Andhra Pradesh

News September 20, 2024

కూటమి పాలనలో సంక్షేమ పథకాలన్నీ రద్దు: అనంత వెంకటరామిరెడ్డి

image

కూటమి పాలనలో సంక్షేమ పథకాలన్నీ రద్దయ్యాయని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కు.. అవినీతిలో ముందుకు వెళ్లిందని విమర్శించారు. ఖరీఫ్ ముగిసి రబీ ప్రారంభమవుతున్నా పెట్టుబడి సాయం అందలేదని అన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా మట్టి, ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.

News September 20, 2024

టెక్కలిలో రూ.4 కోట్ల విద్యుత్ బకాయి.. పరిశ్రమకు కరెంట్ కట్

image

టెక్కలి మండలంలోని మెట్కోర్ అల్లాయిస్ పరిశ్రమకు అధికారుల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రావివలసలోని ఈ పరిశ్రమ సుమారు రూ.4 కోట్ల మేరకు విద్యుత్ బకాయి పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో శుక్రవారం టెక్కలి విద్యుత్ శాఖ అధికారులు పరిశ్రమకు సరఫరాను నిలిపివేశారు. హెచ్.టీ సర్వీస్ పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ బకాయిలు కోట్ల రూపాయలలో ఉండటంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమకు నోటీసులు జారీ చేశారు.

News September 20, 2024

విశాఖ-దుర్గ్ వందే‌భారత్ ఛార్జీలు ఇవే

image

కొత్తగా ప్రారంభమైన విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలు ఛార్జీలు గుండె గుబేల్ మంటున్నాయి. శుక్రవారం నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరుగుతోంది. విజయనగరం నుంచి రాయగడ ఛైర్ కార్ ధర రూ.535, పార్వతీపురానికి రూ.490గా ధర ఉంది. ఎగ్జిక్యూటివ్ ఛైర్ ధర అయితే దీనికి రెట్టింపు ఉంది. ఇదే ఎక్స్‌ప్రెస్ ట్రైన్ స్లీపర్ క్లాస్ విజయనగరం నుంచి పార్వతీపురం ధర కేవలం రూ.145 మాత్రమే. వందే భారత్ ధరలు చూసి ప్రయాణీకులు హడలిపోతున్నారు.

News September 20, 2024

587 మొబైల్స్ రికవరీ: ఎస్పీ

image

కర్నూలు జిల్లా పరిధిలో రూ.1,33,70,000 విలువ చేసే 587 మొబైల్స్‌ను ఎస్పీ బిందు మాధవ్ బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. మొబైల్ పోగొట్టుకున్న వారికి రికవరీ చేసి అందజేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎలాంటి రుసుము లేకుండా అందజేశామన్నారు. పోలీస్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 20, 2024

మధ్యాహ్న భోజన పథకానికి బియ్యం వితరణ

image

కాకుమాను మండల టీడీపీ నేతలు ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి 14 టన్నుల బియ్యం అందించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. శుక్రవారం పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సమక్షంలో బియ్యంలోడును కలెక్టర్‌కు అందజేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ఇప్పటికే పలుసార్లు సరుకులు అందించామని.. ప్రస్తుతం బియ్యం అందించినట్లు వారు తెలిపారు.

News September 20, 2024

ప్రారంభమైన దుర్గ్ – విశాఖ వందే భారత్

image

నూతనంగా ఇటీవల ప్రారంభించిన విశాఖ – దుర్గ్ వందే భారత్ ట్రైన్ దుర్గ్ నుంచి శుక్రవారం ఉదయం 5.45 నిమిషాలకు బయలుదేరి పార్వతీపురం 11:38 నిమిషాలకు చేరుకుంది. ఈ ట్రైన్ వారంలో గురువారం మినహా మిగిలిన అన్ని రోజులు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. బొబ్బిలిలో నిలుపుదలకు స్థానిక MLA అడిగినప్పటికీ ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ఈ ట్రైన్ తిరిగి విశాఖలో మధ్యాహ్నం 2:50 నిమిషాలకు దుర్గ్ బయలుదేరనుంది.

News September 20, 2024

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం రమేశ్

image

తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడడంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం పవిత్రతను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ఈ సంఘటనతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.

News September 20, 2024

బంగారుపాళ్యం నుంచే దండయాత్రగా మారింది: లోకేశ్

image

కుప్పం నుంచి చేపట్టిన తన యువగళం యాత్ర బంగారుపాళ్యం నుంచి దండయాత్రగా మారిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘యువగళాన్ని అడ్డుకునేందుకు ఆనాటి ప్రభుత్వం జీవో తెచ్చి అడ్డంకులు సృష్టించింది. అయినా భయపడలేదు. నాపై 23 కేసులు నమోదు చేశారు. పాదయాత్రలో నా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు సూపర్-6 పథకాలు ఉపయోగపడతాయి. సీఎం చంద్రబాబుతో చర్చించి వాటిని అమలు చేస్తా’ అని లోకేశ్ చెప్పారు.

News September 20, 2024

ఈ నెల 30న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు

image

కొవ్వూరు-కడియం రైల్వే సెక్షన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున ఆ మార్గం గుండా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు విజయవాడ-విశాఖపట్నం మధ్య ప్రయాణించే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లను(నం.12718 &12717) ఈ నెల 30న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News September 20, 2024

CM సభా ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి స్వామి

image

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో, మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పర్యటన ప్రదేశాలను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉన్నారు.