Andhra Pradesh

News September 20, 2024

మానవత్వం చాటుకున్న ప్రకాశం SP

image

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో నేడు CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేఫథ్యంలో జిల్లా SP దామోదర్ బందోబస్తు నిమిత్తం వెళుతున్న క్రమంలో.. ఒంగోలులోని ఉడ్ కంప్లెక్ వద్ద నెల్లూరు జిల్లా జలదంకు చెందిన బ్రహ్మయ్య మూర్ఛ వచ్చి పడిపోయాడు. విషయం గమనించిన ఎస్పీ తనవాహనం ఆపి అతని చేతిలో తాళాలు పెట్టి, సృహ తెప్పించి అనంతరం మంచి నీళ్లు తాగించి అక్కడినుంచి వెళ్లారు. మంచి మనస్సు చాటుకున్న SPని పలువురు అభినందించారు.

News September 20, 2024

విశాఖ: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘మోకా’కు చోటు

image

మిల్లెట్ ఆర్టిస్ట్ మోకా విజయ్ కుమార్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. విశాఖకు చెందిన విజయ్ కుమార్ చిరుధాన్యాలతో చిత్రాలను, బొమ్మలను తయారుచేస్తూ గుర్తింపు పొందారు. ఇటీవల మిల్లెట్స్‌తో తయారు చేసిన సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని అమరావతిలో అయనకు బహూకరించారు. వివిధ చోట్ల జరిగిన జీ- 20 సదస్సులో ఆయన తయారుచేసిన మిల్లెట్ చిత్రాలు ప్రదర్శించారు.

News September 20, 2024

ముచ్చట్ల ఆలయ పూజారి కుమార్తెకు MBBSలో సీటు

image

బేతంచెర్ల మండలం రంగాపురానికి చెందిన ముచ్చట్ల ఆలయ పూజారి చంద్రమోహన్ రావు, వరలక్ష్మీ దంపతుల కుమార్తె ఇందు ప్రసన్నలక్ష్మీ కర్నూలు మెడికల్ కళాశాలలో MBBS సీటు సాధించింది. నీట్ ఫలితాల్లో 720 మార్కులు గాను 644 మార్కులు సాధించింది. గ్రామీణ విద్యార్థికి MBBSలో సీటు రావడం పట్ల గ్రామస్థులుచ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

News September 20, 2024

బ్రోకర్లు వైసీపీని వీడటం మంచిదే: మిథున్ రెడ్డి

image

వైసీపీలో ప్రస్తుతం రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బ్రోకర్లు, స్క్రాప్ లాంటి నాయకులు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవడం మనకి చాలా మంచిది. ఇప్పుడు ఉండే నాయకులు, కార్యకర్తలు గట్టిగా పనిచేస్తే మనకు కచ్చితంగా పూర్వవైభవం వస్తుంది. ఆ దిశగా అందరం పనిచేద్దాం’ అని మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు.

News September 20, 2024

నేడు జగన్‌ను కలవనున్న MLA తాటిపర్తి

image

యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ శుక్రవారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడిన నేపథ్యంలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి కూడా పార్టీని వీడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్ఠానం నుంచి ఎమ్మెల్యేకు పిలుపొచ్చింది. దీంతో ఆయన ఇవాళ జగన్ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.

News September 20, 2024

కూడేరు ఎంఈఓపై సస్పెన్షన్ వేటు

image

రెండు రోజుల క్రితం అనంతపురంలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన కూడేరు మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ మేరకు కడప ఆర్జేడీ గురువారం సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారని పేర్కొర్నారు. గోటుకూరు వద్ద గల వెరీ డైన్ ఏ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం నుంచి లంచం డిమాండ్ చేశాడనే కారణంతో సస్పెండ్ చేశామన్నారు.

News September 20, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ, గుడివాడ మీదుగా తిరుపతి(TPTY)- బిలాస్‌పూర్ (BSP) మధ్య ప్రయాణించే 2 ఎక్స్‌ప్రెస్‌లకు కొవ్వూరులో దక్షిణ మధ్య రైల్వే ప్రయోగాత్మకంగా స్టాప్ ప్రవేశపెట్టింది. ప్రయాణికుల సౌలభ్యం మేరకు కొవ్వూరులో ఇచ్చిన స్టాప్‌ను ఈ నెల 21 నుంచి పొడిగిస్తున్నామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. నం.17481 BSP-TPTY రైలు ఈ నెల 21 నుంచి, నం.17482 TPTY-BSP రైలు ఈ నెల 22 నుంచి కొవ్వూరులో ఆగుతుందన్నారు.

News September 20, 2024

28న నెల్లూరు జిల్లా విజయ డెయిరీ ఎన్నికలు

image

నెల్లూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి(విజయ డెయిరీ) ఎన్నికలను ఈనెల 28న నిర్వహించనున్నామని ఎన్నికల అధికారి హరిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 23న నామినేషన్ల స్వీకరణ, అదే రోజున పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీ గడువు. 28న ఓటింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం ఓట్లను లెక్కిస్తారు.

News September 20, 2024

పల్నాడులో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

image

వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డులోని ఓ సూపర్ మార్కెట్ వద్ద గురువారం రాత్రి 11 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బైక్‌లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News September 20, 2024

మొగిలి ఘాట్‌లో మరో ప్రమాదం

image

బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్‌లో మరో ప్రమాదం జరిగింది. ఇటీవల ఇక్కడ ఘోర ప్రమాదం జరగడంతో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. వీటిపై అవగాహన లేని ఓ టెంపో ట్రావెలర్ వేగంగా వచ్చి ఇక్కడ అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వారిని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.