Andhra Pradesh

News April 27, 2024

రాజమండ్రి చేరుకున్న వరుణ్ తేజ్‌

image

పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా పిఠాపురంలో సినీ హీరో వరుణ్ తేజ్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయానికి విచ్చేసిన ఆయనకు పార్టీ శ్రేణులు, మెగా అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం గుండా పిఠాపురం నియోజకవర్గానికి ఆయన బయలుదేరి వెళ్లారు.

News April 27, 2024

మచిలీపట్నం: మట్టి ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి

image

మట్టి ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నపోతేపల్లి గ్రామానికి చెందిన యువకుడు పుప్పాల గణేశ్ మట్టి ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శనివారం ఉదయం పోతేపల్లి నుంచి మట్టి లోడ్ చేసుకుని వెళుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడింది. తీవ్రంగా గాయపడిన అతడిని హుటాహుటిన జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News April 27, 2024

శ్రీకాకుళం@ 18,75,934 మంది ఓటర్లు

image

శ్రీకాకుళం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 18,75,934 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ తర్వాత 26,180 మంది కొత్తగా చేరారు. డబుల్ ఎంట్రీ, మరణించారు ఇలా 10,156 మంది ఓటర్లను తొలగించారు. జిల్లాలో పురుషులు 9,29,859, మహిళలు 9,45,945, ఇతరులు 130 మంది ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో 2,73,260 మంది, అత్యల్పంగా ఆమదాలవలసలో 1,93,858 మంది ఓటర్లు ఉన్నారు.

News April 27, 2024

విశాఖ: కోడ్ ఉల్లంఘనతో పెట్రోల్ బంక్ లైసెన్స్ రద్దు

image

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి వైసీపీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి జారీ చేసిన కూపన్లకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేసిన ఎన్ఏడి జంక్షన్‌లో గల పెట్రోల్ బంక్ లైసెన్స్‌ను తాత్కాలింగా రద్దు చేసినట్లు విశాఖ జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ తెలిపారు. పెట్రోల్ డీజిల్ తీసుకున్న 860 మంది వాహనదారులపై కూడా కేసులు నమోదు చేయాలని జేసీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

News April 27, 2024

కోనసీమ జిల్లాలో 31 నామినేషన్లను తిరస్కరణ

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. కోనసీమ జిల్లావ్యాప్తంగా ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 31 నామినేషన్లను తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో 21 నామినేషన్లు వేయగా 16 , ఏడు నియోజక వర్గాల పరిధిలో మొత్తం 130 నామినేషన్లు దాఖలు చేయగా 104 నామినేషన్లు ఆమోదించామని తెలిపారు.

News April 27, 2024

తూ.గో జిల్లాలో 89 ఆమోదం.. 44 REJECT

image

తూ.గో జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాజమండ్రి పార్లమెంట్, 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి దాఖలైన నామినేషన్ పత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. ఇందులో రాజమండ్రి అర్బన్ లో 13 నామినేషన్లు వేస్తే 2, రాజమండ్రి గ్రామీణంలో 14 వేస్తే 7, రాజానగరంలో 18 కి 4, కొవ్వూరులో 14 కి 2, గోపాలపురంలో 15 కు 4, నిడదవోలులో 16 కు 3, అనపర్తిలో 24 నామినేషన్లు వేస్తే 15 నామినేషన్లు తిరస్కరించారు.

News April 27, 2024

చింతమనేనిపై 93 కేసులు

image

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై మొత్తం 93 కేసులో ఉన్న విషయం తెలిసిందే. అయితే కేవలం ఒక్క వైసీపీ ప్రభుత్వంలో ఏకంగా 47 కేసులు ఉన్నాయి. వీటిలో 14 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉన్నాయి. అదేవిధంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019లో 13 కేసులు, 2020-21లో 16 కేసులు, 2022లో 7 కేసులు, 2023లో 8 కేసులు, 2024 లో 3 కేసులు నమోదయ్యాయి.

News April 27, 2024

చిత్తూరు: 27 నుంచి నామినేషన్ల విత్ డ్రా

image

ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారంతో ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. 27, 29 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో జరుగుతుందన్నారు. 28వ తేదీ ప్రభుత్వ సెలవు దినం కావున ఆ రోజు ఉపసంహరణ ప్రక్రియ ఉండదని పేర్కొన్నారు.

News April 27, 2024

ఒంటిమిట్ట: గుడి వద్ద తీవ్ర గాయాలతో యువకుడు

image

ఒంటిమిట్ట మండలం సాలాబాద్ అంకాలమ్మ గుడికి సమీపంలో యువకుడు తీవ్ర గాయాలు, రక్తపు మడుగులో పడివున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. క్రికెట్ గ్రౌండ్ లో తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న యువకుడిని చూసి గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 108కు సమాచారం అందించి కడప రిమ్స్ కు తరలించారు. క్షతగాత్రుడు సిద్దవటం మండలానికి చెందిన మౌలాలిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 27, 2024

ఎన్టీఆర్: ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ఇదే

image

ఎన్టీఆర్ జిల్లాలో ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంత వివరాలను ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలియజేశారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో ఈనెల 7వ తేదీన 44.1°C ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇదే 26.04.2024 వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం అని తెలియజేశారు.