Andhra Pradesh

News April 27, 2024

పార్టీ ఏ పని చెప్తే.. అది చేస్తా: పేర్ని నాని

image

రాజకీయంగా అకౌంటబులిటీ లేని జీవితం గడపాలనే రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు పేర్ని నాని తెలిపారు. ‘జగన్ అంటే పిచ్చి ఉంది. వైసీపీ అంటే ప్రేమ ఉంది. పార్టీకి ఏ అవసరం వచ్చినా నన్ను పిలిస్తే అది చేస్తానని సీఎం జగన్‌కు చెప్పాను. నాకు నచ్చజెప్పడానికి జగన్ చాలా సార్లు ప్రయత్నించారు. పోర్టు శంకుస్థాపనకు మచిలీపట్నం వచ్చిన రోజు ఇక నేను మాట వినను అని జగన్ డిసైడ్ అయ్యారు’ అని పేర్ని నాని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

News April 27, 2024

శ్రీకాకుళం-తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైలు

image

శ్రీకాకుళం రోడ్డు తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డీసీఎం కే సందీప్ తెలిపారు. మే 5, 12 తేదీల్లో రాత్రి 8.05 గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 8.05కి దువ్వాడ చేరుకుని మధ్యాహ్నం12.15కి శ్రీకాకుళం చేరుకుంటుంది. మే 6, 13వ తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరి దువ్వాడ మీదగా తర్వాత రోజు ఉదయం 8.20కి తిరుపతికి చేరుకుంటుంది.

News April 27, 2024

శ్రీకాకుళం: 95 ఆమోదం.. 28 తిరస్కరణ

image

సార్వత్రిక ఎన్నికలక ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం నిర్వహించారు. 8 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాలకు రిటర్నింగ్ అధికారులు నామపత్రాలు పరిశీలించారు. ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి 82 నామినేషన్లు ఆమోదించగా.. 25 తిరస్కరించారు. పార్లమెంట్ స్థానానికి 13 ఆమోదించగా.. 3 తిరస్కరించారు. మొత్తానికి 95 ఆమోదం పొందాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 29 వరకు గడువు ఇచ్చారు.

News April 27, 2024

కర్నూలు, నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటన

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈనెల 28,29 తేదీల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారని కర్నూలు, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి మల్లెల రాజశేఖర్ తెలిపారు. 28న గూడురులో బహిరంగసభలో పాల్గొని రాత్రి అక్కడే బస చేస్తారు. 29న నంద్యాల జిల్లాలోని డోన్, నందికొట్కూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని తెలిపారు.

News April 27, 2024

ధర్మవరంలో చేనేత కార్మికుడి దారుణ హత్య

image

ధర్మవరంలో శుక్రవారం రాత్రి దారుణ హత్య జరిగింది. గీతానగర్‌‌లోని రమేశ్‌కు అతడి పిన్ని నారాయణమ్మ కుమారుడు మణి పట్టుచీర అమ్మాడు. అందుకు సంబంధించిన రూ.10వేలు ఇవ్వాలని రమేశ్‌ను అడగడంతో మాటమాట పెరిగి మణి ఛాతిలో కత్తితో పొడిచాడు. అడ్డువచ్చిన మణి అన్న మణికంఠపై, తల్లి సావిత్రిని రమేశ్ కత్తితో పొడిచి గాయపరిచాడు. మణిని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు.

News April 27, 2024

తిరుపతి: ఆమోదం 177.. తిరస్కారం 50

image

తిరుపతి జిల్లాలో ఒక MP, 7 శాసనసభ స్థానాలకు 227 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. తిరుపతి MP స్థానానికి 27 దాఖలవ్వగా మూడింటిని తిరస్కరించారు. జిల్లాలోని 7 శాసనసభ స్థానాలకు 200 దాఖలు చేయగా.. 47 తిరస్కరించారు. తిరుపతిలో 52కి 4, చంద్రగిరిలో 43కి 17, శ్రీకాళహస్తిలో 27కి 4, సత్యవేడులో 24కి 7, సూళ్లూరుపేటలో 16కి 2, గూడూరులో 21కి 6, వెంకటగిరిలో 17కి 7 తిరస్కరించారు.

News April 27, 2024

మంత్రి విడదల రజిని నామినేషన్ తప్పులు తడక: కనపర్తి శ్రీనివాస్

image

మంత్రి విడదల రజిని నామినేషన్ పత్రాల్లో లెక్కలేనన్ని తప్పులు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి రజిని భర్త కుమారస్వామికి అమెరికాలో పౌరసత్వం ఉందన్నారు. మంత్రి నామినేషన్లో వార్షికాదాయం రూ. 3,96,400 ఉందన్నారు. పెదపలకలూరులో రూ.4,55,56,500 విలువ కలిగిన భూమి ఎలా కొన్నారో చెప్పాలన్నారు.

News April 27, 2024

ప్రకాశం: రూ.2.21 కోట్ల నగదు సీజ్

image

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈనెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2.21 కోట్ల నగదు, 3000 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఇప్పటివరకు రూ.4.92 కోట్ల మేరా ఖర్చు చేసినట్లు గుర్తించామన్నారు. శుక్రవారం వరకు 62 వాలంటీర్లను తొలగించగా, 2,714 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారని కలెక్టర్ పేర్కొన్నారు.

News April 27, 2024

కడప: మాధవిరెడ్డి ఆస్తుల వివరాలు

image

➤ నియోజకవర్గం: కడప
➤ అభ్యర్థి: మాధవిరెడ్డి, ➤విద్యార్హత: BA
➤చేతిలో ఉన్న డబ్బు: రూ.2,69,000
➤ చరాస్తి విలువ: రూ.54,90,62,928
➤ స్థిరాస్తి విలువ: రూ.325,91,92,400
➤ అప్పులు: రూ.77,54,57,638
➤ బంగారం: 6.43 కేజీలు
➤ కేసులు: 4 ➤ వెహికల్స్: 0 ➤ఇళ్లు : 3
NOTE: అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం.. దంపతులు ఇద్దరికీ కలిపి ఉన్న ఆస్తి వివరాలు

News April 27, 2024

సింహాచలంలో సుప్రభాత సేవ టికెట్లు పునఃప్రారంభం

image

సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నృసింహ స్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత రద్దు చేసిన దర్శనాలను కూడా పునః ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు గమనించాలని కోరారు.