Andhra Pradesh

News April 28, 2024

ప.గో.: అప్పట్లో ప్రత్యర్థులు.. ఇప్పుడు దోస్తులు

image

తాడేపల్లిగూడెం YCP అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ఇప్పటివరకు 6సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. ఇది 7వ సారి. అయితే గతంలో ప్రత్యర్థులుగా తనపై బరిలో నిలిచి గెలిచిన వ్యక్తులు ఇప్పుడు ఆయన గెలుపు కోసం కృషిచేయడం గమనార్హం. 1989లో తాడేపల్లిగూడెం MLAగా గెలుపొందిన పసల కనక సుందరరావు, 2009లో గెలుపొందిన ఈలి నాని అప్పట్లో ‘కొట్టు’కు ప్రత్యర్థులే. ఇప్పుడు వారిద్దరూ కొట్టుసత్యనారాయణ తరఫున ప్రచారం చేస్తున్నారు.

News April 28, 2024

ALERT.. నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత

image

భానుడి ప్రతాపానికి శనివారం నెల్లూరు జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.

News April 28, 2024

తాడేపల్లి: సీఎం కాన్వాయ్‌ కింద పడ్డ కుక్క

image

తాడేపల్లి నుంచి సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి వస్తుండగా కేసరపల్లి వద్ద సీఎం కాన్వాయ్‌కి కుక్క అడ్డం పడింది. ఘటనలో కుక్కకు గాయాలు అవ్వడంతో సీఎం పర్సనల్ సెక్యూరిటీ కుక్కని హాస్పిటల్ తీసుకెళ్లమని గన్నవరం పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించి అనంతరం గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద భద్రంగా ఉంచారు. పూర్తిగా నయం అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోమని సీఎం సెక్యూరిటీ ఆదేశించారు.

News April 28, 2024

మార్కాపురం: కందులపై కేసు నమోదు

image

మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లుగా మార్కాపురం పట్టణ ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ శనివారం తెలిపారు. ఈనెల 25వ తేదీన నామినేషన్ సందర్భంగా కళాశాల రోడ్డులోని ఓ టీడీపీ నేత వెంచర్ లో అనుమతి లేకుండా కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు వివిధ అంశాలపై ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

News April 28, 2024

రాజకీయ ప్రచార వాహనాలకు అనుమతి తప్పనిసరి

image

రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనుమతి లేకుండా వాహనాలను
ప్రచారానికి వినియోగించారదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి M. హరి నారాయణన్ తెలిపారు.  ఆయన మాట్లాడుతూ.. అనుమతి పొందిన వాహనాలు అనుమతి పత్రం( పర్మిషన్) వాహనం ముందు భాగంలో అతికించాలన్నారు . FST/SST టీమ్ లు ప్రచార వాహనాలకు అనుమతులు ఉన్నాయో లేదో తనిఖీ చేస్తామన్నారు.

News April 28, 2024

REWIND: శ్రీకాకుళం: 20 ఏళ్లు సర్పంచ్.. ఆ తర్వాత MLA, MP

image

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామానికి చెందిన అప్పయ్యదర రాజకీయాల్లో అరుదైన ఘనత సాధించారు. గ్రామానికి 1961 నుంచి 1981 వరకు 20 ఏళ్లపాటు సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1984లో ఎంపీగా గెలుపొందారు. 1994లో టీడీపీ నుంచి, 2004లో కాంగ్రెస్ నుంచి టెక్కలి MLAగా విజయం సాధించారు. కుగ్రామంలో జన్మించిన ఆయన సర్పంచ్ మొదలు ఎమ్మెల్యే, ఎంపీగా సేవలందించడం విశేషం.

News April 28, 2024

గుంటూరు: షెడ్యూల్ విడుదల

image

ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదలైనట్లు ఆ శాఖ జిల్లా సమన్వయకర్త కేఎంఏ హుస్సేన్ శనివారం తెలిపారు. సత్తెనపల్లిలో ఆయన మాట్లాడుతూ.. అపరాధ రుసుము లేకుండా ఈ నెల 29 నుంచి మే 4 వరకు ఆన్‌లైన్‌లో చెల్లించాలని ఆయన సూచించారు. జూన్ 1 నుంచి 8 వరకు పరీక్షలు జరగనున్నాయని తెలిపారు.

News April 28, 2024

ప్రతి ఒక్కరు ఓటు వేయాలి: కలెక్టర్ మల్లికార్జున

image

వచ్చేనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్‌కే బీచ్‌లో నిర్వహించిన 5K రన్‌లో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైజాగ్ వాలంటీర్లు, స్వీప్ అధికారులు, సాధారణ పౌరులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.

News April 28, 2024

చిత్తూరుకు రేపు నందమూరి బాలకృష్ణ రాక

image

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం చిత్తూరుకు రానున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా వస్తున్నట్లు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీ విగ్రహం సర్కిల్ వద్ద బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని పేర్కొన్నారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

News April 28, 2024

ఓపెన్ స్కూల్ పరీక్ష ఫలితాల విడుదల

image

ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ లక్ష్మీ నారాయణ తెలిపారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 5,777 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయగా.. 1,445 మంది ఉత్తీర్ణత సాధించారు. 1,404 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. 209 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం అధికార వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన తెలపారు.