Andhra Pradesh

News April 28, 2024

నలుగురు స్పీకర్లను అందించిన సిక్కోలు

image

శ్రీకాకుళం జిల్లాది రాజకీయాల్లో చెరగని ముద్ర. జిల్లావాసులు ఎందరో రాజకీయ హేమాహేమీలతో పాటు నలుగురు స్పీకర్లను సైతం అందించారు. 1955లో టెక్కలి MLAగా గెలిచిన రొక్కం నరసింహం దొర ఆంధ్రరాష్ట్ర 2వ స్పీకర్‌గా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో తంగి సత్యనారాయణ 7వ స్పీకర్‌గా, ప్రతిభాభారతి 11వ స్పీకర్‌గా సేవలు అందించారు. ఆమదాలవలస MLA తమ్మినేని సీతారాం నవ్యాంధ్రప్రదేశ్ 2వ స్పీకర్‌గా పనిచేశారు.

News April 28, 2024

చౌడేపల్లి: బోయకొండలో ఉద్రిక్తత

image

టీడీపీ, వైసీపీ శ్రేణులు బోయకొండ క్రాస్ వద్ద శనివారం రాత్రి ఘర్షణ పడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికుల కథనం మేరకు.. టీడీపీకి చెందిన చిట్టిబాబు కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో వివాదం మొదలైంది. దీంతో వైసీపీ, టీడీపీ నేతలు రాళ్ల దాడికి దిగారు. ఈ సంఘటనలో ఇరు పార్టీ నేతలకు గాయాలు అయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 28, 2024

నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం: లోకేశ్

image

జగన్ రెడ్డి తనకు తగిలిన గులకరాయి గాయంపై బ్యాండేజ్ తీసేస్తే ఎలాంటి మచ్చాలేదని, దీంతో ఆయన నటన ప్రజలకు అర్థమైందని నారా లోకేశ్ పేర్కొన్నారు. శనివారం రాత్రి మంగళగిరి పట్టణం ఇందిరానగర్‌లో నిర్వహించిన రచ్చబండ సభలో లోకేశ్ మాట్లాడుతూ.. ఇందిరా నగర్‌లో నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. స్టేడియం పనులు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపడతామని తెలిపారు.

News April 28, 2024

బీసీ గురుకుల ప్రవేశ పరీక్షకు 494 మంది గైర్హాజరు

image

అనంతపురం జిల్లాలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలకు 494 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారత అధికారి ఖుష్బు కొఠారి తెలిపారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించారు. జిల్లాలో 11 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. పరీక్షలకు 2537 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 2043 మంది హాజరయ్యారని తెలిపారు.

News April 28, 2024

కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేసిన కడప SP

image

సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్నపల్లి క్రాస్ చెక్ పోస్టు విధుల్లో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్ కె.శివప్రసాద్ (పి.సి 2825)ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్.పి సిద్ధార్థ్ కౌశల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ క్రమశిక్షణ ఉల్లంఘించి మద్యం సేవించి విధులకు హాజరయినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. దీంతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సస్పెన్షన్ వేటు వేశారు.

News April 28, 2024

పిఠాపురం: ఈ నెల 29, 30 తేదీల్లో పవన్ కళ్యాణ్ రోడ్ షో

image

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 29, 30వ తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించనున్నట్లు నియోజకవర్గ టీడీపీ SVSN వర్మ తెలిపారు. 29న గొల్లప్రోలు మండలం చెందుర్తి నుంచి రోడ్‌షో ప్రారంభించి కొడవలి, వన్నెపూడి, మీదుగా పిఠాపురం మండలంలోకి ప్రవేశించి వెల్దుర్తి, పి.తిమ్మాపురం మీదుగా రోడ్‌షో సాగుతుందన్నారు. 30న చిత్రాడలో ప్రారంభమై గొల్లప్రోలు పట్టణంలో కొనసాగుతుందన్నారు.

News April 28, 2024

ఒంగోలులో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

image

సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒంగోలులోని గొడుగుపాలెంలో శనివారం వేకువజామున జరిగింది. ఒకటో పట్టణ సీఐ ఎం.లక్ష్మణ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న షేక్ ముస్తాక్ కుమార్తె ఆరిఫా సుల్తానా(19) నగరంలోని రైజ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అవడంతో ఇంట్లో ఉరేసుకుంది. ఘటనపై కేసు నమోదైంది.

News April 28, 2024

శ్రీకాకుళం: ACCIDENT.. 19 ఏళ్ల యువకుడు మృతి 

image

శ్రీకాకుళం జిల్లా గార మండలం తూలుగు కూడలి సమీపంలో సీఎస్పీ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. గార గ్రామానికి చెందిన ఓం దత్తకుమార్(19) ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మినీ లగేజి వాహనం ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. SI కృష్ణ ప్రసాద్ కేసునమోదు చేశారు.

News April 28, 2024

శ్రీకాకుళం: ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్

image

పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సుల ప్రవేశాలకు సంబంధించి శనివారం శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన పాలిసెట్‌ ప్రశాంతంగా ముగిసింది. శ్రీకాకుళం డివిజన్‌లోని 26 కేంద్రాల్లో 7,195 మందికి 6,492 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. టెక్కలి డివిజన్‌లోని 16 కేంద్రాల్లో 4,816 మంది విద్యార్థులకు గాను 4,362 మంది హాజరయ్యారు. మొత్తంగా 90.37శాతం హాజరైనట్టు జిల్లా సమన్వయకర్తలు గురుగుబెల్లి దామోదరరావు, గోపి తెలిపారు.

News April 28, 2024

గుంటూరు జిల్లాలో రూ.2.46 కోట్లు దొరికాయ్..!

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శనివారం ప్లయింగ్ స్క్వాడ్ లు నిర్వహించిన తనిఖీలలో తెనాలి నియోజకవర్గ పరిధిలో రూ.1,00,000/- నగదు పట్టుబడింది. అదేవిధంగా తాడికొండ నియోజకవర్గ పరిధిలో రూ.66,500/- ల నగదు సీజ్ చేశారు. జిల్లాలో జరిగిన తనిఖీలలో ఏప్రిల్ 27వ తేది వరకు రూ.2,46 కోట్ల నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేయటం జరిగిందని అధికారులు వెల్లడించారు.