Andhra Pradesh

News April 25, 2024

పుట్టపర్తిలోకి రాకుండా వాహనాలతో అడ్డగింపు

image

 జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాకుండా పోలీసులు వాహనాలతో అడ్డుకున్నారు. సత్యసాయి బాబా ఆరాధన సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో నారాయణ సేవ జరగుతుంది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి నామినేషన్ వేస్తుండగా వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పుట్టపర్తి పట్టణంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా రాకుండా పోలీసులు తమ వాహనాలను అడ్డుపెట్టారు.

News April 25, 2024

ఫిర్యాదులన్నింటికీ పరిష్కారం: కడప కలెక్టర్

image

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై మొత్తం 69 ఫిర్యాదులు అందగా, అన్నింటిని పరిష్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. మంగళవారం విడుదలైన జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ఫిర్యాదుల పరిష్కార నివేదిక మేరకు సివిజిల్ ద్వారా మొత్తం 367 కేసులు నమోదు కాగా 224 నిజనిర్ధారణ అయ్యాయని, 143 నిరాధారమైనవిగా గుర్తించామన్నారు. ఇప్పటివరకు 1078 కేసులు నమోదు చేశామన్నారు.

News April 25, 2024

రాజవొమ్మంగిలో వడదెబ్బకు వ్యక్తి మృతి

image

రాజవొమ్మంగి విద్యానగర్‌కు చెందిన చికిరెడ్ల నూకరాజు వడదెబ్బకు గురై మృతి చెందాడని కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. రాజవొమ్మంగి గ్రామం శివారున ఉన్న జీడిమామిడి తోటలో జీడీపిక్కల సేకరిస్తూ వేడిని తట్టుకోలేక ఇంటికి వచ్చి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అంబులెన్సులో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. 

News April 25, 2024

విశాఖ: ‘భరత్ అనే నేను’ అనేదెవరు?

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ, వైసీపీ పార్టీల నుంచి భరత్ అనే పేరుతో ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి మతుకుమిల్లి శ్రీ భరత్ పోటీ చేస్తుండగా.. అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మలసాల భరత్ బరిలో ఉన్నారు. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. మరి వీరిలో గెలిచి ‘భరత్ అనే నేను’ అంటూ ప్రమాణ స్వీకారం చేసేదెవరని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.

News April 25, 2024

శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నామినేషన్

image

శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, కలమట వెంకటరమణ, కింజరాపు హరి వరప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ మేరకు నామినేషన్ పత్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలాని సమూన్‌కు అందజేశారు.

News April 25, 2024

నెల్లూరు: ఇటీవల టీడీపీలో … నేడు వైసీపీలో చేరిక

image

ఇటీవల టీడీపీలోకి వెళ్లిన మత్స్యకార నాయకుడు, కావలి రూరల్ మాజీ జడ్పీటీసీ సభ్యుడు సోమయ్యగారి రాంబాబు తిరిగి వైసీపీలో చేరారు. నెల్లూరులో ఇవాళ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు రాంబాబుకి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

News April 25, 2024

తూ.గో జిల్లా: మాజీ సైనికులకు పథకాల రిజిస్ట్రేషన్

image

తూ.గో జిల్లా మాజీ సైనికులకు, సైనిక సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే వివిధ పథకాలు, ప్రయోజనాలను పొందేలా దరఖాస్తు చేసుకునేందుకు ap.sainic.com వెబ్ సైట్ ను రూపొందించినట్లు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కృష్ణారావు తెలిపారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువులు వారి వివరాలను తప్పనిసరిగా ఈ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News April 25, 2024

రేపటి సీఎం జగన్ పర్యటన షెడ్యూల్

image

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పులివెందులకు రానున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు ఆయన తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం గన్నవరం నుంచి విమానంలో కడప చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో పులివెందులకు చేరుకుంటారు. ముందుగా సీఎస్ఐ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని, సభ అనంతరం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందించనున్నారు. తరువాత కడప చేరుకుని గన్నవరం బయల్దేరి వెళ్తారు.

News April 25, 2024

వై.పాలెం: తిరుపతి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం

image

యర్రగొండపాలెం సమీపంలో బుధవారం వేకువజామున కాలకృత్యాలు తీర్చుకొని రోడ్డు దాటుతున్న జంగా వెంకటలక్ష్మిని కమాండర్ కారు ఢీకొనడంతో మృతి చెందింది. తిరుపతిలో దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈమె యర్రగొండపాలెం మండలంలోని వెంకటాద్రిపాలెం నివాసి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే గ్రామంలో ఉన్న బంధువులందరూ విలపించారు. కళ్లెదుటే కుటుంబ సభ్యురాలు చనిపోవడంతో వారు తట్టుకోలేకపోయారు.

News April 25, 2024

తంబళ్లపల్లిలో ఉత్కంఠ…TDP అభ్యర్థిత్వంపై తేలని పంచాయితీ

image

తంబళ్లపల్లి TDPలో ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలో అన్ని సీట్లపై క్లారిటీ వచ్చినా తంబళ్లపల్లి విషయంలో ఇంకా పీటముడి వీడలేదు. తంబళ్లపల్లి సీటుకు తప్ప మిగిలిన అభ్యర్థులందరికీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు బీఫామ్‌లను అందజేశారు. ఇక్కడ జయచంద్రారెడ్డిని మార్చి ఆ స్థానంలో కొండా నరేంద్ర లేదా శంకర్ యాదవ్‌లకు బీఫామ్ ఇవ్వవచ్చనే ప్రచారం సాగుతోంది. నామినేషన్లకు ఒక్కరోజే మిగిలి ఉండటంతో ఉత్కంఠ కొనసాగుతోంది.