Andhra Pradesh

News April 25, 2024

ఇండియా కూటమికే వైరిచర్ల మద్దతు

image

ఇండియా కూటమి అభ్యర్థులకు తన మద్దతు ఉంటుందని మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ గురువారం తెలిపారు. తెలుగుదేశం పార్టీ బీజీపీతో జతకట్టారని ఆయన నిరసిస్తూ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇప్పటివరకు ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన మనసులో మాట వెల్లడించారు.

News April 25, 2024

ఎచ్చెర్ల: హాల్ టిక్కెట్ల విడుదల

image

శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 2వ సెమిస్టర్, 4వ సెమిస్టర్ పరీక్షల హాల్ టికెట్లు గురువారం విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. హాల్ టికెట్లు జ్ఞానభూమి పోర్టల్‌లో ఉన్నాయని డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని ఆయన సూచించారు.

News April 25, 2024

కుంభోత్సవం వేడుకలకు ముస్తాబవుతున్న శ్రీశైలం

image

కుంభోత్సవం సందర్భంగా శ్రీశైలం ఆలయం ముస్తాబవుతుంది. ఈ మేరకు శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇప్పటికే కుంభోత్సవం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆలయాన్ని వివిధ రకాల ద్రవ్యాలతో విశేషంగా అలంకరిస్తున్నారు. ఆలయ పరిధిలో పక్షి, జంతుబలులు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

News April 25, 2024

ఎచ్చెర్ల : ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించిన పోలీస్ అబ్జర్వర్లు

image

ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామ సమీపంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎం స్ట్రాంగ్ రూములను ఎన్నికల పోలీస్ అబ్జర్వర్లు దిగంబర్ పి ప్రధాన్ సచ్చింద్ర పటేల్ గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కౌంటింగ్ సెంటర్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, పలువురు జిల్లా ఉన్నతాధికారులు ఉన్నారు.

News April 25, 2024

కడిమెట్లలో 40 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రచారం

image

ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల MLA చెన్నకేశవ రెడ్డి స్వగ్రామం. 40 ఏళ్లుగా ఈ ఊరును MLA తన కంచుకోటగా మార్చుకున్నారు. ఇక్కడ ప్రతిసారి ఏకపక్షంగా ఓట్లు పడేవి. ఈ ఊరిలో ప్రత్యర్థులు ప్రచారం చేసేవాళ్లు కాదు. దాదాపు 40 ఏళ్ల తర్వాత తొలిసారి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ జయనాగేశ్వర రెడ్డి ఆ గ్రామంలో ప్రచారం చేశారు. కడిమెట్లతో పాటు పరిసర గ్రామాల్లో 12 వేల ఓట్లు ఉండగా.. ఈసారి ఓటింగ్‌పై అందరి దృష్టి నెలకొంది.

News April 25, 2024

శ్రీకాకుళం విచ్చేసిన ఎన్నికల అబ్జర్వర్లు

image

సార్వత్రిక ఎన్నికలు – 2024 ఎన్నికల పార్లమెంట్ నియోజకవర్గం VZM జిల్లా పోలీస్ అబ్జర్వర్ సచ్చింద్ర పటేల్, VZM జిల్లా జనరల్ అబ్జర్వర్ టాట్ పర్వేజ్ ఇక్బాల్ రోహేళ్ల గురువారం సాయంత్రం జిల్లాకు విచ్చేశారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలానీ సమూన్ ను ఇరువురు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎన్నికల అంశాలపై చర్చించుకున్నారు.

News April 25, 2024

కందుకూరులో టీడీపీకి ఊహించని షాక్

image

కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ ముస్లిం మైనార్టీస్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ రఫీ గురువారం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కందుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహార శైలితో మానసిక వేదనకు గురైన తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమైనట్లు తెలిపారు.

News April 25, 2024

చంద్రబాబుతో బీజేపీ జాతీయ నేతల భేటీ

image

టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ జాతీయ నేతలు గురువారం సమావేశమయ్యారు. ఉదయం తాడేపల్లిలోని చంద్రబాబు నివాసానికి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, నేతలు అరుణ్‌సింగ్‌, శివప్రకాశ్‌, మధుకర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం వివిధ అంశాలపై వారితో చర్చించారు. ఎన్నికల ప్రచారం, కూటమి పార్టీల మధ్య సమన్వయం తదితర విషయాలపై చర్చ జరిపినట్లు సమాచారం.

News April 25, 2024

గుంటూరు:కలెక్టర్‌ను కలిసిన ఎన్నికల పరిశీలకులు

image

మంగళగిరి, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు నీరజ్ కుమార్ గురువారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్ రెడ్డిని కలిశారు. జిల్లాలో సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించి, పలు సూచనలు చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థులకు, ఓటర్లకు ఎన్నికల పరిశీలకులు ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉండలన్నారు.

News April 25, 2024

పెరిగిన అనిల్ కుమార్ ఆస్తులు

image

నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్వోకి అందజేసిన అఫిడవిట్‌లో పలు విషయాలను ప్రస్తావించారు. 2019లో స్థిరాస్తులు రూ.30 లక్షలు చూపగా, ఈసారి రూ.1.83 కోట్లుగా పేర్కొన్నారు. చరాస్తులు కూడా రూ.2.79 కోట్ల నుంచి రూ4.53కోట్లకు పెరిగాయి. అప్పు రూ.1.59కోట్లు ఉంది. ఈయన పేరు మీద 2 కార్లు ఉన్నాయి. అనిల్ మీద ఓ పోలీస్ కేసు నమోదైంది.