Andhra Pradesh

News April 25, 2024

మంగళగిరి వైసీపీ షాక్.. అభ్యర్థి పేరుతో మరో మహిళ నామినేషన్

image

మంగళగిరి వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య పేరును పోలిన మరో మహిళ గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆర్వో రాజకుమారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. వైసీపీ అభ్యర్థి పేరుతోనే ఉన్న మరో మహిళ నామినేషన్ వేయడంతో వైసీపీ వర్గాల్లో అలజడి మొదలైంది. అయితే స్వతంత్ర అభ్యర్థి లావణ్యతో మంతనాలు సాగుతున్నట్లు సమాచారం.

News April 25, 2024

VZM: పార్ల‌మెంటు స్థానానికి 30, అసెంబ్లీకి 184 నామినేష‌న్లు

image

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పార్ల‌మెంటు స్థానానికి 30 సెట్లు, అసెంబ్లీ స్థానాల‌కు 184 సెట్ల నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌, జిల్లా ఎన్నిక‌ల అధికారి నాగ‌ల‌క్ష్మి తెలిపారు. పార్ల‌మెంటు స్థానానికి 18 మంది, మొత్తం 7 అసెంబ్లీ స్థానాల‌కు 105 మంది నామినేష‌న్లు వేశార‌ని చెప్పారు. నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగిసిన అనంత‌రం క‌లెక్ట‌రేట్ మీడియా సెంట‌ర్‌లో క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి మీడియాతో మాట్లాడారు.

News April 25, 2024

తూ.గో.: అక్కడ ఒకే పేరుతో ముగ్గురు పోటీ

image

పి.గన్నవరం నియోజకవర్గంలో ఒకే పేరు కలిగిన ముగ్గురు వ్యక్తులు పోటీలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణతో పాటు, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా అదే పేరున్న గిడ్డి సత్యనారాయణ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరో గిడ్డి సత్యనారాయణ ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం. దీంతో ఎవరికి ఏ మేర నష్టం వాటిల్లుతుందో వేచి చూడాలి.

News April 25, 2024

సత్య సాయి జిల్లా నుంచి ఎమ్మెల్యే స్థానాలకు 231 నామినేషన్లు

image

శ్రీ సత్య సాయి జిల్లాలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల నుంచి 231మంది నామినేషన్లు వేసినట్టు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా పరిధిలోని మడకశిర, హిందూపురం, పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే స్థానాలకు 231 మంది నామినేషన్లు వేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News April 25, 2024

భీమిలిలో గంటా శ్రీనివాస్ పేరిట మరో అభ్యర్థి నామినేషన్

image

భీమిలిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస రావు పోటీచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే పేరుతో మరో వ్యక్తి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గురువారం భీమిలి ఆర్డీవో కార్యాలయంలో జాతీయ జనసేన పార్టీ తరఫున గంటా శ్రీనివాస రావు అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. మరి పోటీలో ఉంటారా నామినేషన్ ఉపసంహరించుకుంటారో వేచి చూడాలి.

News April 25, 2024

పాణ్యం అభ్యర్థిగా నిరుద్యోగి నామినేషన్

image

పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిరుద్యోగి అయ్యన్న నామినేషన్ వేశారు. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(RSP) తరఫున ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ.. పాణ్యం నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారమే ఎజెండాగా ప్రజల ముందుకు వస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.

News April 25, 2024

28న నెల్లూరు జిల్లాకు జగన్ రాక

image

సీఎం జగన్ ఈనెల 28 నుంచి రోజూ 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈక్రమంలో ఆయన తొలిరోజే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరిలో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరుకు చేరుకుంటారు. సభ ప్రాంగణం వివరాలు తెలియాల్సి ఉంది.

News April 25, 2024

ప్రకాశం జిల్లాకు సీఎం జగన్ రాక

image

సీఎం జగన్ ఈనెల 28 నుంచి రోజూ 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈక్రమంలో ఆయన ఈ నెల 28న కందుకూరులో. 30న కొండపిలో పర్యటించనున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటలకు వెంకటగిరిలో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. 30వ తేదీ ఉదయం 10:00 గంటలకు కొండపిలో పర్యటించనున్నారు. సభా ప్రాంగణాల వివరాలు తెలియాల్సి ఉంది.

News April 25, 2024

ప.గో.: ACCIDENT.. యువకుడు మృతి

image

ప.గో. జిల్లా పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పాలకొల్లు నుండి ఇద్దరు యువకులు బైక్‌పై లంకలకోడేరుకు వెళ్తుండగా భగ్గేశ్వరం రైస్‌మిల్లు ప్రాంతంలోకి రాగానే ఇటుక ట్రాక్టర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కొలికెల శ్రీజు అక్కడికక్కడే మరణించాడు. మరొక యువకుడికి తీవ్రగాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు. 

News April 25, 2024

మైదుకూరు: గుండెపోటుతో ఉపాధి కూలి మ‌ృతి

image

మైదుకూరు మండలం గంజికుంట పంచాయతీ లెక్కలవారిపల్లెలో గురువారం ఉపాధి కూలి గవ్వల పెద్దబాలుడు (62)ఎండ తీవ్రతతో అస్వస్థకు గురై మృతి చెందాడు. పెద్ద బాలుడు ఉపాధి పనులు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురైన ఆయన గుండెపోటుతో మృతి చెందాడని కూలీలు భావిస్తున్నారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ఉపాధి ఏపీఓ రామచంద్రారెడ్డి పరామర్శించారు.