Andhra Pradesh

News April 25, 2024

పోలవరం అభ్యర్థి కుటుంబానికి 67ఎకరాల భూమి ..!

image

అభ్యర్థి: తెల్లం రాజ్యలక్ష్మి ( వైసీపీ)విద్యార్హతలు: డిగ్రీ, బీఏ కేసులు: ఏమీ లేవుచరాస్తుల విలువ: రూ.41.61లక్షలు, భర్త బాలరాజు పేరిట: రూ.98.54 లక్షలుబంగారం: 130 గ్రాములు, భర్తకు- 30 గ్రాములుస్థిరాస్తి: 24.10 ఎకరాలు,
భర్తకు 30.74 ఎకరాలు,
కుమారుడి పేరిట-12.38 ఎకరాలు అప్పులు: రూ.25.41 లక్షలు,
భర్తకు రూ.43.27 లక్షలువాహనాలు: భర్త పేరున పార్చ్యునర్ కారు, కుమారుడి పేరిట ఇన్నోవా క్రిస్టా కారు

News April 25, 2024

కర్నూలు: నిరుద్యోగి నామినేషన్ దాఖలు

image

కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన బోయ రంగస్వామి అనే నిరుద్యోగి బుధవారం ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రంగస్వామి మాట్లాడుతూ.. పాలక, ప్రతిపక్ష పార్టీలు అవలంబిస్తున్న నిరుద్యోగ విధానాలకు వ్యతిరేకంగా యువత నడుం బిగించాలనే ఉద్దేశంతో నామినేషన్ వేసినట్లు తెలిపారు. యువత మేలుకోవాలని, భవిష్యత్తును మనమే మార్చుకోవాలని అన్నారు.

News April 25, 2024

విశాఖ రైల్వే స్టేషన్‌లో రూ.20కే భోజనం

image

విశాఖ రైల్వే స్టేషన్లో ఎకానమీ మీల్స్, స్నాక్ మీల్స్‌ను రైల్వేశాఖ ఐఆర్‌సీటీసీతో కలిసి అందుబాటులోకి తీసుకువచ్చింది. వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేకంగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారి కోసం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులకు రెండు రకాల మీల్స్ అందుబాటులో ఉంచుతున్నారు. ఎకానమీ మీల్స్ రూ.20, స్నాక్ మీల్స్ రూ. 50కు అందిస్తున్నారు.

News April 25, 2024

ఆత్మకూరు: మాజీ ఎంపీ మేకపాటిపై కేసు నమోదు

image

మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిపై ఎన్నికల నియమావళి అతిక్రమణ కేసు నమోదైంది. ఈ కేసును ఈ నెల 22న నమోదు చేయగా… ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న మర్రిపాడు మండలం అల్లంపాడులో రచ్చబండ జరిగింది. ఈ కార్యక్రమంలో మేకపాటి ఆత్మకూరు ఛైర్ పర్సన్ గోపారం వెంకట రమణమ్మపై ఎన్నికల నియమావళిని అతిక్రమించి.. అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా కేసు నమోదైంది.

News April 25, 2024

నెల్లూరు: మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు

image

మే నెల 2 నుంచి 8వ తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. ఇందుకు సంబంధించి నగర పాలక సంస్థలోని కమాండ్ కంట్రోల్ సెంటరులో నోడల్ అధికారులు, ఆర్వోలతో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ సంజనా సింహా, డీఆర్వో లవన్న తదితరులు పాల్గొన్నారు.

News April 25, 2024

చిత్తూరు: మే ఒకటి నుంచి ఓటర్ స్లిప్పులు

image

మే ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఓటర్లకు బీఎల్ఓల ద్వారా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు చేసుకున్న ఓటర్లకు సంబంధించి ఆరు వేల ఎపిక్ కార్డులు ఈ నెల 29న జిల్లాకు రానున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి మూడు నుంచి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

News April 25, 2024

పాలకొల్లు వైసీపీ అభ్యర్థి గుడాల గోపి అఫిడవిట్ వివరాలు

image

విద్యార్హతలు: 10
కేసులు: ఒకటి 
చరాస్తులు :
అభ్యర్థి పేరిట- రూ.18.లక్షలు, భార్య పేరిట- రూ.11.56 లక్షలు
స్థిరాస్తుల విలువ: అభ్యర్థి పేరిట- రూ.8.59 కోట్లు, భార్య పేరిట- రూ.12.86 కోట్లు
బంగారం: 775 గ్రాములు, వెండి- 2 కేజీలు
వాహనాలు : రూ.11.76 లక్షల విలువైన ఫార్చునర్ కారు, రూ.8.33 లక్షల టయోట కారు

News April 25, 2024

మలికిపురంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ

image

పవన్ కళ్యాణ్ మలికిపురంలోని పద్మజ సినిమా హాల్ కూడలి సమీపంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈమేరకు రాజోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థి దేవ వరప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త గుండుబోగుల పెదకాపు బుధవారం తెలిపారు. ఈ సభకు కూటమి శ్రేణులు హాజరు కావాలని కోరారు.

News April 25, 2024

రాష్ట్రంలోనే అత్యధికంగా విజయనగరం జిల్లాలో

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. తుమ్మికాపల్లిలో బుధవారం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. నేడు కూడా ఉమ్మడి జిల్లాలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. విజయనగరంలో 23, పార్వతీపురం మన్యం జిల్లాలోని 12 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News April 25, 2024

శ్రీకాకుళం: గుర్తు తెలియని మహిళ మృతి

image

రాజాం-శ్రీకాకుళం ప్రధాన రహదారి మెట్టవలస బస్ షెల్టర్ వద్ద బుధవారం ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండడంతో స్థానికులు గమనించి 108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించింది. వివరాలు తెలిసిన వారు రాజాం పోలీసులను సంప్రదించాలని కోరారు.