూరల్‌లో 11 మంది పోటీ

image

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 12 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. సోమవారం నామినేషన్లను ఉపసంహరణకు ముందు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం 11 మంది పోటీలో నిలిచారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి, వైసీపీ అభ్యర్థి ఆదాల మధ్య పోటీ నెలకొంది.