Andhra Pradesh

News April 29, 2024

జనసేన రెబల్ పాఠంశెట్టికి ‘గాజు గ్లాసు’ గుర్తు

image

జనసేన జగ్గంపేట రెబల్‌ అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్రకు ఎన్నికల కమిషన్ గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. పాఠంశెట్టి MLA టికెట్ ఆశించగా.. కూటమిలో భాగంగా జ్యోతుల నెహ్రూ(టీడీపీ)కు దక్కింది. దీంతో పాఠంశెట్టి, మరో ఇద్దరు అసంతృప్తులు నామినేషన్స్ వేశారు. ఈ ముగ్గురి పేర్లు పేపర్లలో రాసి డ్రా తీయగా.. పాఠంశెట్టికి ‘గాజు గ్లాసు’ దక్కింది. జగ్గంపేటలో గెలిచి పవన్‌కు గిఫ్ట్‌గా ఇస్తానని పాఠంశెట్టి పేర్కొన్నారు.

News April 29, 2024

పాలకొండ: సబ్ జైలుని సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జి

image

పాలకొండ జూనియర్ సివిల్ జడ్జి విజయరాజ్ కుమార్ సోమవారం సబ్ జైలును సందర్శించారు. జైలులో మౌలిక వసతుల పట్ల ఆరాతీశారు. జైలు సూపరింటెండెంట్ డి. జోగులు వేసవి దృష్ట్యా జైలు గదుల ఉపరితలాలపై కూల్ పెయింట్ వేయించినట్లు తెలియజేసారు. సారా అక్రమ వ్యాపార దుష్ప్రభావాలపై జూనియర్ సివిల్ జడ్జి ఖైదీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, న్యాయవాదులు బొడ్డు రామ్మోహన్ రావు పాల్గొన్నారు.

News April 29, 2024

నామినేషన్‌లు ఉపసంహరించుకున్న మడకశిర టీడీపీ రెబల్ అభ్యర్థులు

image

మడకశిర నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న, తనయుడు సునీల్ కుమార్ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. సోమవారం మడకశిర తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఈరన్నతో పాటు సునీల్ కుమార్‌ నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. టీడీపీ అభ్యర్థి ఎమ్మెస్ రాజుకు మద్దతు పలికారు. టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని పేర్కొన్నారు.

News April 29, 2024

నెల్లూరు పార్లమెంటుకు నామినేషన్ ఉపసంహరణ

image

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ వేసిన వేణుంబాక సునంద రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు సోమవారం సునంద రెడ్డి తరఫున ఎస్. సుబ్బారెడ్డి కలెక్టర్, ఎన్నికల అధికారి హరినారాయణ్ వద్దకు వెళ్లి తమ నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు తెలియజేసి పత్రాలను అందజేశారు.

News April 29, 2024

విశాఖ-తిరుపతి స్పెషల్ ట్రైన్ రీ షెడ్యూల్

image

విశాఖ-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ నుంచి సోమవారం రాత్రి 7.10 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్ రాత్రి 11.10 గంటలకు బయలుదేరుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ట్రైన్ కు సంబంధించిన కనెక్షన్ రైలు ఆలస్యంగా వస్తున్న కారణంగా దీనిని రీ షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

News April 29, 2024

బధిరుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

image

విజయనగరంలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో 1 నుండి 8వ తరగతి వరకు 2024-25 సంవత్సరంలో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ జె.దయానంద సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతిలో చేరేందుకు 6 నుండి 8 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలన్నారు. ఆసక్తికలవారు 9000013640, 9440437629 నెంబర్లను సంప్రదించి పాఠశాలలో ప్రవేశంకోసం మరింత సమాచారం తెలుసుకోవచునన్నారు

News April 29, 2024

గిద్దలూరు: వడదెబ్బతో ఉపాధి హామీ కూలి మృతి

image

కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామంలో విషాదం నెలకొంది. ఉపాధి హామీ పనికి వెళ్లిన వృద్ధుడు బాలయ్య(73) వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు. నల్లగుంట్ల సమీపంలో ఉదయాన్నే ఉపాధి హామీ పనికి వెళ్లిన బాలయ్య పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు గమనించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బాలయ్యను తరలించారు. వైద్యలు పరీక్షించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. 

News April 29, 2024

మే 13న సెలవు: కలెక్టర్‌

image

పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పోలింగ్‌ జరిగే మే 13న జిల్లాలో స్థానిక సెలవుదినంగా ప్రకటిస్తున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ చట్టం, 1881 ప్రకారం సెలవు ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు.

News April 29, 2024

రేపటి నుంచి ‘ఓటర్‌ స్లిప్స్‌’ పంపిణీ: కలెక్టర్ నివాస్

image

ఈనెల 30 నుంచి ఇంటింటికి ‘ఓటర్‌ స్లిప్స్‌’ పంపిణీ చేయడం జరుగుతుందని ఎన్నికల అధికారి, కాకినాడ జిల్లా కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఓటర్‌ స్లిప్‌లను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

News April 29, 2024

శ్రీకాకుళం: ఎన్నికల విధుల్లో NCC కాడెట్లు

image

NCC, NSS వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదేశించారు. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరిగే ఒక్కరోజు సామాజిక సేవ, స్వచ్ఛంద ప్రాతిపదికన వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ జి.ఆర్. రాధికతో కలిసి కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు.