Andhra Pradesh

News April 28, 2024

నేడు బి కొత్తకోట రోడ్డు షోకు నందమూరి బాలకృష్ణ

image

బి.కొత్తకోటలో ఆదివారం ఉదయం జరిగే రోడ్డు షోలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని తంబళ్లపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరపల్లి జయచంద్రా రెడ్డి పీఏ తెలిపారు. ఉదయం 6గంటలకు మొలకలచెరువుకు, 7.30 గంటలకు పిటిఎంకు, బి.కొత్తకోటకు 8.45కు చేరుకొని బి.కొత్తకోట పట్టణంలో జరిగే రోడ్ షోలో బాలకృష్ణ పాల్గొంటారు.

News April 28, 2024

ALERT: అనంతపురం@ 43.7

image

భానుడి ప్రతాపానికి శనివారం రాయలసీమ ప్రజలు అల్లాడిపోయారు. దేశంలోనే నంద్యాలలో 44.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. కర్నూలులో 44.5 అనంతపురం 43.7, కడప 43.4, తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోనే హాటెస్ట్ సిటీగా నంద్యాల నిలవడం గమనార్హం. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

News April 28, 2024

నేడు వెంకటగిరికి సీఎం జగన్ 

image

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం వెంకటగిరిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ లో దిగుతారు. 1.30 గంటల నుంచి 2.15 గంటల వరకు వెంకటగిరిలోని త్రిభువని సెంటరులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం హెలికాఫ్టర్ లో కందుకూరు బయలుదేరుతారు.

News April 28, 2024

చేజర్ల : వివాహితపై యాసిడ్ దాడి

image

నెల్లూరుకు చెందిన పుట్టా మురార్జి చేజర్ల మండలం కండాపురంలో అక్క కుమార్తె సుప్రజను వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్లుగా నెల్లూరులోనే నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పుట్టింటికి వచ్చిన భార్య సుప్రజపై శనివారం బాత్ రూములు శుభ్రపరిచే యాసిడ్ తో దాడి చేశాడు. సుప్రజను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు.

News April 28, 2024

కర్నూలు జిల్లాలో చంద్రబాబు నేటి పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు హెలికాఫ్టర్‌లో కౌతాళంలోని జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు బస్టాండ్ సెంటర్‌లో ప్రసంగిస్తారు. సాయంత్రం 6.10 గంటలకు గూడూరుకు చేరుకుని బస్టాండ్ సర్కిల్‌లో 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు సభలో మాట్లాడతారు. రాత్రికి గూడూరులోనే బస చేస్తారు.

News April 28, 2024

తూ.గో జిల్లాలో16,23,149 మంది ఓటర్లు: కలెక్టర్

image

తూ.గో జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల తుది జాబితా వివరాలను కలెక్టర్ కె.మాధవీలత శనివారం ప్రకటించారు. జిల్లాలో 7 నియోజకవర్గాలలో 16,23,149 మంది ఓటర్లు ఉండగా.. అందులో పురుషులు 7,92,317, స్త్రీలు 8,30,735, థర్డ్ జెండర్ 97 మంది ఉన్నారన్నారు. రాజమండ్రి రూరల్‌లో అత్యధికంగా పురుషులు 1,33,241 మంది, స్త్రీలు 1,39,561 మంది ఓటర్లు ఉండడం గమనార్హం.

News April 28, 2024

కిలో పొగాకుకు రికార్డ్ ధర

image

మునుపెన్నడూ లేని విధంగా వర్జీనియా పొగాకు రికార్డు ధర పలికింది. గోపాలపురం పొగాకు బోర్డులో కిలో రూ.341కు అమ్ముడయింది. దీంతో పొగాకు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కనిష్ఠ ధర రూ.235గా ఉంది. మొత్తం 1201 బేళ్లు అమ్మకానికి రాగా.. 980 అమ్ముడయ్యాయన్నారు . ఈ ఏడాది కొనుగోలు ప్రారంభంలో కిలో పొగాకు రూ.240 పలకడంతో రైతులు నిరాశ చెందారు. తాజాగా ఊహించని రీతిలో ధర పెరగడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News April 28, 2024

కిర్లంపూడిలో నేడు పవన్ కళ్యాణ్ సభ: జ్యోతుల

image

కిర్లంపూడిలో ఆదివారం జరిగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని జగ్గంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్, జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జి దాట్ల కృష్ణ వర్మ, బీజేపీ నాయకురాలు కామినేని జయశ్రీ తదితరులతో నెహ్రూ సమావేశం నిర్వహించారు.

News April 28, 2024

నేడు ఆర్కే బీచ్‌లో ఓటరు చైతన్య ర్యాలీ: కలెక్టర్

image

స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం 6 గంటలకు ఆర్.కె. బీచ్ లో సుమారు ఐదు వేల మందిని భాగస్వామ్యం చేస్తూ 5కె రన్ ఫర్ ఓట్ అనే పేరుతో ఓటరు చైతన్య ర్యాలీని నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.

News April 28, 2024

కడప: ‘ఓటు హక్కు.. ప్రతి ఒక్కరి ఆయుధం’

image

ప్రజాస్వామ్య దేశంలో విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడం పౌరులుగా మన బాధ్యతని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగించుకోవాలని కడప నగర కమీషనర్ ప్రవీణ్ చంద్ అన్నారు. “మన ఓటు, మన ధైర్యం, మన భవిత” అన్న నినాదంతో కడప రాజీవ్ పార్క్ వద్ద నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కమిషనర్ ప్రారంభించి ఆయన పాల్గొన్నారు. ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు.