Andhra Pradesh

News April 25, 2024

VZM: అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగి మృతి

image

జామి మండలం కిర్ల గ్రామానికి దండి నాగరాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నాగరాజు అట్టాడ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత 2 రోజులుగా కనబడటం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం అలమండ హైవే వద్ద బ్రిడ్జ్ సమీపంలో స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News April 25, 2024

చీమకుర్తి: భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

image

చీమకుర్తిలో ఈనెల 21న జరిగిన చోరీ కేసును చేధించినట్లు ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ తెలిపారు. ఒంగోలులో మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ.. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన పమిడి పద్మశ్రీ తన సోదరుడు మృతి చెందడంతో ఈనెల 21న బల్లికురవ వెళ్లారు. తిరిగి వచ్చే సరికి తలుపులు పగులగొట్టి దుండగులు 70 సవర్ల బంగారు అభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగతనానికి పాల్పడిన ఇద్దరినీ అరెస్టు చేశారు.

News April 25, 2024

అవినాశ్ మంచివాడు కాబట్టే టికెట్ ఇచ్చాను: జగన్

image

వైఎస్ అవినాశ్ రెడ్డి మంచివాడు, తప్పు చేయలేదనే నమ్మకం ఉంది కాబట్టే ఎంపీ టికెట్ ఇచ్చానని సీఎం జగన్ పేర్కొన్నారు. అవినాశ్ మా అందరికంటే చిన్న పిల్లవాడని అతని భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యి అవినాశ్‌పైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. అవినాశ్‌రెడ్డికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News April 25, 2024

గాజువాక వైసీపీ అభ్యర్థి ఆస్తి రూ.10.54 కోట్లు

image

➤అభ్యర్థి పేరు: గుడివాడ అమర్ నాథ్
➤ ఆస్తుల మొత్తం : రూ.10.54 కోట్లు
➤ చరాస్తులు మొత్తం: రూ.3.40కోట్లు
➤స్థిరాస్తుల విలువ: రూ.6.91 కోట్లు
➤ కేసులు: 3
➤ అప్పులు: రూ.93.16 లక్షలు
➤➤2019లో ఆయన కుటుంబం ఆస్తి విలువ రూ.5.10 కోట్లు ఉండేది.

News April 25, 2024

కృష్ణా: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి జిల్లాలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా బుధవారం వరకు మొత్తం 142 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి దాదాపు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఒకరిద్దరు మాత్రమే ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు వేయాల్సి ఉంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది.

News April 25, 2024

VZM: ఇంటర్ ఫెయిల్ అయిన వారికి స్పెషల్ క్లాసులు

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అంబేడ్క‌ర్ గురుకులాల్లో ఇంటర్ తప్పిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త టి.పద్మజ తెలిపారు. 13 గురుకులాల్లోని ఫస్ట్ ఇయర్, సెకెండియర్ కలిపి 172 మంది ఫెయిలయ్యారని వెల్లడించారు. ఈనెల 24న తరగతులు ప్రారంభించగా.. మే 23 వరకు కొనసాగుతాయన్నారు. బాలురుకు కొప్పెర్లలో, బాలికలకు నెల్లిమర్ల గురుకులంలో వేర్వేరుగా తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

News April 25, 2024

పెరిగిన అనిల్ కుమార్ ఆస్తులు

image

నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్వోకి అందజేసిన అఫిడవిట్‌లో పలు విషయాలను ప్రస్తావించారు. 2019లో స్థిరాస్తులు రూ.30 లక్షలు చూపగా, ఈసారి రూ.1.83 కోట్లుగా పేర్కొన్నారు. చరాస్తులు కూడా రూ.2.79 కోట్ల నుంచి రూ.4.53కోట్లకు పెరిగాయి. అప్పు రూ.1.59కోట్లు ఉంది. ఈయన పేరు మీద 2 కార్లు ఉన్నాయి. అనిల్ మీద ఒక పోలీస్ కేసు నమోదైంది.

News April 25, 2024

వైసీపీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకుడిగా గోరంట్ల మాధవ్

image

వైసీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడిగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలలో మరోసారి వైసీపీని గెలిపించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.

News April 25, 2024

కాకినాడలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి

image

స్నేహితులతో సరదాగా స్నానానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి మునిగి
మృతి చెందిన ఘటన ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. అనపర్తి శ్రీను (25) కూలి పనులు చేస్తుంటాడు. కొవ్వూరు లాకులు వద్ద కాలువలో స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లి మరణించాడు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 25, 2024

వాకర్స్ తో కలిసి విజయసాయి రెడ్డి ప్రచారం

image

నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్ స్కూలు మైదానం, ఏసీ సుబ్బారెడ్డి పార్కుల్లో గురువారం ఉదయం వైసీపీ ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజారోగ్యం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి నెల్లూరును క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు.