India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూ.గో బార్లకు దరఖాస్తులదారుల నుంచి స్పందన కరువైంది. జిల్లాలో మరో 22 బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు కోరగా.. మంగళవారం గడువు ముగిసే నాటికి రాజమండ్రి నుంచి 4, ఇతర ప్రాంతాల నుంచి మరో 4 దరఖాస్తులు మాత్రమే ఎక్సైజ్ శాఖకు అందాయి. వైన్ షాపుల వద్ద పర్మిట్ రూములు, అధిక లైసెన్స్ ఫీజులు, ఇతర కారణాలతో లైసెన్సుల కోసం వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. కాగా దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 29 వరకు పెంచారు.
విశాఖ ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో మంగళవారం ‘కవచ్’ లోకోను DRM లలిత్ బొహ్రా జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైలు ప్రమాదాలను నివారించడానికి స్వదేశీ పరిజ్ఞానంతో
‘కవచ్’ వ్యవస్థ రూపొందించినట్లు పేర్కొన్నారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీ కొనకుండా వాటంతట అవే నిలిచిపోయేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందన్నారు.
పెదగంట్యాడలో బాలిక అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు న్యూపోర్ట్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న బాలిక (13) ఇంటి నుంచి వెళ్లిపోతూ చీటీ రాసింది. అందులో ‘నన్ను వెతకొద్దు, మమ్మీ నాకు చచ్చిపోవాలని ఉంది. ఇన్ని రోజులు చాలా భరించాను. ఇప్పుడు నేను ఇంక దీన్ని భరించలేను. సారీ, గుడ్ బై, నేను ఇంకా బ్రతకను’ అని రాసి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పలమనేరు అర్బన్ CI నరసింహరాజును VRకు బదిలీ చేస్తూ SP మణికంఠ చందోలు ఆదేశాలు జారీ చేశారు. పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆయన స్థానంలో పలమనేరు రూరల్ సీఐ మురళీ మోహన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
మెగా డీఎస్సీ-2025 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభం కానుందని డీఈవో వరలక్ష్మి తెలిపారు. పరిశీలన కోసం చిత్తూరులో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్, అపోలో యూనివర్సిటీలో వెరిఫికేషన్ ఉంటుందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికన 1478 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
గుంటూరు AC కళాశాలలో గురువారం DSC సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. జిల్లా విద్యాధికారిణి రేణుక వివరాల మేరకు.. అభ్యర్థులు తమ DSC లాగిన్ ద్వారా కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్లను ముందుగా అప్‌లోడ్ చేసి, తర్వాతే పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. సంబంధిత ఒరిజినల్స్‌తో పాటు, మూడు సెట్ల అటెస్టెడ్ కాపీలు, 5 పాస్‌పోర్ట్ ఫొటోలు, కుల, వికలాంగ ధృవపత్రాలను తీసుకురావాలన్నారు.
బంగాళాఖాతంలో అల్ప పీడనం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మత్య్సకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది. వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
కొంతమూరు గ్రామానికి చెందిన వంక త్రిమూర్తులు అనే వ్యక్తి కాలువలోకి దిగి కలువ పువ్వులు కోస్తుండగా ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం త్రిమూర్తులు అనే వ్యక్తి వినాయక చవితి సందర్భంగా కలువ పువ్వులు కోసం కాలువలోకి దిగాడు. కాలు జారి పడటంతో మునిగిపోయి మృతి చెందాడు. స్థానికులు సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.
గుంటూరు జిల్లాలో బార్ షాపుల కేటాయింపుకు సంబంధించి దరఖాస్తుల సమర్పణ గడువును అధికారులు మరోసారి పొడిగించారు. ఈ నెల 26 నుంచి 29 వరకు సాయంత్రం 6 గంటల లోపు ఆసక్తిగల వారు అప్లై చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ డీసీ కె.శ్రీనివాసులు మంగళవారం వెల్లడించారు. అనంతరం 30న కలెక్టర్ కార్యాలయంలో లాటరీ నిర్వహించి మొత్తం 110 షాపుల కేటాయింపును పూర్తిచేయనున్నట్లు తెలిపారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాందుడుకి విశాఖ స్పెషల్ పోక్సోకోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. 2024లో భీమిలి మండలానికి చెందిన సరగడ సన్యాసిరావు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నేరం రుజువుకావడంతో కోర్టు పై విధంగా శిక్ష విధించింది. బాధిత బాలికకు రూ.3 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.
Sorry, no posts matched your criteria.