Andhra Pradesh

News April 28, 2024

విజయనగరం: మద్యం మత్తులో విధులకు ఉద్యోగి

image

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిఆస్పత్రిలో తాత్కాలిక పద్ధతిపై పని చేస్తున్న ఓ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. సదరు ఉద్యోగి ఓపీ విభాగంలో పని చేస్తున్నాడు. ఓపీ చీటీ కావాలని రోగులు అడగగా ఉద్యోగి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో వారు ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేయగా, సదరు వ్యక్తి నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు.

News April 28, 2024

పెదబయలులో అర్ధరాత్రి దారుణ హత్య

image

అల్లూరి జిల్లా పెదబయలు మండల కేంద్రంలో శోభ హిమరాజు(33)ని అప్పారావు అనే నిందితుడు కత్తితో హత్య చేశాడు. శనివారం అర్ధరాత్రి శోభ హిమరాజు ఓ పెళ్లికి వచ్చి పెదబయలులో ఓ డాబాపై నిద్రిస్తున్నాడు. అదును చూసుకుని అప్పారావు కత్తితో మెడపై గాయపరిచాడు. క్షతగాత్రుడిని పాడేరు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేయగా, నిందితుడు పరారీలో ఉన్నాడు.

News April 28, 2024

30న యర్రగొండపాలెంకు చంద్రబాబు రాక

image

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 30వ తేదీన యర్రగొండపాలెంకు రానున్నారు. ఉదయం 10 గంటలకు నియోజకవర్గాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు పార్టీ జిల్లా నాయకులకు సమాచారం అందగా వారు చంద్రబాబు నాయుడు సభ ఏర్పాట్లలో సన్నద్ధమయ్యారు.

News April 28, 2024

వెంకటగిరిలో జోరుగా ఏర్పాట్లు

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం వెంకటగిరి పట్టణానికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.

News April 28, 2024

కడప: మే 4లోపు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించాలి

image

ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయిన అభ్యర్థులు మే 4 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈఓ అనురాధ, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. రూ.25 అపరాధ రుసుంతో మే 5 నుంచి 6 వరకు, రూ.50 అపరాధ రుసుంతో 7 నుంచి 8 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. అలాగే తత్కాల్ పద్ధతిలో పదో తరగతికి రూ.500, ఇంటర్‌కు రూ.1000తో ఫీజు మే 9 నుంచి 10 వరకు గడువు ఉంటుందని తెలిపారు.

News April 28, 2024

బాపట్లలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

image

బాపట్ల పట్టణంలోని ప్యాడిసన్ పేట జగనన్న కాలనీ హైవే వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళుతున్న కారు ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారు వెంగళ విహర్‌కు చెందిన వారుగా గుర్తించారు.

News April 28, 2024

బీఈడీ రెండో సెమిస్టర్ ఫలితాలు

image

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ 2023 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండో సెమిస్టర్ ఫలితాలను శనివారం వైస్ ఛాన్స్‌లర్ సుధీర్ ప్రేమ్ కుమార్ విడుదల చేశారు. ఈ పరీక్షకు 2,828 మంది విద్యార్థులకు హాజరు కాగా.. 2,591 మంది పాసయ్యారని పేర్కొన్నారు. సప్లమెంటరీ పరీక్షకు 528 మంది విద్యార్థులకు గాను 440 మంది విద్యార్థులు పాసయ్యారన్నారు.

News April 28, 2024

స్వతంత్ర అభ్యర్థి వేటుకూరికి సింహం గుర్తు

image

ఉండి నియోజకవర్గ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజుకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మద్దతుగా నిలిచింది. దీంతో ఆ పార్టీ గుర్తు అయిన సింహం శివరామరాజుకు లభించింది. ఇప్పటివరకు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న శివరామరాజు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు.

News April 28, 2024

గుంటూరు జిల్లాలో తుది ఓటర్లు 17,91,543 మంది

image

గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో 17,91,543 మందికి ఎన్నికల సంఘం ఓటు హక్కు కల్పించింది. జిల్లాలో పురుష ఓటర్లు 8,65,377 మంది, మహిళలు 9,26,007 మంది, మూడో వర్గం 159 మంది కలిపి మొత్తం 17,91,543 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 60,630 మంది ఎక్కువ. తుది జాబితాలో ఓటు పొందిన వారు మే 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

News April 28, 2024

విశాఖ: ఎన్నికల బరిలో నిలిచే వారెవరో.. తేలేది రేపు

image

సార్వత్రిక ఎన్నికల పోటీలో నిలిచే వారి సంఖ్య రేపు స్పష్టం కానుంది. శనివారం నాడు ఎవరూ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువుంది. ఈరోజు సెలవు కావడంతో సోమవారం పలువురు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. లోక్ సభకు 33 మంది, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 119 మంది నామ పత్రాలు దాఖలు చేశారు. వీరిలో ఎంతమంది ఉంటారనేది సోమవారం తేలనుంది.