Andhra Pradesh

News April 25, 2024

శ్రీకాకుళం: ఎన్నికల పరిశీలకులను కలిసిన ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికలు- 2024 నేపథ్యంలో జిల్లా ఎన్నికల పోలీసు పరిశీలకులుగా మహారాష్ట్రకు చెందిన అధికారి దిగంబర్ పి ప్రధాన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు గురువారం జిల్లాకు చేరుకున్న ఆయనకు జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలీసు శాఖ పరమైన పలు అంశాలపై చర్చించారు.

News April 25, 2024

అన్ని వర్గాలకు వైసీపీ అనుకూలం: బొత్స

image

వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ద్వారక నగర్‌లో విశాఖ హోటల్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ ప్రతినిధులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థులు వాసుపల్లి గణేష్ కుమార్, కేకే రాజు, ఎంవీవీ పాల్గొన్నారు.

News April 25, 2024

గుంటూరు జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు ఒక్కరోజే 64 నామినేషన్లు

image

గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు బుధవారం 64 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు అందజేసిన నామినేషన్ల నియోజకవర్గాల వారీ వివరాలు.. తాడికొండ నియోజకవర్గం 5, మంగళగిరిలో 17, పొన్నూరులో 5, తెనాలిలో 5, ప్రత్తిపాడు లో 20, గుంటూరు పశ్చిమలో 9, గుంటూరు తూర్పులో మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి.

News April 25, 2024

కంట్రోల్ రూంను సందర్శించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు

image

గజపతినగరం,నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా గురువారం ఎన్నికల కంట్రోల్ రూంను, మీడియా కేంద్రాన్ని సందర్శించారు. కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన వాహనాల జీపీఎస్, చెక్ పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాల లైవ్ కార్యక్రమాలను, మీడియా మానిటరింగ్, ఎంసీసీ, సీ-విజిల్, 24/7 ఫిర్యాదుల విభాగం, సోషల్ మీడియా పర్యవేక్షణ, రిపోర్ట్స్ విభాగాలను తనిఖీ చేశారు.

News April 25, 2024

విశాఖ: తీవ్ర వడగాలులు.. మీ ఊరిలో ఎండ తీవ్రత ఎలా ఉంది?

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. అనకాపల్లి జిల్లా రావికమతంలో బుధవారం 44.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. నేడు కూడా ఉమ్మడి జిల్లాలోని విశాఖ-1, అల్లూరి సీతారామరాజు-2, అనకాపల్లి-3 మండలాల్లోని తీవ్ర వడగాలులు, మరో 27 మండలాల్లో వడగాలులు వీచే అవకాసం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మరి మీ ఊరిలో ఎండ తీవ్రత ఎలా ఉందో కామెంట్ చెయ్యండి.

News April 25, 2024

తిరుపతి నగరంలో ఉద్రిక్తత

image

చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ, వైసీపీ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీ ర్యాలీగా వచ్చిన నాయకులు ఇద్దరు ఆర్వో కార్యాలయానికి వెళ్లే క్రమంలో కొందరు రాళ్లు విసిరారు. ఏమి జరిగిందో తెలుసుకునే లోపు నాయకులు ఆర్వో కార్యాలయంలోకి వెళ్లారు. పరిస్ధితి చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

News April 25, 2024

రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ

image

ఈనెల 26వ తేదీన గుడ్లూరులో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని గురువారం టీడీపీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సాయంత్రం కందుకూరు టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గుడ్లూరులో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొంటారని తెలిపారు. కావున మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

News April 25, 2024

లక్షా 50 వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధిస్తా: పెమ్మసాని చంద్రశేఖర్

image

గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుంటూరు ఎంపీగా తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ లక్షా 50 వేల ఓట్ల పైనే మెజార్టీ వస్తుందన్నారు. తాను కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. అలాంటి తనతో జగన్‌ను పోల్చడం సరికాదన్నారు. కష్టపడి పైకొచ్చిన ఎవరితో అయినా జగన్‌ను పోల్చి చూడటం అవమానకరమని పెమ్మసాని వివరించారు.

News April 25, 2024

ఈసీకి లేఖ రాసిన లోకసత్తా

image

మే 1న ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈసీకి,csకి లేఖ రాసినట్లు లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 66లక్షల మంది ఫించనుదారులు ఉన్నారని, 15వేల సచివాలాయలు, 1. 35 లక్షల సిబ్బంది ఉన్నారని వారి చేత రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేసేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.

News April 25, 2024

శ్రీకాళహస్తిలో ప్రైవేటు వైద్యురాలు సూసైడ్

image

వైద్యురాలు ఉరేసుకుని బలవన్మరణం చెందిన ఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. CI రారాజు కథనం మేరకు.. శ్రీకాళహస్తి పట్టణం కొత్తపేటకు చెందిన ప్రైవేటు వైద్యుడు డా.రాజేశ్‌రెడ్డితో చెన్నైకి చెందిన వైద్యురాలు అశ్విని(35)కి 8ఏళ్ల క్రితం పెళ్లైంది. అశ్విని తనగదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.