Andhra Pradesh

News April 28, 2024

 వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే నాగరాజు 

image

పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే నాగరాజు రెడ్డి ఆదివారం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. నేడు తాడిపత్రిలో జరిగిన సీఎం సభలో జగన్ ఆయనకు వైసీపీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని నాగరాజు తెలిపారు. 

News April 28, 2024

నెల్లూరు: వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోదరుడు

image

సర్వేపల్లి మాజీ MLA ఈదురు రామకృష్ణారెడ్డి సోదరుడు రాంప్రసాద్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయనకు వైసీపీ కండువా కప్పారు. ముత్తుకూరు మండలంలో రాంప్రసాద్ రెడ్డికి గట్టిపట్టుందని.. అలాంటి నాయకుడు వైసీపీలోకి రావడం సంతోషంగా ఉందని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.

News April 28, 2024

వాళ్ల మధ్య లవ్ ట్రాక్ ఉంది: షర్మిల

image

కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని షర్మిల స్పష్టం చేశారు. విశాఖ నగరం అక్కయ్యపాలెం, మహారాణి పార్లర్ వద్ద రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీగా సత్యారెడ్డిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తారని చెప్పారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని ఎద్దేవా చేశారు. విశాఖ అభివృద్ధికి ఈ ఐదేళ్లలో వైసీపీ చేసిందేమీ లేదని మండిపడ్డారు.

News April 28, 2024

ఎల్లుండి కలికిరికి జగన్ రాక

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ప్రచారానికి సీఎం జగన్ రానున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు కలికిరికి చేరుకుంటారు. కలికిరి నాలుగు రోడ్ల కూడలిలో జరిగే బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ మేరకు వైసీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News April 28, 2024

కోడూరు: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

మండలంలోని దింటి మెరక ప్రధాన పంట కాలువ గట్టుపై ఆదివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమయింది. కోడూరు ఎస్సై శిరీష కాలువ గట్టుపై నివసిస్తున్న యానాదుల గుడిసెల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం అందిందన్నారు. ఈ విషయంపై అవనిగడ్డ సీఐ త్రినాథ్ మృతుడి వివరాలు, మరణానికి గల కారణలపై విచారణ జరుపుతున్నట్లు ఎస్సై చెప్పారు.

News April 28, 2024

మే 1-5 వరకు ఖాతాల్లో పెన్షన్ జమ: కలెక్టర్ హిమాన్షు

image

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మే 1 నుంచి 5వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ చేపడతామని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం వెల్లడించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో పెన్షన్ సొమ్ము జమ చేస్తామన్నారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికి పరిమితమైన వారు, సైనిక, సంక్షేమ పింఛన్లు పొందే వారికి ఇంటి వద్దనే సెక్రటేరియట్ సిబ్బంది పెన్షన్లు అందజేస్తారన్నారు.

News April 28, 2024

ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి: ఎస్పీ సిద్ధార్థ కౌశల్

image

ఎన్నికల్లో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశించారు. చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరులోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎన్నికల నేపథ్యంలో అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ఆదివారం దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలన్నారు.

News April 28, 2024

VZM: ‘పింఛన్లు సొమ్ము నేరుగా ఖాతాల్లోకే’

image

సామాజిక పింఛన్ల పంపిణీపై కలెక్టర్ నాగలక్ష్మి కీలక ప్రకటన చేశారు. మోడల్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో దివ్యాంగులు, సైనిక్ వెల్ఫేర్ పింఛన్లు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రమే సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి సొమ్ము అందజేస్తారని చెప్పారు. అలాంటి వారిని ఇప్పటికే గుర్తించామని స్పష్టంచేశారు. మిగిలిన వారికి డీబీటీ విధానం ద్వారా మే 1న జమ చేస్తామని తెలిపారు.

News April 28, 2024

పెమ్మసాని చంద్రశేఖర్‌కు కిలారి సవాల్

image

తాను రూ.2వేల కోట్లు సంపాదించానని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అబద్ధాలు చెబుతున్నారని, దమ్ముంటే నిరూపించాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య సవాల్ విసిరారు. ఆదివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. నిరూపించకపోతే పెమ్మసానికి ఉన్న రూ.5,700 కోట్లు తనకు ఇవ్వాలన్నారు. చంద్రబాబుకు గుంటూరు MP అభ్యర్థి దొరక్క అమెరికా నుంచి డబ్బుల సంచులతో పెమ్మసానిని దిగుమతి చేసుకున్నాడని ఎద్దేవా చేశారు.

News April 28, 2024

గుంతకల్ రైల్వే స్టేషన్‌లో భారీగా నగదు సీజ్

image

గుంతకల్ రైల్వే స్టేషన్ వద్ద ఎన్నికల నేపథ్యంలో ఆదివారం రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ మహిళ బ్యాగులో ఎలాంటి రశీదులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.50 లక్షల నగదును సీజ్ చేసినట్లు రైల్వే సీఐ నగేశ్ బాబు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం, గంజాయి, డబ్బును అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ ప్రజలను సీఐ హెచ్చరించారు.