Andhra Pradesh

News April 27, 2024

సింహాచలంలో సుప్రభాత సేవ టికెట్లు పునఃప్రారంభం

image

సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నృసింహ స్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత రద్దు చేసిన దర్శనాలను కూడా పునః ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు గమనించాలని కోరారు.

News April 27, 2024

కాకినాడ: ఇంజినీరింగ్ విద్యార్థి SUICIDE.. కేసు నమోదు

image

కాకినాడ గాంధీనగర్‌కు చెందిన పల్లి సంజయ్ వర్మ (21) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీటెక్ సెకండియర్ చదువుతున్న అతను గురువారం కుటుంబ సభ్యులను రూ.500 కావాలని అడగగా ఇవ్వక పోవడంతో ఉరి వేసుకున్నాడని విద్యార్థి తండ్రి మధుబాబు ఫిర్యాదు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న వర్మను జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడని శుక్రవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News April 27, 2024

సింహాచలంలో సుప్రభాత సేవ టికెట్లు పునఃప్రారంభం

image

సింహాచలం శ్రీ వరహ లక్ష్మి నృసింహ స్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు సందర్భాన్ని పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత రద్దు చేసిన దర్శనాలను కూడా పునః ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు గమనించాలని కోరారు.

News April 27, 2024

మెలియాపుట్టి: మహిళ అనుమానాస్పద మృతి

image

మెలియాపుట్టి కేంద్రానికి చెందిన గురజాడ ప్రభావతి(48) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని ఎస్సై రాజేశ్ తెలిపారు. మండల కేంద్రంలో ప్రభావతి ఒంటరిగా ఉంటుంది. కుమారుడు జమ్మూలో సీఆర్పీఎఫ్ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మూడు రోజులుగా ఫోన్ చేస్తున్నా ఎత్తకపోవడంతో స్థానికులను ఇంటికి వెళ్లమని చెప్పారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 27, 2024

కొల్లు రవీంద్రపై 25 కేసులు.. తంగిరాల సౌమ్యపై 23 కేసులు

image

కొల్లు రవీంద్రపై 25, తంగిరాల సౌమ్యపై 23 కేసులు ఉన్నట్లు ఇటీవల వాళ్లు దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. కొల్లు రవీంద్రపై సీఐడీ కేసు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర కేసులున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారనే కారణంతో తంగిరాల సౌమ్యపై 8 కేసులు.. శాంతి భద్రతల విఘాతం కలిగినందుకు పలు కేసులు నమోదయ్యాయి. ఇవన్ని వైసీపీ హయాంలోనే పెట్టారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News April 27, 2024

విజయనగరంలో 116, మన్యంలో 20 రిజెక్ట్

image

ఉమ్మడి జిల్లాలో నామినేషన్ వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించారు. చీపురుపల్లిలో 12 మందికి 10, బొబ్బిలిలో 13కి 8, గజపతినగరంలో 15కి 9, నెల్లిమర్లలో 16కి 13, ఎస్.కోటలో 16కి 14, విజయనగరంలో 20కి 16 మంది అభ్యర్థుల నామినేషన్‌లను ఆమోదించారు. విజయనగరం MPకి 15 మంది నామినేషన్‌లు ఆమోదించారు. మన్యం జిల్లాలో పార్వతీపురంలో 18 సెట్లకి 14, సాలూరులో 15కి 13, కురుపాంలో 19కి 16, అరకు MPకి 38లో 27సెట్లు ఆమోదించారు.

News April 27, 2024

విశాఖ తీరానికి కొట్టుకు వచ్చిన మహిళ మృతదేహం

image

ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో విశాలాక్షి నగర్ సీత కొండ వైఎస్‌ఆర్ వ్యూ పాయింట్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని మహిళ మృతదేహం తీరానికి కొట్టుకు వచ్చింది. కమ్యూనిటీ గార్డులు గుర్తించి పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 27, 2024

కర్నూలు జిల్లాలో ఎన్ని నామినేషన్లు తిరస్కరించారంటే..?

image

కర్నూలు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం సంబంధిత ఆర్వోల ఆధ్వర్యంలో పరిశీలన జరిగింది. కర్నూలు MP స్థానానికి 27 నామినేషన్లలో 7 నామినేషన్లు తిరస్కరించారు. ఎమ్మెల్యే స్థానాల వారీగా కర్నూలు 41 నామినేషన్లలో.. 14 తిరస్కరించారు. ఇలా పాణ్యం 24కు 9, కోడుమూరు 21లో 5, ఆదోని 15లో 4 నామినేషన్లను తిరస్కరించారు. మంత్రాలయం 12కు 2, ఆలూరు 15కు2, పత్తికొండ 14కు3, ఎమ్మిగనూరు 15కు5 తిరస్కరించారు.

News April 27, 2024

రైల్వేకోడూరు: YCPలోకి జనసేన కీలక నేతలు

image

రైల్వేకోడూరులోని స్థానిక వైసీపీ కార్యాలయం నందు శుక్రవారం సాయంత్రం జనసేన రాయలసీమ జోనల్ ఇన్‌ఛార్జ్ కుప్పాల జ్యోతి, కుప్పాలా కిరణ్, వీపీఆర్ కండ్రిక మాజీ సర్పంచ్ సుబ్బరామరాజు వైసీపీలోకి చేరారు. వీరికి ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండల ఛైర్మన్ సుకుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News April 27, 2024

చిత్తూరులో ఆమోదించిన నామినేషన్ల వివరాలు

image

చిత్తూరు జిల్లాలో ఆమోదించిన నామినేషన్ల వివరాలను అధికారులు ప్రకటించారు. పుంగనూరులో 15 నామినేషన్లు దాఖలు కాగా 10 వాటిని ఆమోదించారు. నగరిలో 24 కు 7, జీడి నెల్లూరులో 21కి 12, చిత్తూరులో 21కి14, పూతలపట్టులో 19 కి 12, పలమనేరులో 19 కి 14, కుప్పంలో 18కి 15 నామినేషన్లు ఆమోదించినట్టు చెప్పారు. చిత్తూరు ఎంపీ స్థానానికి 35 నామినేషన్లు దాఖలు కాగా 21 వాటిని ఆమోదించామన్నారు.