Andhra Pradesh

News April 25, 2024

ఏలూరు జిల్లాలో ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయో చూసేయండి

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆరో రోజు 1 పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాలు కలిపి 40 నామినేషన్లు దాఖలయ్యాయి. 18 తేదిన మొదలైన నామినేషన్ల పర్వం తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా ఏలురు పార్లమెంటు స్థానానికి 5 నామినేషన్లు దాఖలుకాగా.. మిగిలిన 7 అసెంబ్లీ స్థానాలకు 35 నామినేషన్లు దాఖలయ్యాయిని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. చివరి రోజు గురువారం భారీగా నామినేషన్లు వచ్చే అవకాశలు ఉన్నాయన్నారు.

News April 25, 2024

మెరిసిన విజయవాడ IFS అధికారి

image

విజయవాడకు చెందిన IFS అధికారి అబ్దుల్ రవూఫ్ తెలుగువారి ఖ్యాతిని పెంచారు. సివిల్స్ ప్రిపేర్ అయిన ఇతను మూడో ప్రయత్నంలో IFSకు సెలక్ట్ అయ్యారు. 2022-24 శిక్షణ సమయంలో వృత్తిపరమైన శిక్షణ కోర్సులో మంచి ప్రతిభ కనబరిచి 7 బంగారు పతకాలు సాధించారు. బుధవారం డెహ్రడూన్‌లోని ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీటిని అందుకున్నారు.

News April 25, 2024

గాజువాక టీడీపీ అభ్యర్థిపై మూడు కేసులు

image

గాజువాక TDP అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచారు. పల్లా కుటుంబ ఉమ్మడి ఆస్తుల విలువ రూ.34.32 కోట్లు. వాటిలో శ్రీనివాసరావు పేరిట స్థిరాస్తులు రూ.7.13కోట్లు,చరాస్తులు రూ.14.91 లక్షలు. ఆయన భార్య లావణ్యదేవి పేరిట స్థిరాస్తులు రూ.6.59 కోట్లు, చరాస్తులు రూ.61,34 లక్షలు. అవిభక్త కుటుంబానికి రూ.20.26 కోట్లున్నాయి. అప్పులు రూ.2.33 కోట్లు. ఆయనపై మూడు కేసులున్నాయి.

News April 25, 2024

నెల్లూరు: భారీగా మద్యం, నగదు స్వాధీనం

image

ఎన్నికల నేపథ్యంలో పోలీసు, సెబ్ అధికారులు బుధవారం భారీగా మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నారు. బాలాజీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రూ.2 లక్షలు, సంతపేటలో రూ.92వేలు, కోవూరు రూ.2 లక్షలు, కావలి పట్టణం రూ. 5 లక్షలు, సంగం రూ.1.67 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దగదర్తిలో 42 మద్యం సీసాలు, సైదాపురంలో 10, బిట్రగుంటలో 35, కృష్ణపట్నం పోర్టులో 21, జలదంకిలో 8, కలిగిరిలో 11, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

News April 25, 2024

భీమవరం అభ్యర్థి ఆస్తులు ఎన్నో చూసేయండి..!

image

పేరు: పులపర్తి రామాంజనేయులు
పార్టీ: జనసేన
విద్యార్హత: ఇంటర్మీడియట్
కేసులు: లేవు
చరాస్తుల విలువ: అభ్యర్థి పేరిట :2.30 కోట్లు ,భార్య పేరిట : 1.29 కోట్లు
స్థిరాస్తులు : అభ్యర్థి పేరిట :20.22 కోట్లు, భార్య పేరిట : 10.53 కోట్లు
బంగారం విలువ అభ్యర్థి పేరిట : రూ.50,000 , భార్య పేరిట : రూ.43.75 లక్షలు
అప్పులు: లేవు
వాహనాలు: లేవు

News April 25, 2024

నెల్లూరు: వాటర్ కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

నెల్లూరు జిల్లాలో తాగు నీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరి నారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోన్ నంబరు 91001 21702 ను సంప్రదించాలని సూచించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, గ్రామాల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News April 25, 2024

కడపకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ ఒకరోజు పర్యటనలో భాగంగా కడప జిల్లా చేరుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో తన నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన గన్నవరం నుంచి విమానం ద్వారా కడప విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా పులివెందులకు బయలుదేరి వెళ్లారు. ముందుగా సీఎస్ఐ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని అనంతరం తన నామినేషన్ ను అందజేయనున్నారు.

News April 25, 2024

మాజీ మంత్రి సోమిరెడ్డిపై 17 కేసులు

image

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుటుంబ ఆస్తుల విలువ రూ.11.03 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సోమిరెడ్డి పేరున రూ.62 లక్షలు చర, రూ.9.18 స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ఆయన భార్య జ్యోతి పేరున రూ.1.22 కోట్ల చరాస్తులు ఉన్నాయి. సోమిరెడ్డిపై మొత్తం 17 కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

News April 25, 2024

ఒంగోలులో కానిస్టేబుల్ రత్నబాబుపై వేటు

image

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి వైసీపీ ర్యాలీలో పాల్గొన్న కానిస్టేబుల్ డి.ఎన్.బి. రత్నబాబు అలియాస్ గోపిపై వేటు పడింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ బుధవారం ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ ఉత్తర్వులు ఇచ్చారు. ఒంగోలులో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జస్వంతరావు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు రత్నబాబుపై కేసు కూడా నమోదైంది.

News April 25, 2024

నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ ఎలక్షన్ కో ఆర్డినేటర్‌గా జంగా

image

నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ ఎలక్షన్ కో ఆర్డినేటర్‌గా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. రెండుసార్లు గురజాల ఎమ్మెల్యేగా జంగా ఎన్నికయ్యారు. వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌గా పని చేశారు. వైసీపీతో విభేదించి టీడీపీలో చేరారు. నరసరావుపేట పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచి చంద్రబాబుకు గిఫ్టుగా ఇస్తామని జంగా చెప్పారు.