Andhra Pradesh

News April 28, 2024

విశాఖ: 502 క్లిష్టమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపు

image

విశాఖ జిల్లాలో ఎన్నికలకు 15 వేలమంది ఉద్యోగులను వినియోగిస్తున్నట్లు కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. జిల్లాలో 502 క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. అక్కడ పటిష్ఠ చర్యలు చేపడుతున్నామన్నారు. ఏడు విభాగాల్లో 110 బృందాలను నియమించామని చెప్పారు. మైక్రో అబ్జర్వర్, వీడియో గ్రాఫర్స్ అందుబాటులో ఉన్నారన్నారు. కంట్రోల్ రూములను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.

News April 28, 2024

తర్లుపాడు: గుంటలో పడి వ్యక్తి మృతి

image

తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే ప్రధాన రహదారిలోని సీతానాగులవరం గ్రామం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనదారుడు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంటలోపడి చనిపోయాడని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న తర్లుపాడు ఎస్సై వేముల సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదం గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News April 28, 2024

VZM: కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్ల పరిశీలన 

image

గరుగుబిల్లి ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి ఎస్ శోభిక ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి అరకు పార్లమెంటు  నియోజకవర్గంతో పాటు పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు ఉద్యాన కళాశాలలో ఏర్పాట్లను చేస్తున్నారు. 

News April 28, 2024

తిరుప‌తిలో ఫ్యాక్ష‌న్‌కు చోటు లేదు: ఆరణి

image

తిరుప‌తిలో క‌డ‌ప ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు చోటు లేద‌ని జ‌న‌సేన ఎమ్మెల్యే అభ్య‌ర్థి ఆర‌ణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి నగరంలోని 46, 48వ డివిజన్లలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ‌త 30 ఏళ్లుగా రాజారెడ్డి ద్వారా క‌డ‌ప సంస్కృతిని తిరుప‌తిలో అమ‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా భూమన క‌రుణాక‌ర్ రెడ్డి చేయిస్తున్న పనే కదా అని ఆరణి ప్ర‌శ్నించారు.

News April 28, 2024

పవన్‌ కళ్యాణ్‌కు కన్నబాబు కౌంటర్

image

కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు పవన్‌ కళ్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘చంద్రబాబు పార్ట్‌నర్ పవన్ పిచ్చిగా డాన్స్ వేస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు. చిరంజీవి ఆహ్వానం మేరకు తాను 2009లో PRPలో చేరా. ఆయన నాకు రాజకీయ భిక్ష పెట్టారు. పవన్ రాజకీయాలకు పనికిరారు. చిరంజీవి తమ్ముడు కాకుంటే టీ షాప్‌లో పని చేసేవారు’ అని అన్నారు. కాగా.. నిన్న కన్నబాబుపై పవన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

News April 28, 2024

కృష్ణా: మే 1న పెన్షన్ దారుల బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ జమ

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ నెల పెన్షన్లను మే 1వ తేదీన పెన్షన్ దారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. బ్యాంక్ ఖాతా లేని వారికి సచివాలయ ఉద్యోగులు మే 1 నుంచి 5వ తేదీ లోపు వారి ఇళ్లకు వెళ్లి ఇస్తారని అన్నారు. జిల్లాలో మొత్తం 2,43,400 మంది పెన్షన్ దారులకు రూ.71.75కోట్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. పెన్షన్ దారుల్లో 75% మందికి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయన్నారు.

News April 28, 2024

కర్నూల్‌లో క్లీన్ స్వీప్ చేస్తున్నాం: చంద్రబాబు

image

కర్నూలులో జిల్లాలో ఈ సారి క్లీన్ స్వీప్ చేస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. మంత్రాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మీకు తాగడానికి నీళ్లు ఇవ్వలేదుగాని, ఇసుకను దొంగిలించాడని ఆరోపించారు. ఆయన ఉద్యోగం, నీళ్లు, రోడ్డు పనులు ఏమైనా చేశాడా అని ప్రశ్నించారు. ఆయన బడుగు బలహీన వర్గాల రక్తాలు తాగే వ్యక్తని సంచలన వ్యాఖ్యలు చేశారు.

News April 28, 2024

కమలాపురం-యర్రగుంట్ల హైవేపై రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి

image

ఖాజీపేటకు చెందిన ఆటో డ్రైవర్ బాబాఫకృద్దీన్(40) రోడ్డు ప్రమాదంలో ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బాబాఫకృద్దీన్ యర్రగుంట్ల నుంచి కమలాపురానికి ఆటోలో వస్తుండగా గ్రామచావిడి వద్ద ఆయనకు ఉన్నట్లుండి ఫిట్స్ వచ్చాయి. ఈ క్రమంలో ఆటోను పక్కకు ఆపే క్రమంలో రోడ్డు పక్కన గోడకు ఢీ కొట్టింది. ప్రమాదంలో డ్రైవరు అక్కడిక్కడే మృతి చెందాడు.  

News April 28, 2024

స్వేచ్ఛగా ఓటును వినియోగించుకోవాలి: కడప ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అన్నారు. ఆదివారం ఆయన జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం తలమంచిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నకొమెర్లను సందర్శించారు. ప్రజలు ఎవరి ప్రలోభాలు, బెదిరింపులకు భయపడవద్దని, పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

News April 28, 2024

తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు..!

image

CM జగన్ నిన్న మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో స్కిల్ హబ్, ప్రతి మండలంలో బాలికల జూనియర్ కాలేజీ నిర్మిస్తామని చెప్పారు. ఏదైనా ఆవాసంలో 50 శాతం దళితులు(కనీసం 500 మందిపైన) ఉంటే వాటిని పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈప్రకారం కొన్ని వందల దళితవాడలు పంచాయతీలుగా మారే అవకాశం ఉంది.