Andhra Pradesh

News September 25, 2025

చిత్తూరు జిల్లా గ్రానైట్‌లో గోల్‌మాల్

image

చిత్తూరు జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీస్ డెవలప్మెంట్ అసోసియేషన్ పేరిట నడుస్తున్న బినామీ సంస్థ రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా తప్పుడు బిల్లులు ఇస్తోందట. క్వారీల నుంచి లారీలకు నకిలీ బిల్లులు జారీచేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలు, దొంగ బిల్లుల వ్యవహారంపై అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అటు గ్రానైట్ లారీలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునేవారేలేరట.

News September 25, 2025

గుంటూరులో అతిసారం.. భద్రతా చర్యలు

image

గుంటూరులో ఇప్పటి వరకు 185 మంది అతిసారంతో జీజీహెచ్‌లో చేరారు. వీరిలో ప్రస్తుతం 104 మంది ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రగతినగర్, రామిరెడ్డినగర్ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. ఆర్వో ప్లాంట్ల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో కొన్నిట్లో బ్యాక్టీరియా ట్రేసెస్ గుర్తించారు. కలుషిత ఆహారం ఉన్న అనుమానిత ఆహారశాలలను మూసివేసి, పానీపూరీ బండ్లపై ఆంక్షలు విధించారు.

News September 25, 2025

ఇకపై 10 జోన్లతో GVMC..!

image

జీవీఎంసీ పరిధిని పది జోన్లకు విస్తరించనున్నారు. ప్రస్తుతం 8జోన్లతో జీవీఎంసీ ఉంది. ప్రతి నియోజకవర్గానికి ఓ జోన్ ఉండగా.. భీమిలి, పెందుర్తిలో అదనంగా ఒక్కో జోన్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆఫీసులకు అవసరమైన ఫర్నీచర్ సమకూర్చుకోవాలని కమిషనర్ హెచ్వోడీలకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీలో మంత్రి నారాయణ స్వయంగా ప్రకటన చేయడంతో 10 జోన్లపై స్పష్టత వచ్చింది.

News September 25, 2025

SKLM: గంజాయి కేసులో ఒకరికి నాలుగేళ్లు జైలు శిక్ష

image

గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన నిందితుడికి నాలుగేళ్లు జైలు శిక్షతో పాటు రూ. 10 వేలు జరిమానా విధిస్తూ ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జి భాస్కరరావు తీర్పు వెల్లడిచింది. ఈ విషయాన్ని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది జనవరిలో గంజాయి అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నిందితుడు నాగరాజుకు శిక్ష పడడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

News September 25, 2025

నెల్లూరు: విద్యుత్ శాఖ ఎస్ఈగా రాఘవేంద్రం

image

జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈగా కొండూరు రాఘవేంద్రం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన విజయన్ తిరుపతి జనరల్ మేనేజర్ గా బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా కొత్త ఎస్ఈ జిల్లా వాసి కావడం విశేషం. ఈయన సత్యసాయి జిల్లాలో పనిచేస్తూ నెల్లూరుకు వచ్చారు.

News September 25, 2025

ప్రకాశం జిల్లాకు నేడు వర్ష సూచన!

image

ప్రకాశం జిల్లాలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం జిల్లాపై ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఉదయం నుంచి వాతావరణం చల్లబడి.. మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

News September 25, 2025

నెల్లూరు: క్రైమ్ బ్రాంచ్ CIని అంటూమోసం

image

CIనంటూ ఓ వ్యక్తి నిరుద్యోగులను మోసం చేస్తున్న ఘటనపై కేసు నమోదైంది. నెల్లూరు రూరల్ న్యూ మిలిటరీ కాలనీలో బీటెక్ పూర్తి చేసిన వినోద్ కేఫ్‌లో పని చేస్తున్నాడు. అక్కడకు రోజూ కారులో యూనిఫాం ధరించి వచ్చే సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. తాను క్రైమ్ బ్రాంచ్ సీఐ అని అంటూ వినోద్‌కు ఉద్యోగం ఎరగా వేసి రూ.6లక్షలకు పైగా ఆరు సవర్ల బంగారు దండుకున్నాడు. చివరికి ఉద్యోగం ఇప్పింకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

News September 25, 2025

విశాఖ డెయిరీ లాభం ఎంతంటే?

image

విశాఖ డెయిరీ ఏడాది టర్నోవర్ రూ.1755 కోట్లు ఉండగా.. 2024-25లో రూ.8.51 కోట్ల నికర లాభం వచ్చిందని ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ వెల్లడించారు. ‘19.28కోట్ల లీటర్ల పాలు, 5.84 కోట్ల కేజీల పెరుగు విక్రయించాం. ఉత్తరాంధ్ర, తూ.గో, ప.గో జిల్లాలో 3లక్షల మంది నుంచి పాలు సేకరిస్తున్నాం. 2025-26లో రూ.2వేల కోట్ల టర్నోవర్, రూ.20కోట్ల లాభం వచ్చేలా వ్యాపారాన్ని విస్తరిస్తాం’ అని వార్షిక సమావేశంలో ఛైర్మన్ పేర్కొన్నారు.

News September 25, 2025

విశాఖ డెయిరీ లాభం ఎంతంటే?

image

విశాఖ డెయిరీ ఏడాది టర్నోవర్ రూ.1755 కోట్లు ఉండగా.. 2024-25లో రూ.8.51 కోట్ల నికర లాభం వచ్చిందని ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ వెల్లడించారు. ‘19.28కోట్ల లీటర్ల పాలు, 5.84 కోట్ల కేజీల పెరుగు విక్రయించాం. ఉత్తరాంధ్ర, తూ.గో, ప.గో జిల్లాలో 3లక్షల మంది నుంచి పాలు సేకరిస్తున్నాం. 2025-26లో రూ.2వేల కోట్ల టర్నోవర్, రూ.20కోట్ల లాభం వచ్చేలా వ్యాపారాన్ని విస్తరిస్తాం’ అని వార్షిక సమావేశంలో ఛైర్మన్ పేర్కొన్నారు.

News September 25, 2025

ఉయ్యాలపల్లిలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం..?

image

కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన సుటెటి విష్ణు వర్ధన్ (9), మనుబోటి నవ శ్రవణ్ (12) చిన్నారులు అదృశ్యమయ్యారు. దసరా సెలవులకి కావడంతో సరదాగా బయటకు వెళ్లిన చిన్నారులు రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉంటారేమో అన్న అనుమానంతో గ్రామస్థులు సమీప బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు.