Andhra Pradesh

News April 28, 2024

పత్తికొండ: ఆర్డీటీ సెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతి స్టేట్ సిలబస్‌లో 500 మార్కులు, సెంట్రల్ సిలబస్‌లో 420 మార్కులు సాధించిన విద్యార్థులు ఆర్డీటీ సెట్ 2024కు దరఖాస్తు చేసుకోవాలని ఏరియా టీం లీడర్ రెహనా తెలిపారు. అర్హులైన విద్యార్థులు మే 4వ తేదీ నుంచి 10 వరకు దరఖాస్తులను ఆర్డీటీ కార్యాలయంలో అందజేయాలని, మే 19న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు యశోద గార్డెన్‌లోని ఆర్డీటీ ఆఫీసును సంప్రదించాలన్నారు.

News April 28, 2024

తిరుపతి: 22 నుంచి వసంతోత్సవాలు

image

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. మే 21వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్సవాల్లో భాగంగా మే 23వ తేదీ ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం జరగనుంది.

News April 28, 2024

దర్శిలో కత్తులతో దాడి.. యువకుడు మృతి

image

దర్శి మండలంలోని రాజంపల్లిలో ఆదివారం ఇద్దరు వ్యక్తులపై కొందరు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరు అదే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రురాలిని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 28, 2024

తాడేపల్లి: సీఎం కాన్వాయ్ కింద పడ్డ కుక్క

image

తాడేపల్లి నుంచి సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి వస్తుండగా కేసరపల్లి వద్ద సీఎం కాన్వాయ్‌కి కుక్క అడ్డం పడింది. ఈ ఘటనలో కుక్కకు గాయాలు కాగా సీఎం పర్సనల్ సెక్యూరిటీ కుక్కని హాస్పిటల్‌కి తీసుకెళ్లమని గన్నవరం పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించి అనంతరం గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద భద్రంగా ఉంచారు. పూర్తిగా నయం అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోమని సీఎం సెక్యూరిటీ ఆదేశించారు.

News April 28, 2024

కందుకూరులో వైసీపీపై అధికారుల కొరడా

image

ఆదివారం సాయంత్రం కందుకూరులో సీఎం జగన్ సభ జరుగుతున్న సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల అధికారులు కొరడా ఝళిపించారు. సీఎం సభ సందర్భంగా వైసీపీ అభ్యర్థి బుర్రా మధు, జగన్ ఫొటోలు ఉన్న అనేక ఫ్లెక్సీలు అనుమతి లేకుండా పట్టణంలో వెలిశాయి. దానిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది హడావుడిగా ఫ్లెక్సీలన్నింటిని తొలగించారు.

News April 28, 2024

రేణిగుంట: ICIలో ప్రవేశాలు

image

రేణిగుంట మండలం కురుకాలువ వద్ద ఉన్న భారతీయ పాకశాస్త్ర సంస్థ (Indian Culinary Institute)లో 2024 -25 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. BB.A/MBA(Culinary Arts) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు www.icitirupati.in వెబ్‌సైట్ చూడాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 25.

News April 28, 2024

ప్రకాశం: బదిలీ టీచర్ల జీతాలకు లైన్ క్లియర్

image

జిల్లాలో గత ఏడాది ప్రభుత్వం ద్వారా బదిలీ ఉత్తర్వులు పొంది ఇతర పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల జీతాల చెల్లింపునకు లైన్ క్లియర్ అయింది. తొమ్మిది నెలలుగా జీతాల కోసం నిరీక్షిస్తున్న వారి కల ఫలించింది. వీరి జీతాల చెల్లింపునకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 34 మంది టీచర్లకు జీతాలు నిలిచిపోయాయని డీఈవో సుభద్ర తెలిపారు.

News April 28, 2024

పలమనేరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్

image

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన పలమనేరు మండలంలో చోటుచేసుకుంది. గంగవరం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జీవరత్నం తన భార్యతో కలిసి పలమనేరు నుంచి తన స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా పలమనేరు వైపు వస్తున్న లగేజ్ ఆటో కంచిరెడ్డిపల్లి జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో జీవరత్నం అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను పలమనేరు ఆసుపత్రికి తరలించారు.

News April 28, 2024

బాబు సమక్షంలో టీడీపీలో చేరిన బాపట్ల మాజీ ఎమ్మెల్యే

image

బాపట్ల మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి ఆదివారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. బాపట్ల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఆదివారం చంద్రబాబును కలిసి తెలుగుదేశంలో చేరారు. ఆయనను చంద్రబాబు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేస్తానని చీరాల గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

News April 28, 2024

విజయనగరం: ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమం

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున చిన్న తప్పు కూడా జరగకుండా అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో రిసెప్షన్ సెంటర్ల ఇన్‌ఛార్జ్‌లు, అధికారులు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అధికారులకు అప్పగించిన విధుల పట్ల పూర్తి అవగాహనా కలిగి ఉండాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు.