Andhra Pradesh

News August 26, 2025

విశాఖలో C.M. పర్యటన ఖరారు

image

C.M.చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైంది. 29న సీఎం విశాఖ రానున్నారు. ఉదయం 11.15కి విశాఖ నావెల్ కోస్టల్ బ్యాటరీకి చేరుకుంటారు. 11.45 నుంచి 12.45 వరకు నోవాటెల్‌లో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌కి హాజరవుతారు. 1.15 నుంచి 3.45 వరకు రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో గ్రిఫిన్ ఫౌండేషన్ నెట్ వర్క్ మీటింగ్లో పాల్గొంటారు. సా. 4.20కి విశాఖ నుంచి బయలుదేరి వెళ్తారు.

News August 26, 2025

ఓటరు దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష

image

ఓటరు దరఖాస్తులను మరింత మెరుగ్గా పరిష్కరించే విధానాలపై బూత్ లెవల్ అధికారులకు శిక్షణ పూర్తి చేశామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 35.ca మార్గదర్శకాల ప్రకారం ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆమె చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఈ వివరాలు వెల్లడించారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు.

News August 26, 2025

డీఎస్సీలో విశాఖ జిల్లా టాపర్‌గా శ్రావణి

image

మెగా డీఎస్సీ 2025లో మరడాన శ్రావణి 86 మార్కులతో(ఎస్ఏ) విశాఖ జిల్లా టాపర్‌గా నిలిచింది. జోన్-1మోడల్ స్కూల్ టీజీటీ ఇంగ్లీష్ 78 మార్కులతో 15వ ర్యాంకు సాధించి రెండు పోస్టులకు ఎంపికయింది. ఈమె ప్రాథమిక, ఉన్నత విద్య శ్రీహరిపురం, కళాశాల విద్య గాజువాకలోను అభ్యసించింది. గతంలో గ్రామ సచివాలయం ఉద్యోగం వచ్చినా వదులుకొని డీఎస్సీ‌కి ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించింది.

News August 26, 2025

VZM: గణేష్, దేవీ మండపాలకు ఉచిత విద్యుత్

image

రేపటి నుంచి ప్రారంభమయ్యే వినాయక నవరాత్రి ఉత్సవాలు, ఆ తర్వాత ప్రారంభం కానున్న దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆయా విగ్రహాల మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందిచనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మమణరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు 3KW, పట్టణాలకు 5KW వరకు ఉచిత లోడ్‌‌ను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మండప నిర్వాహకులు స్థానిక విద్యుత్ సిబ్బందిని సంప్రదిస్తే మంజూరు చేస్తారన్నారు.

News August 26, 2025

అంకితభావం ఉన్న వారికే పదవులు: మంత్రి నిమ్మల

image

పార్టీ పట్ల అంకితభావం ఉన్నవారిని పార్టీ పదవులకు ఎంపిక చేస్తున్నామని మంత్రి రామానాయుడు చెప్పారు. మంగళవారం విశాఖలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ అధ్యక్షుల ఎంపిక జరుగుతుందన్నారు. వైఎస్ విజయమ్మను వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తొలగించేందుకు ప్లీనరీ పెట్టుకున్నారని విమర్శించారు. T.D.P.లో అందరి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని పార్టీ పదవులకు ఎంపిక చేస్తామన్నారు.

News August 26, 2025

కడప: ‘బార్ల దరఖాస్తుకు గడువు పొడిగింపు’

image

కడప జిల్లాలో బార్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఈనెల 29వ తేది వరకు పొడిగించినట్లు జిల్లా ప్రాహిబిషన్ & ఎక్సైజ్ అధికారి రవికుమార్ మంగళవారం తెలిపారు. జిల్లాలో జనరల్ కేటగిరిలో 27, గీత కులాల కేటగిరీలో 2లో కలిపి మొత్తం 29 బార్ల ఏర్పాటుకు అధికారులు గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు.

News August 26, 2025

విశాఖలో 1097 మండపాలకు అనుమతి: కమిషనర్

image

వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు జీవీఎంసీ సింగిల్ విండో క్లియరెన్స్ సెల్ ద్వారా 1097 మంది నిర్వాహకులకు అనుమతులను మంజూరు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం తెలిపారు. జీవీఎంసీకి సంబంధించిన పట్టణ ప్రణాళిక, అగ్నిమాపక, ఎలక్ట్రికల్, పారిశుద్ధ్య విభాగాల అధికారులు దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేసినట్టు వెల్లడించారు. అందరూ వినాయక చవితి పర్యావరణహితంగా జరుపుకోవాలని కమిషనర్ సూచించారు.

News August 26, 2025

చిత్తూరు ప్రజలకు చవితి శుభాకాంక్షలు: ఎస్పీ

image

చిత్తూరు జిల్లా ప్రజలకు ఎస్పీ మణికంఠ చందోలు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. సామరస్యంతో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే వినాయక చవితిని సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. మండప నిర్వాహకులు సూచనలు పాటించాలన్నారు. నిమజ్జనం శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టామన్నారు.

News August 26, 2025

ప్రకాశం: బార్ల దరఖాస్తుల గడువు పెంపు.!

image

ప్రకాశం జిల్లాకు ఓపెన్ కేటగిరిలో కేటాయించబడ్డ 26 బార్ల దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి అయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడారు. ముందుగా 28వ తేదీ గడువు ఉండగా, ప్రభుత్వం 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ బార్లకు 30వ తేదీ ఉదయం 8 గంటలకు లాటరీ తీస్తామన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తులను సమర్పించాలని కోరారు.

News August 26, 2025

రూ.6.74 కోట్ల విలువైన సిటీ స్కాన్ సౌకర్యాన్ని ప్రారంభించిన మంత్రి

image

ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రూ.6.74 కోట్ల విలువైన సిటీ స్కాన్ సౌకర్యాన్ని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితతో పాటు సంబంధిత అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో సిటీ స్కాన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు.