Andhra Pradesh

News April 27, 2024

ఫ్లైఓవర్ బ్రిడ్జి మధ్యలో పడిన కారు.. డ్రైవర్ మృతి

image

చాగలమర్రి మండల పరిధిలోని జాతీయ రహదారి నగళ్లపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర నంద్యాల నుంచి కడపకు వెళ్లే దారిలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి మధ్యలో కారు పడింది. ప్రమాద స్థలంలోనే కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన డ్రైవర్ గండికోట చక్రపాణి మృతిచెందాడు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంతు నాయక్, చాగలమర్రి ఎస్సై అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News April 27, 2024

TPT: ‘30లోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోండి’

image

అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నందు 2023-24 విద్యా సంవత్సరానికి ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) పద్ధతిలో బి.ఎడ్ (B.Ed) ఆన్ లైన్ వెబ్ ఆప్షన్ల కోసం ఏప్రిల్ 30 తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రాంతీయ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. బి.ఎడ్ (ODL) ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.braouonline.in/ వెబ్ సైట్ చూడగలరు.

News April 27, 2024

మే 7న రాజమండ్రికి ప్రధాని మోడీ!

image

భారత ప్రధాని నరేంద్ర మోడీ మే 7న రాజమండ్రి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ రాజమండ్రి పర్యటనకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి, పోలీస్ అధికారులు ముఖ్య నేతలతో కలిసి సభా ప్రాంగణ నిర్వహణకు స్థలాలను పరిశీలించారు. వేమగిరి గైట్ కళాశాల స్థలాన్ని కూడా పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News April 27, 2024

విశాఖ ‘జూ’కు కొత్త జిరాఫీలు

image

విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు, జూలాజికల్ గార్డెన్ అలీపూర్, కోల్‌కతా నుంచి కొత్త జంతువులను తీసుకువచ్చినట్లు ‘జూ’ క్యూరేటర్ డాక్టర్ నందిని సలారియా తెలిపారు. జంతు మార్పిడి విధానంలో 2 జిరాఫీలు, ఏషియన్ వాటర్ మోనిటర్ లిజార్డ్, మక్కావును తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. విశాఖ జూ నుంచి తెల్ల పులి, తోడేలు, ఇండియన్ వైల్డ్ డాగ్స్, బ్లాక్ స్పాన్ హాగ్ డీర్, హైనా, లేమర్‌ను ఆలీపూర్ జూకి అందజేశారు.

News April 27, 2024

29న అంబాజీపేటలో జగన్ బహిరంగ సభ: విప్పర్తి

image

ఈ నెల 29న పి.గన్నవరం నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు.‌ పర్యటనలో భాగంగా అంబాజీపేట మండలం 4 రోడ్ల జంక్షన్ వద్ద మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్ బహిరంగ సభ జరుగుతుందని ‌నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైసీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

News April 27, 2024

VZM: జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. శనివారం జిల్లాలో అత్యధికం, అత్యల్పం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.
• సాలూరులో 45.2
• గరుగుబిల్లి, సీతానగరంలో 44.7
• కొమరాడలో 44
• బలిజిపేట, జియ్యమ్మవలసలో 43.7
• మక్కువ, పాచిపెంటలో 43.5
• పార్వతీపురంలో 43.2
• కురుపాం, గుమ్మలక్ష్మీపురంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు తెలిపారు.

News April 27, 2024

వైసీపీది రియల్ మేనిఫెస్టో: తమ్మినేని

image

ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో రియల్ మేనిఫెస్టో అని రాష్ట్ర శాసనసభ స్పీకర్, ఆమదాలవలస వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలను కష్టాల నుంచి బయటపడేసే విధంగా జగన్ మేనిఫెస్టో ఉందని, చంద్రబాబు మేనిఫెస్టో అంతా కాపీ పేస్ట్ మాదిరిగా ఉంటుందన్నారు.

News April 27, 2024

ఎలక్ట్రికల్ బైక్ తయారు.. 2 గంటల ఛార్జింగ్‌తో 25KM

image

తాడేపల్లిగూడెం పట్టణంలోని ఏపీ నిట్ విద్యార్థులు నూతన ఆవిష్కరణ చేశారు. కేవలం 2 గంటలు ఛార్జింగ్ పెడితే గంటకు 18 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో నడిచే ఎలక్ట్రికల్ బైక్‌ను రూపొందించారు. దీనిని శనివారం ఆవిష్కరించారు. మెకానికల్ ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు మనోజ్ కుమార్, అనీషా, ప్రత్యూష, కే.రాజేశ్వరి, కె.గణ వరప్రసాద్ బృందం ఈ బైక్ తయారు చేసింది. విద్యార్థులను కళాశాల అధ్యాపకులు అభినందించారు.

News April 27, 2024

అది మ్యానిఫెస్టో కాదు.. జగన్ రాజీనామా లేఖ: లోకేశ్

image

శనివారం జగన్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో చూశాక ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా లేఖలా ఉందని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో లోకేశ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3వేల పెన్షన్‌ను రూ.4వేలకు పెంచి, పెన్షన్ సొమ్మును వాలంటీర్ల ద్వారా అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి అందించే బాధ్యత తనదన్నారు.

News April 27, 2024

పుంగనూరు: ఈతకు వెళ్లి బాలుడు మృతి

image

ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ బాలుడు మృతి చెందిన సంఘటన పుంగనూరు మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ప్రసన్నగారిపల్లె గ్రామానికి చెందిన నారాయణ కుమారుడు జగదీష్ (15) స్కూలుకు సెలవులు కావడంతో గ్రామ సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.