India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజమండ్రిలోని నాళం భీమరాజు వీధిలో కొలువైయున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం ద్వాపర యుగానికి చెందినదిందని భక్తుల విశ్వాసం. సుమారు 200సం.లు క్రితమే ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ, ఆలయ పునః నిర్మాణం జరిగిందిని స్థానికులు తెలిపారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకొని కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సర్ ఆర్థర్ కాటన్ దొర 1858లో ధవలేశ్వరం బ్యారేజీ పూర్తయ్యాక ఈ ఆలయానికి గంటను భక్తితో బహుకరించినట్లు చెబుతున్నారు.
పారా రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 13 మంది ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ వేదికగా ఈనెల 29 నుంచి 31 వరకు జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ -2025 జరగనుంది. ఈ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారులు బుధవారం బయలుదేరారు. వీరందరికి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులుదయానంద్ అభినందనలు తెలిపారు.
కర్నూలు జిల్లాలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 12(1)సీ కింద 1,082 మంది విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యూల్ పాల్ తెలిపారు. ఎంపికైన వారు నేటి నుంచి 31వ తేదీ వరకు కేటాయించిన పాఠశాలల్లో అడ్మిషన్ పొందాలన్నారు. సంబంధిత అధికారులు మండలాల వారీగా వివరాలను సేకరించి, నివేదికను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి ఆనం నారాయణరెడ్డి అన్నారు. కాణిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ‘కాణిపాకంలో రూ.4 కోట్లతో నూతన అన్నదాన భవనాన్ని ప్రారంభించాం. ఆగమన పద్ధతి ప్రకారం ఆలయాల్లో పూజలు నిర్వహించాలని ఆదేశించాం. సీఎం చంద్రబాబు ఆలయాల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నారు’ అని ఆయన అన్నారు.
తిరుపతి నుంచి భూమన కరుణాకర రెడ్డిని తరిమి కొట్టడం ఎవరి వల్లా కాదని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. ‘పాపాల భైరవుడు బిఆర్ నాయుడుని మాత్రం స్వామి వారే తరిమి కొడతారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. టీటీడీ స్థలాన్ని పర్యాటక శాఖకు బదలాయించడంపై భూమన కరుణాకర రెడ్డి ఘోరమైన అపచారం జరిగిందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో అంబటి రాంబాబు ఈ విధంగా స్పందించారు.
గుంటూరులో రైల్ వికాస్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో రైల్వే డీఆర్ఎం సుధేష్ణ సేన్ మాట్లాడారు. ప్రధాన మంత్రి విక్సిత్ భారత్ రోజ్ గార్ యోజన పథకం యజమానులను కొత్త ఉద్యోగులను నియమించడానికి ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ పథకం కింద కేంద్రం నిర్దిష్ట కాలం వరకు ఉద్యోగులకు, యజమానులకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తుందని చెప్పారు. దీతో యజమానుల భారం తగ్గి, కొత్త ఉద్యోగావకాశాలు సృష్టించబడతాయని అన్నారు.
గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ అభివృద్ధి సూచికపై శిక్షణా కార్యక్రమం జరిగింది. జెడ్పీ ఛైర్‌పర్సన్ హెనీ క్రిస్టీనా మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల పురోగతిని అంచనా వేసి, డేటా ఆధారిత పాలనకు ఈ సూచిక దోహదం చేస్తుందని తెలిపారు. సీఈఓ వీర్ల జ్యోతిబసు మాట్లాడుతూ.. స్థానిక స్థాయిలో 9 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై పనితీరు కొలవడంలో ఇది కీలకమని, పారదర్శకత పెరగటంతో ప్రజలకు స్పష్టత లభిస్తుందన్నారు.
గుంటూరు కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ రైతుల నుంచి పొగాకు కొనుగోలు నిరంతరం సాగాలని ఆదేశించారు. జిల్లాలో 3,895 మంది రైతులు పొగాకు సాగు చేయగా, వారిలో 3,370 మంది సీఎం యాప్‌లో నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటివరకు 1,614 మందికి షెడ్యూల్ ఇచ్చి, మార్కెఫెడ్ ద్వారా 2,200 టన్నులు, ప్రైవేటు కంపెనీలు 3,500 టన్నులు కొనుగోలు చేశాయని ఆయన వివరించారు.
DSC అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలలో ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తే కేసులు నమోదు చేస్తామని డీఈవో వరలక్ష్మీ హెచ్చరించారు. సర్టిఫికెట్ల పరిశీలనకు నగరంలో రెండు కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకపోయినా, పరిశీలనకు గైర్హాజరైన ఉద్యోగం లేనట్లేనని తెలిపారు. క్రీడా కోటా కింద అభ్యర్థుల సర్టిఫికెట్లను రాష్ట్ర విద్యాశాఖ అధికారుల సమక్షంలో పరిశీలిస్తామన్నారు.
కొండాపురంలోని లావునూరు రహదారిలో మంగళవారం రాత్రి బైకు – కారు ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన శివకుమార్, రామాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. వారు దుగ్గుపల్లి నుంచి కొండాపురం వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది.
Sorry, no posts matched your criteria.