Andhra Pradesh

News April 26, 2024

విజయనగరం ఎంపీ స్థానానికి ఓ సెంటిమెంట్

image

విజయనగరం ఎంపీ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. విజయనగరం లోక్ సభ 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇక్కడ గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపట్టాయి. 2009లో కాంగ్రెస్ నుంచి బొత్స ఝాన్సీ, 2014లో టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, 2019లో వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ గెలిచారు. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలో బరిలో ఉన్నాయి. మరి ఈ సారి సెంటిమెంట్ వర్క్‌ఔట్ అవుతుందా కామెంట్ చేయండి.

News April 26, 2024

నెల్లూరు: 283 సెట్ల నామినేషన్లు దాఖలు

image

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. నెల్లూరు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి 21 మంది 36 నామ పత్రాలు సమర్పించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 39 సెట్లు, రూరల్ 28, సర్వేపల్లి 23, కందుకూరు 40, కావలి 43, ఆత్మకూరు 27, ఉదయగిరిలో 41 నామినేషన్లు దాఖలయ్యాయి.

News April 26, 2024

VZM: 30న అండర్–19 ఎంపిక పోటీలు

image

ఈ నెల 30న అండర్-19 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఎంఎల్ఎన్ రాజు తెలిపారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు 2005 సెప్టెంబర్ 1 తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. పోటీలకు హాజరయ్యే వారు ఒరిజినల్ ఆధార్ కార్డు, జన్మదిన ధ్రువపత్రం, గత మూడేళ్ల స్టడీ సర్టిఫికెట్స్ తీసుకొని రావాలన్నారు. సంబంధిత తేదీల్లో ఉదయం 6.30 గంటలకు వైట్ డ్రెస్, సొంత కిట్‌తో హాజరు కావాలని కోరారు.

News April 26, 2024

ప్రత్తిపాడు: దశాబ్దాలుగా ఆ మూడు కుటుంబాలదే హవా..!

image

దశాబ్దాల నుండి ప్రత్తిపాడులో కేవలం మూడు కుటుంబాలు మాత్రమే ఏలుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన ఈ సెగ్మెంట్లో మొదట ముద్రగడ కుటంబం హవా కొనసాగగా.. తరువాత పర్వత కుటుంబం ఒక వెలుగు వెలిగింది. తదనంతరం వరుపుల కుటుంబం అధిపత్యం కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం టీడీపీ నుంచి సత్యప్రభ బరిలో నిలబడగా, వైసీపీ నుంచి వరుపుల సుబ్బారావు ఉన్నారు

News April 26, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

బుక్కపట్నం మండలం లింగప్ప గారి పల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి ఆటో, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని స్థానికులు పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. అందులో వెంకట నరసా నాయుడు, ప్రభాకర్ మృతి చెందినట్లు తెలిపారు. మరో వ్యక్తి శ్రీరాములు చికిత్స పొందుతున్నారు. ఒకే గ్రామంలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News April 26, 2024

వారం రోజుల్లో 5 సార్లు తనిఖీలు: టీడీపీ

image

తాడికొండ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ కారును పోలీసులు పదే పదే తనిఖీలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో 5 సార్లు తనిఖీ చేశారని చెబుతున్నారు. తాజాగా, గురువారం తాడికొండ అడ్డరోడ్డు వద్ద శ్రావణ్ కుమార్ వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారని మండిపడ్డారు. కాగా, నిబంధనల ప్రకారమే తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

News April 26, 2024

గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆస్తి రూ.284.36కోట్లు

image

గుడివాడ TDP అభ్యర్థి వెనిగండ్ల రాము తన కుటుంబ ఆస్తిని రూ.284.36 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో చూపారు. చరాస్తులు తన పేర రూ.136.24 కోట్లు, భార్య సుకుధకు రూ.72.43 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. స్థిరాస్తులు తన పేరున రూ.64.74 కోట్లు, భార్య పేరున రూ.10.93 కోట్లు ఉన్నాయి. తనకు రూ.5.62 కోట్లు, తన భార్యకు రూ.10.98 కోట్లు వివిధ బ్యాంకుల్లో లోన్ల రూపంలో అప్పులు ఉన్నట్టు చూపారు.

News April 26, 2024

వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించవద్దు: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ 

image

వేసవి సెలవుల్లో పాఠశాలలు జూనియర్ కళాశాలలు తెరవద్దని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు డాక్టర్ గొండు సీతారాం పేర్కొన్నారు. విద్యా క్యాలెండర్ పక్కాగా అమలు జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలు, డీవీఈఓ, ఆర్ఐఓలకు ఆదేశాలు జారి చేసినట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్, కళాశాలలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

News April 26, 2024

బిట్రగుంట: మెము రైళ్లు రద్దు పొడిగింపు

image

పలు మెము రైళ్లు రద్దు పొడిగిస్తున్నట్లు విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బిట్రగుంట-విజయవాడరైలు 29 నుంచి మే 26 వరకు, విజయవాడ-బిట్రగుంట రైలు 29 నుంచి మే 26 వరకు రద్దు చేశారు. బిట్రగుంట-చెన్నై రైలు 29 నుంచి మే 3 వరకు, మే 6 నుంచి 10 వరకు, 13 నుంచి 17 వరకు, మే 20 నుంచి 24 వరకు రద్దు చేశారు.

News April 26, 2024

కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆస్తి వివరాలు

image

కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి డా. సృజనకు అందజేశారు. బీవై రామయ్య కుటుంబం పేరిట రూ.2.98కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రామయ్యకు అప్పు రూ.30.78లక్షలు ఉన్నట్లు వెల్లడించారు. ఆయనపై అస్పరి పోలీసు స్టేషన్‌లో ఈ ఏడాది ఒక కేసు నమోదైంది.