Andhra Pradesh

News April 28, 2024

నార్పల మండలం వాలంటీర్ సస్పెండ్

image

నార్పల మండలం గూగూడు గ్రామానికి చెందిన వాలంటీర్ ఓలయ్యను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకంగా వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 81 మంది వాలంటీర్లు, 18 డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు, 30 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 8 మంది రెగ్యులర్ ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొన్నారు.

News April 28, 2024

ఏపీ సెట్ – 24కు సర్వం సిద్ధం

image

ఏపీ సెట్ – 2024 పరీక్ష ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో కాకుటూరులోని వర్సిటీ కళాశాల, జగన్స్ కాలేజీ, కృష్ణచైతన్య డిగ్రీ కాలేజీ, రావూస్ డిగ్రీ కళాశాల, డీకేడబ్ల్యూ కళాశాల, వీఆర్ ఐపీఎస్ లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు ఏపీ సెట్ ప్రాంతీయ సమన్వయకర్త వీరారెడ్డి తెలిపారు. 1767 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.

News April 28, 2024

పెదకూరపాడులో నీటి గుంతలో దిగి చిన్నారులు మృతి

image

పెదకూరపాడు మండలం కన్నెగండ్ల గ్రామంలో శనివారం ఇద్దరు చిన్నారులు నీటి గుంతలతో దిగి మృత్యువాత పడ్డారు. వేణుగోపాల్‌ (11), ధనుష్‌ (13)లు వేసవి సెలవులు కావడంతో మేనమామ ఊరు కన్నెగండ్లకు వచ్చారు. అయితే శనివారం సాయంత్రం అల్లిపరవు వాగు వద్ద ఉన్న పొలాలకు నీరు నిల్వ చేసుకోవడానికి తవ్విన గుంతలో ఈతకు దిగారు. గుంతలో మట్టి చేరి ఉండడంతో ఇరుక్కుపోయి ఊపిరి ఆడగా మృతి చెందారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News April 28, 2024

ALERT.. అగ్నిగుండంలా రాయలసీమ.. హాటెస్ట్ సిటీగా నంద్యాల

image

భానుడి ప్రతాపానికి శనివారం రాయలసీమ ప్రజలు అల్లాడిపోయారు. దేశంలోనే నంద్యాలలో 44.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. కర్నూలులో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోనే హాటెస్ట్ సిటీగా నంద్యాల నిలవడం గమనార్హం. అనంతపురం 43.7, కడప 43.4, తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.

News April 28, 2024

అయినవాళ్లే మోసం చేశారు: వైఎస్ సునీత

image

జిల్లాలో అందరి మన్ననలు పొందిన మా నాన్న YS వివేకాను దారుణంగా చంపారని సునీతా ఆరోపించారు. శనివారం సింహాద్రిపురం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నా అనుకున్న వాళ్లే మమ్మల్ని మోసం చేస్తున్నారని ఆవేదన చెందారు. మా నాన్నను ఎవరు హత్య చేశారో అత్యున్నత న్యాయస్థానం చెప్పిన ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. తాను మీ ఆడబిడ్డనే అని, షర్మిలను గెలిపించి ప్రజలు మద్దతు తెలపాలన్నారు.

News April 28, 2024

విశాఖ: ‘AP CETకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు’

image

రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏపీ సెట్ 2024 నేడు ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు జరగనుంది. పరీక్షకు నిమిషం ఆలస్యమైన అనుమతించరని మెంబర్ సెక్రటరీ ఆచార్య జీఎంజే రాజు తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 79 కేంద్రాల్లో జరిగే పరీక్షకు 38,078 మంది హాజరుకానున్నారు.

News April 28, 2024

శ్రీకాకుళం: ఒకే గ్రామం నుంచి ముగ్గురు MLAలు

image

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు నాయకులు MLAలు అవడం విశేషం. మండలంలోని మబగాం గ్రామానికి చెందిన ధర్మాన ప్రసాదరావు(1989-94, 1999-2004), కృష్ణదాస్(2004-2014), బగ్గు రమణమూర్తి(2014-2019) నరసన్నపేట నియోజకవర్గానికి MLAలుగా ప్రాతినిధ్యం వహించారు. కాగా ధర్మాన ప్రస్తుతం శ్రీకాకుళం MLAగా కొనసాగుతుండగా.. కృష్ణదాస్ నరసన్నపేట MLAగా వ్యవహరిస్తున్నారు.

News April 28, 2024

పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులకు గడువు పొడిగింపు: గుంటూరు కలెక్టర్

image

పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులకు ఎన్నికల కమిషన్ గడువు పొడిగించిందని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి శనివారం తెలిపారు. తొలుత ఈనెల 26 వరకు అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్ ప్రస్తుతం ఒకటవ తేదీ వరకు గడువును పొడిగించిందన్నారు. కావున ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో అందజేయాలన్నారు.

News April 28, 2024

దర్శి: నిద్రిస్తున్న బాలికపై అత్యాచార యత్నం

image

బాలికపై అత్యాచారానికి యత్నించిన ఘటన ముండ్లమూరు మండలంలో శనివారం జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, తల్లిదండ్రులతో కలిసి ఇంటి మేడపై నిద్రిస్తోంది. దోమలు కుడుతున్నాయని సోదరుడితో కలిసి కిందికి దిగి ఇంటి వరండాలో నిద్రపోయింది. అదే గ్రామానికి చెందిన బ్రహ్మయ్య బాలిక నోరు మూసి, అరిస్తే చంపేస్తానని బెదిరించి, అత్యాచారం చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News April 28, 2024

తూ.గో.: TDPలో చేరిన కోడికత్తి శ్రీను కుటుంబం 

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన జనిపల్లి శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను) కుటుంబీకులు స్థానిక నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ మేరకు ఆయన వారికి టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోడికత్తి శ్రీను అన్న సుబ్బరాజు మాట్లాడుతూ.. తన తమ్ముడు చేయని నేరానికి ఆరేళ్లు విచారణ ఖైదీగా జైలు జీవితం గడిపాడన్నారు.