Andhra Pradesh

News April 29, 2024

శ్రీకాకుళం: సూర్యనారాయణ స్వామి ఆదాయం

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయ వివరాలను అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ.1,37,800లు, పూజలు విరాళాల రూపంలో రూ.53,807లు, ప్రసాదాల రూపంలో రూ.1,77,790లు, శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. నిన్న ఆదివారం రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు.

News April 29, 2024

అధికారులే ఇళ్ల వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తారు: ఢిల్లీ రావు

image

విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎన్నికల అధికారి, కలెక్టర్ ఢిల్లీ రావు ఆదివారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే ఒకటో తారీకు నుంచి పెన్షన్ పంపిణీ మొదలవుతుందన్నారు. డోర్ టు డోర్ డీబీటీ విధానాల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. నడవలేని, బయటకు రాలేని వారు ఇంటి వద్దే ఉండాలని, అధికారులే ఇళ్ల వద్దకు వచ్చి పెన్షన్ అందజేస్తారన్నారు.

News April 29, 2024

21 నుంచి కళ్యాణ వేంకన్న బ్రహ్మోత్సవాలు

image

నారాయణవనం శ్రీపద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మే 21 నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. మే 15న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేసి మే 20న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో రోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

News April 29, 2024

ఏపీ సెట్ ప్రవేశ పరీక్షకు 79.25% హాజరు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీసెట్ 2024 ప్రవేశ పరీక్షకు విశాఖ జిల్లాలో 79.25% హాజరు నమోదైనట్లు మెంబర్ సెక్రటరీ ఆచార్య జి.ఎం.జె రాజు తెలిపారు. పరీక్షకు 9311 మంది దరఖాస్తు చేసుకోగా 7379 మంది హాజరయ్యారు. 1932 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు. విశాఖ నగరంలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి.

News April 28, 2024

రేపు గణపవరంలో పవన్ బహిరంగ సభ

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 29న ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వారాహి విజయభేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సాయంత్రం ఐదు గంటలకు జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులు కోరారు. అలాగే ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మరాజు పాల్గొంటారని తెలిపారు.

News April 28, 2024

గుంటూరు జిల్లాలో భారీగా నగదు, మద్యం పట్టివేత

image

జిల్లాలో ఆదివారం ప్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు పశ్చిమలో 1.62 లీటర్ల మద్యం, పొన్నూరులో 7.2 లీటర్ల మద్యం, రూ.2,70 లక్షలు నగదు సీజ్ చేశామన్నారు. తెనాలి పరిధిలో రూ.2,21,100/-ల నగదు, తాడికొండ పరిధిలో రూ.1,20 లక్షలు, ప్రత్తిపాడు పరిధిలో రూ. లక్ష నగదు పట్టుకున్నామన్నారు. జిల్లాలో ఏప్రిల్ 28వ తేదీ వరకు రూ.2,53,42,262/- విలువ గల మద్యం, నగదు సీజ్ చేశామన్నారు.

News April 28, 2024

కంచిలి: రహదారిపై అదుపుతప్పి బోల్తా పడిన కారు

image

మండలంలోని పెద్ద కొజ్జిరియా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సోంపేట ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 28, 2024

జగన్ ప్రభుత్వాన్ని అరటి తొక్కలా పడేయాలి: పవన్

image

అరటిపండు తొక్కలాగా జగన్ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో పడేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. ఏలేశ్వరంలో పవన్ ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. దళితుల కోసం గత టీడీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టిందన్నారు.

News April 28, 2024

BREAKING: కడప-తాడిపత్రి హైవేపై రోడ్డు ప్రమాదం

image

కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలోని వల్లూరు మండలం తోల్లగంగనపల్లె సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కడప నుంచి కమలాపురం వైపు బైక్‌లో వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

News April 28, 2024

చీమకుర్తి: భారీగా గోవా మద్యం పట్టివేత 

image

చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడులో భారీ మద్యం డంపును సెబ్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన గంగిరేగుల వెంకట్‌రావు గోవా నుంచి తెచ్చిన 180ML బాటిళ్లు 1001లను మరోచోటకి తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు సెబ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు విలేకరులతో మాట్లాడుతూ.. అతని కాల్ డేటా ఆధారంగా మిగిలిన నిందితులను గుర్తించి కేసు నమోదు చేస్తామని చెప్పారు.