Andhra Pradesh

News April 26, 2024

పాడేరు: మారుమూల గ్రామాల ఓటర్లపై మరింత దృష్టి

image

అల్లూరి జిల్లాలోని పాడేరు, అరకు, రంపచోడవరం మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెంచాలన్న లక్ష్యంతో చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. మారుమూల గ్రామాల ఓటర్లపై మరింత దృష్టి సారించామని చెప్పారు. గతంతో పోల్చుకుంటే రహదారుల నిర్మాణం, రవాణా వ్యవస్థ మెరుగుపడిందని అన్నారు. ఓటర్లంతా తమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.

News April 26, 2024

విశాఖ- మలేషియాకు విమాన సర్వీసులు

image

విశాఖ నుంచి మలేషియా‌కు శుక్రవారం నుంచి విమాన సర్వీస్‌‌లు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విమానం కౌలాలంపూర్ నుంచి రాత్రి 9.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. వైజాగ్ నుంచి రాత్రి 10గంటలకు బయలుదేరి తెల్లవారుజాము 4.20 గంటలకు కౌలాలంపూర్ చేరుతుంది. కార్యక్రమంలో వైజాగ్ ఎయిర్‌పోర్ట్ ఏపీడీ ఎస్.రాజారెడ్డి, అడ్వైజరీ కమిటీ సభ్యులు డా.కె.కుమార్ రాజా, ఓ.నరేష్ కుమార్, డీ.ఎస్.వర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News April 26, 2024

పి.గన్నవరంలో 29న జగన్ పర్యటన.. ఏర్పాట్ల పరిశీలన

image

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 29వ తేదీన పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం రాజోలు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు పరిశీలించారు. కేంద్ర కార్యాలయ ప్రతినిధి ప్రసాద్ రెడ్డి, పార్టీ నేత కేఎస్ఎన్ రాజు, వైసీపీ ప్రధాన కార్యదర్శి తెన్నేటి కిషోర్ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.

News April 26, 2024

30న తెనాలిలో చంద్రబాబు పర్యటన: నాదెండ్ల

image

ఈనెల 30వ తేదీన తెనాలి పట్టణంలో చంద్రబాబు పర్యటిస్తారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు చంద్రబాడు తెనాలి చేరుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.

News April 26, 2024

పెద్దిరెడ్డి నామినేషన్‌కు ఆమోదం

image

పుంగనూరు నియోజకవర్గం నుంచి MLA బరిలో నిలిచిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్‌ను ఆమోదించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం.. అన్ని అంశాలను పరిశీలించి ఆయన నామినేషన్‌ను ఆమోదించినట్లు వెల్లడించారు. ఈయనతో పాటు కూటమి నుంచి బరిలో నిలిచిన చల్లా రామచంద్రారెడ్డి నామినేషన్ కూడా ఆమోదించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

News April 26, 2024

30న తెనాలిలో చంద్రబాబు పర్యటన: నాదెండ్ల

image

ఈనెల 30వ తేదీన తెనాలి పట్టణంలో చంద్రబాబు పర్యటిస్తారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు చంద్రబాడు తెనాలి చేరుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.

News April 26, 2024

నంద్యాల: ఓటు హక్కును ప్రాధాన్యత తెలియజేసే కార్టూన్ చిత్రం

image

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ఆళ్లగడ్డకు చెందిన ప్రముఖ చిత్రకారుడు విజయ్ తమ కుంచె నుంచి వ్యంగ్య కార్టూన్‌ను రూపొందించారు. సామాజిక స్పృహ కలిగిన ఓటర్లు అందరూ నోటుకో , మద్యానికో .. తమ ఓటు అమ్ముకోకుండా ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే సరైన నాయకుడిని ఎంచుకోవాలని ఆర్టిస్ట్ విజయ్ తమ కార్టూన్ రూపంలో తెలిపారు. ఈ చిత్రం పలువురిని ఆలోచింపజేస్తుంది.

News April 26, 2024

తాడిపత్రిలో 2 నామినేషన్లు రిజెక్ట్

image

తాడిపత్రిలో దాఖలైన ఎన్నికల నామినేషన్లలో 2 రిజెక్ట్ చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారన్నారు. శుక్రవారం వాటిని పరిశీలించి ఇది వరకే ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు అంగీకరించినందున కేతిరెడ్డి రమాదేవి, జేసీ ప్రభాకర్ రెడ్డి నామినేషన్లు తిరస్కరించినట్లు తెలిపారు.

News April 26, 2024

రేపు పాలిసెట్ ప్రవేశ పరీక్ష

image

ఈనెల 27న పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలో 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 5,460 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని, గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

News April 26, 2024

ప.గో.: అమ్మా, నాన్న, ఓ కుమారుడు.. ముగ్గురూ మంత్రులే

image

దెందులూరుకు చెందిన మాగంటి కుటుంబం అరుదైన గుర్తింపు పొందింది. 1989లో కాంగ్రెస్ నుంచి దెందులూరు MLAగా గెలుపొందిన మాగంటి రవీంద్రనాథ్ చౌదరి దేవాదాయ మంత్రిగా పనిచేశారు. మంత్రి పదవిలో ఉండగానే ఆయన ఆకస్మికంగా మరణించారు. ఆ తర్వాత 1991లో జరిగిన ఉపఎన్నికలో ఆయన సతీమణి వరలక్ష్మీదేవి గెలిచి మంత్రి అయ్యారు. వారి కుమారుడు మాగంటి బాబు 2004లో MLAగా గెలిచి రెండేళ్ల తర్వాత చిన్ననీటి పారుదలశాఖ మంత్రిగా పనిచేశారు.