Andhra Pradesh

News April 29, 2024

మండిన ప్రకాశం.. ప్రజలు బెంబేలు

image

జిల్లా ఎండ తీవ్రతతో మండిపోతోంది. ఆదివారం ఉదయం నుంచే ఎండ తీవ్రతతో పాటు వేడిగాలులతో ప్రజానీకం ఉక్కిరిబిక్కిరైంది. మార్కాపురం, కంభం, అర్దవీడులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా అనేక మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా పశ్చిమ ప్రాంత మండలాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.

News April 29, 2024

తిరుమలలో జరిగే ఉత్సవాలు ఇవే

image

తిరుమలలో శ్రీవారి గురువు జగద్గురు భగవద్ శ్రీరామానుజ ఉత్సవాలు మే 3న ప్రారంభం అవుతాయి. 4న‌ సర్వ ఏకాదశి, 10న అక్షయ తృతీయ నిర్వహిస్తారు. 12న జగద్గురు భగవద్ శ్రీ రామానుజ(శ్రీ భాష్యకారుల) శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరుపుతారు. 22న నృసింహ జ‌యంతి, నమ్మాల్వార్ వార్షిక శాత్తుమొర, 23న అన్నమాచార్య జయంతి జరుగుతుంది.

News April 29, 2024

మే 1-5 లోగా పింఛన్ల పంపిణీ పూర్తి: కలెక్టర్

image

మే 1వ తేదీ నుంచి 5వ తేదీలోగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, తదితర ఫించనుదారులు 1,26,773 మంది, మెడికల్ ఫించన్లు పొందుతున్న వారు 1,121 మంది కలిపి 1,27,894 మందికి పంపిణీ చేయాల్సి ఉందన్నారు. గత నెలలో 99.18 శాతం ఫించన్లు పంపిణీ చేసి రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచామని, అదే స్ఫూర్తితో ఈనెల కూడా ఫించన్లు పంపిణీ చేయాలన్నారు.

News April 29, 2024

ఏలూరు జిల్లాలో 2,162 అనుమతులు ఇచ్చాం: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిమిత్తం సువిధ ద్వారా 2,255 అభ్యర్థనలు వచ్చాయని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడించారు. వీటిలో 2,162 అభ్యర్థనలకు అనుమతులు ఇచ్చామన్నారు. ఇంకా 93 పరిశీలనలో ఉన్నాయన్నారు. సి-విజిల్ ద్వారా 439  ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. అటు ఎన్నికల ఉల్లంఘనలపై వచ్చిన 114 ఫిర్యాదులు పరిష్కరించామని స్పష్టం చేశారు.

News April 29, 2024

శ్రీ సత్యసాయి: ‘ఫిర్యాదుల విషయంలో హేతుబద్ధత కలిగి ఉండాలి ’

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల విషయంలో హేతు భద్రత కలిగి ఉండాలని ఎన్నికల పరిశీలకులు అన్బు కుమార్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సాధారణ, వ్యయ, పోలీసు పరిశీలకులు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పారదర్శకంగా, ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలన్నారు.

News April 29, 2024

కడప: నంది వాహనంపై రామలింగేశ్వర స్వామి

image

ప్రొద్దుటూరు రామేశ్వరంలోని శ్రీముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం స్వామి, రాజరాజేశ్వరి దేవీకి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. రాత్రి గంగా రాజరాజేశ్వరి సమేత ముక్తి రామలింగేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి నంది వాహనంపై ఆశీనులు చేశారు. భక్తులు స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు.

News April 29, 2024

ఏలూరులో మే 1న సీఎం జగన్ సభ: ఆళ్ల నాని

image

ఎన్నికలలో ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మే 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ప్రాంతాన్ని ఆళ్ల నాని కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం బహిరంగ సభను వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News April 29, 2024

ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలి: కలెక్టర్

image

రాజకీయ పక్షాలు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా ఆదివారం తెలిపారు. ఓట్లను పొందటం కోసం కులం, మత పరమైన భావాల పరంగా అభ్యర్థనలు చేయరాదన్నారు. ఎన్నికల ప్రచారం కోసం మసీదులు, చర్చీలు, దేవాలయాలు లేక మరే ఆరాధనా ప్రదేశాలనూ వేదికగా ఉపయోగించకూడదన్నారు. నాయకులు, కార్యకర్తల వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయరాదన్నారు.

News April 29, 2024

చంద్రబాబు మాయమాటలు నమ్మవద్దు: బాల నాగిరెడ్డి

image

చంద్రబాబు మాయ మాటలు నమ్మవద్దని, TDP భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని బాలనాగిరెడ్డి అన్నారు. ఆదివారం కామన్ దొడ్డిలో ప్రచార యాత్ర నిర్వహించారు. కూటమిగా వచ్చినా వ్యక్తిగతంగా వచ్చిన ఈసారి గెలుపు YCPదేనని ధీమా వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలతో పరిపాలనను బ్రష్టు పట్టించింది చంద్రబాబు అని ఎద్దేవ చేశారు. ఇంటి వద్దకు పాలన అందించే విశ్వసనీయత గల ప్రభుత్వం YCP ప్రభుత్వం అని, ఓటు వేసి గెలిపించాలన్నారు.

News April 29, 2024

ప్రకాశం: నేటి నుంచి ఓపెన్ స్కూలు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు

image

ఏపీ ఓపెన్ స్కూలు సొసైటీ పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారం నుంచి మే 4వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని డీఈవో సుభద్ర తెలిపారు. పరీక్షలు జూన్ 1 నుంచి 8వతేదీ వరకు జరుగుతాయన్నారు. జిల్లాలోని ఓపెన్ సొసైటీ స్టడీ సెంటర్ల కో ఆర్డినేటర్లు ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు వివరాలను తెలియజేయాలని చెప్పారు.