Andhra Pradesh

News April 29, 2024

కాపులు అందరూ వంశీకి మద్దతు ఇవ్వాలి: సింహాద్రి

image

గన్నవరంలో నామినేషన్ విత్డ్రా అనంతరం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రాఘవేంద్రరావు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. యార్లగడ్డ వెంకట్రావుకి రంగా, పవన్ కళ్యాణ్ అంటే కనీస గౌరవం లేదన్నారు. తనను నియోజకవర్గంలో నిలబెట్టి వంశీని ఓడించాలని చూశారని అన్నారు. ఆఫీసులో కనీసం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టుకోలేదని, నియోజకవర్గంలో కాపులందరూ వంశీకి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

News April 29, 2024

కర్నూల్: మే ఒకటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

image

మే 1 నుంచి 4 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి గురువయ్య శెట్టి సోమవారం తెలిపారు. జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రభుత్వ జూనియర్ కళాశాల (టౌన్), అదేవిధంగా ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు (CP&M కోర్సు) ఎమ్మిగనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర), మిగతా ఒకేషనల్ కోర్సులను బి.క్యాంప్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News April 29, 2024

ప్రకాశం: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

image

పీసీపల్లి మండలం వరిమడుగుకు చెందిన కొడవటిగంటి శాంసన్(34) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వెంగళాయపల్లి-దరిమడుగు గ్రామాల మధ్యలో ఆదివారం అనుమానాస్పద రీతిలో మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై రమేష్ బాబు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కనిగిరి వైద్యశాలకు తరలించారు.

News April 29, 2024

ఏలూరు జిల్లాలో నేతల బహిరంగ సభలు

image

ఏలూరు జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయం హీటెక్కుతోంది. ఈ మేరకు ప్రధాన పార్టీల నాయకులు జిల్లాలో బహిరంగ సభలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 30న దెందులూరుకు చంద్రబాబు నాయుడు, నేడు కొయ్యలగూడెంలో షర్మిల రెడ్డి బహిరంగ సభ, మే 1న ఏలూరులో జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు కొయ్యలగూడెంలో పర్యటించనున్నారు.

News April 29, 2024

BREAKING: ముద్దరబోయిన నామినేషన్ విత్ డ్రా

image

నూజివీడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వర రావు సోమవారం తన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. త్వరలో ముద్దరబోయిన దంపతులు చంద్రబాబును కలవనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

News April 29, 2024

టెక్కలి: విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తికి గాయాలు

image

టెక్కలి-మెళియాపుట్టి రోడ్డులో సోమవారం విద్యుత్ షాక్‌కు గురై ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఫైబర్ నెట్ పనుల నిమిత్తం విద్యుత్ స్తంభం భం ఎక్కిన సమయంలో ప్రమాదవశాత్తూ.. విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురై కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు టెక్కలి పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 29, 2024

నిన్న TDP.. నేడు YCP

image

నెల్లూరు జిల్లా మర్రిపాడు వైస్ ఎంపీపీ చప్పిడి రవణమ్మ తిరిగి వైసీపీ గూటికి చేరారు. నిన్న బ్రాహ్మణపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రాంనారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. 24 గంటలు గడవక ముందే ఆ పార్టీని వీడారు. ఇవాళ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ సమక్షంలో తిరిగి వైసీపీలో చేరడం విశేషం.

News April 29, 2024

రాజాo: 78 మంది అరెస్ట్

image

ఈ ఏడాది జనవరి 1 నుంచి 28 వరకూ 252.99 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు రాజాం సెబ్ సీఐ బి. శ్రీధర్ వెల్లడించారు. 70 కేసులు నమోదు చేసి 78 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. 2,700 లీటర్ల పులిసిన బెల్లం ఊటలను ధ్వంసం చేసి మూడు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 120 మందిని బైండోవర్ చేయడంతోపాటు 9 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు వెల్లడించారు.

News April 29, 2024

గుంటూరులో మే 1న చంద్రబాబు ప్రచారం

image

గుంటూరు నగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని జిల్లా పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌లు తెలిపారు. గుంటూరులో వారు మాట్లాడుతూ.. మే 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్‌షో నిర్వహిస్తారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

News April 29, 2024

CTR: కొనసాగుతున్న నామినేషన్ల ఉపసంహరణ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణ ఇవాళ సాయంత్రం ముగియనుంది. ఈక్రమంలో పలువురు అభ్యర్థులు ఆర్వో కార్యాలయానికి వెళ్లి తమ నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకుంటున్నారు. కొన్ని పార్టీల తరఫున డమ్మీ సెట్లు వేసిన వాళ్లు విత్ డ్రా చేసుకుంటున్నారు. ఈక్రమంలో చిత్తూరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన విజయానందరెడ్డి భార్య ఇందుమతి నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.