Andhra Pradesh

News April 25, 2024

నరసరావుపేటలో ఆరవ రోజు 64 నామినేషన్లు

image

జిల్లాలో ఆరవ రోజు బుధవారం మొత్తం 64 నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. అత్యధికంగా నరసరావుపేట పార్లమెంటుకు 10, అసెంబ్లీ స్థానానికి 11, నామినేషన్లు వేశారని చెప్పారు. పెదకూరపాడు అసెంబ్లీకి 7, చిలకలూరిపేట అసెంబ్లీకి 7 సత్తెనపల్లి అసెంబ్లీకి 9 వినుకొండ అసెంబ్లీకి 6, గురజాల అసెంబ్లీకి 7, మాచర్ల అసెంబ్లీకి 7 ,నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. 

News April 25, 2024

ఉద్యోగులు 26వ తేదీలోగా ఫామ్-12ను సమర్పించండి: విద్యాశాఖ అధికారి

image

ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు ఈనెల 26వ తేదీ లోపు ఫామ్-12ను సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. ఎన్నికలలో విధులు నిర్వర్తించడానికి ఉత్తర్వులు పొందిన ఉద్యోగులు ఫామ్-12ను సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందించి పోస్టల్ బ్యాలెట్ పొందాలన్నారు. 26వ తేదీ లోపల అందించని పక్షంలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను కోల్పోతారన్నారు.

News April 25, 2024

ఏలూరు: ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన: JC

image

దెందులూరు అసెంబ్లీ పరిధిలో 5వ రోజు బుధవారం ఏడుగురు అభ్యర్థులు తొమ్మిది నామినేషన్లు దాఖలు చేశారని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి బుధవారం వెల్లడించారు. కాగా ఏప్రిల్ 26న ఉదయం 11 గంటలకు అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన ఉంటుందని స్పష్టం చేశారు.

News April 25, 2024

తెలంగాణ టాప్ ర్యాంకర్ మనమ్మాయే..!

image

చిత్తూరు: తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 466 మార్కులతో స్పందన రాష్ట్రస్థాయిలో 3వ స్థానం సాధించింది. ఆమెది ఉమ్మడి చిత్తూరు జిల్లా కావడం గమనార్హం. తంబళ్లపల్లె ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్న యం.సురేంద్ర నాయక్ కుమార్తె స్పందన హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతోంది. ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు 466 మార్కులు సాధించింది. స్పందనను పలువురు అభినందించారు.

News April 25, 2024

ఎచ్చెర్ల: ఆలయంలో 30 తులాల బంగారం చోరీ

image

ఎచ్చెర్ల మండలంలోని కుంచాల కురమయ్యపేట దేవీ ఆశ్రమంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు 30 తులాల బంగారం, 100 తులాల వెండి, రూ.44 లక్షల నగదు చోరీకి గురైనట్లు అర్చకుడు బాల భాస్కర శర్మ తెలిపారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగిందని బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయంలోని సీసీ ఫుటేజ్‌ని దొంగలు ధ్వంసం చేశారు. ఈ మేరకు క్లూస్ టీం ఆలయంలో వివరాలు సేకరిస్తున్నారు.

News April 25, 2024

ప.గో.: పోడూరు మండలానికి ఇద్దరు MLAలు

image

పోడూరు మండలానికి ఇద్దరు MLAలు ఉన్నారు. మండలంలో 16 గ్రామాలుండగా కొన్నిగ్రామాలు ఆచంట నియోజకవర్గంలో, మరికొన్ని పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో సమయంలో మండలంలోని పోడూరు, జగన్నాథపురం, తూర్పుపాలెం, మినిమించిలిపాడు, కవిటం, పి.పోలవరం, గుమ్మలూరు గ్రామాలు ఆచంటలో చేరగా.. పెనుమదం, వద్దిపర్రు, జిన్నూరు, వేదంగి, కొమ్మచిక్కాల, అప్పన చెర్వు, రావిపాడు, మట్టపర్రు పాలకొల్లు పరిధికి వచ్చాయి.

News April 25, 2024

26న తిరుమలకు ఉపరాష్ట్రపతి రాక

image

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారని.. ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌తో కలిసి అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. 26న ఉదయం 11.25కు ఉపరాష్ట్రపతి తిరుమలకు రానున్నట్టు చెప్పారు. 25న తిరుపతికి గవర్నర్ వస్తారని వెల్లడించారు.

News April 25, 2024

గుండెపోటుకు గురై ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి

image

గుండెపోటుకు గురై ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందాడు. అనంతపురం నార్పల మండలంలోని నాయనపల్లి సమీపంలో తాడిపత్రి -అనంతపురం ప్రధాన రహదారిపై బస్సు ఆపి డ్రైవర్ ఓబుల్ రెడ్డి కుప్పకూలిపోయాడు. వెంటనే అంబులెన్స్‌లో అనంతపురానికి తరలించగా అక్కడ మృతిచెందాడు. విధుల్లో భాగంగా తాడిపత్రి తాడిపత్రి నుంచి ధర్మవరం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

News April 25, 2024

కృష్ణా జిల్లాలో 6వ రోజు 57నామినేషన్లు దాఖలు

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ 6వ రోజుకి చేరింది. 6వ రోజైన బుధవారం జిల్లాలో 57 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం MP స్థానానికి 06 దాఖలవ్వగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 51 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం అసెంబ్లీకి 08, గన్నవరం09, అవనిగడ్డ08, పెడన07, పామర్రు05, పెనమలూరు09, గుడివాడ 05నామినేషన్లు దాఖలైనట్లు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.  

News April 25, 2024

సూపర్ రేంజర్స్ పార్టీ మేనిఫెస్టో విడుదల

image

సూపర్ రేంజర్స్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర బుధవారం విడుదల చేశారు. కుటుంబానికి రూ.లక్ష, యువతులకు మొబైల్ ఫోన్, మహిళలకు కొత్త గ్యాస్ కనెక్షన్, యువకులకు ఉచితంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే వారికి రూ.2 లక్షల అందజేస్తామన్నారు. కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపించిన 5 ఏళ్లలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.