Andhra Pradesh

News April 25, 2024

ఐదో రోజు మొత్తం 36 మంది నామినేషన్లు

image

2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఐదో రోజు మంగళవారం పలు రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు 36 మంది అభ్యర్థులు 44 సెట్లు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఐదుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.

News April 25, 2024

గుంటూరు వ్యక్తి హైదరాబాద్‌లో సూసైడ్

image

గుంటూరుకు చెందిన యానిమేషన్ సినిమా కథ రచయిత ప్రశాంత్ (45) ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ మణికొండలో నివాసం ఉండే ఇతనికి మంగళవారం బంధువులు ఫోన్ చేశారు. ఎంత సేపటికీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెళ్లి చూడగా ఉరేసుకొని కనిపించాడు. తన ఆరోగ్యం బాలేదని, వైద్యానికి చేసిన అప్పులు తీర్చలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 25, 2024

కోనసీమ జిల్లాలో 480 కంప్లైంట్లు

image

ఎన్నికల ఉల్లంఘనలపై ఈ నెల 16-23 వరకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 480 ఫిర్యాదులు వచ్చాయని సీపీఓ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. వాటిలో 94 ఫిర్యాదులు ఎన్నికలకు సంబంధం లేని వాటిగా గుర్తించి వాటిని తిరస్కరించామన్నారు. 386 ఫిర్యాదులను 100 నిమిషాల లోపు పరిష్కరించామన్నారు. మిగిలిన 37 ఫిర్యాదులను వంద నిమిషాలు తర్వాత పరిష్కరించామని చెప్పారు. వెలగపూడి కార్యాలయానికి వచ్చిన 33 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు.

News April 25, 2024

VZM: పోక్సో కేసులో నిందితుడికి జైలు

image

విజయనగరం దిశ మహిళా పోలీసు స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష పడింది. పూసపాటిరేగ మండలం కృష్ణాపురానికి చెందిన జి.రాంబాబు(27)పై 2021లో పోక్సో కేసు నమోదయ్యింది. ఈ మేరకు విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి ఏడేళ్లు జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించారని దిశా స్టేషన్ ఇన్ ఛార్జ్ డీఎస్పీ డి.విశ్వనాథ్ తెలిపారు.

News April 25, 2024

నెల్లూరులో మద్యం, నగదు స్వాధీనం

image

జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు పోలీసులు తనిఖీల్లో నగదు, మద్యం గుర్తించి సీజ్ చేశారు. చిన్నబజారు పోలీసు స్టేషన్ పరిధిలో రూ.2 లక్షలు, సంతపేట పరిధిలో రూ.1.16 లక్షలు, దుత్తలూరులో రూ.65 వేలు స్వాధీనం చేసుకున్నారు. కావలిలో 10, బిట్రగుంటలో 30, అల్లూరులో 13, కొండాపురంలో 38, కలిగిరిలో 11, జలదంకిలో 17, వరికుంటపాడులో 18, సంగంలో 10, కందుకూరులో 14 మద్యం సీసాలను సీజ్ చేశారు.

News April 25, 2024

మండలి బుద్ధ ప్రసాద్ గెలుపు కోసం కుమార్తెల ప్రచారం

image

అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ గెలుపు కోసం ఆయన కుమార్తెలు కృష్ణప్రభ, అవనిజ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళవారం ఘంటసాల మండలం కొడాలి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వారి వెంట టీడీపీ మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరి బాబు ఉన్నారు.

News April 25, 2024

సిక్కోలులో పొలిటికల్ హీట్

image

శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ హీట్ నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతలిద్దరూ జిల్లాలోనే ఉన్నారు. నిన్న పాతపట్నం ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు.. ఈరోజు శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్ లో మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సీఎం జగన్ కూడా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు. మేమంతా బస్సు యాత్ర భాగంగా ఈరోజు ఎచ్చెర్ల నుంచి శ్రీకాకుళం బైపాస్ మీదుగా టెక్కలి చేరుకుని.. అక్కడ సభలో ప్రసంగించనున్నారు.

News April 25, 2024

ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

మేలో జరిగే ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు బుధవారం తుది గడువు అని అనంతపురం జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, డిఈఓ వెంకటరమణ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని సంబంధిత జూనియర్ కళాశాలలో ఫీజు చెల్లించాలని సూచించారు. ఫీజు మొత్తాన్ని ఆన్లైన్‌లో మాత్రమే చెల్లించాలని స్పష్టం చేశారు.

News April 25, 2024

కడప: పోలింగ్ రోజు సెలవుగా ప్రకటన

image

కార్మిక శాఖ దుకాణాలు సంస్థల చట్టం -1988 ప్రకారం మే 13న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దుకాణాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కార్మిక శాఖ సెలవు ప్రకటించిందని జిల్లా కార్మిక శాఖ కమిషనర్ శ్రీకాంత్ నాయక్ తెలిపారు. కావున వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ఇతర సంస్థల్లో పని చేస్తున్న ప్రతి వ్యక్తికి ఓటు వేసేందుకు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలన్నారు.

News April 25, 2024

కొండయ్య నామినేషన్‌కి రానున్న హీరో నిఖిల్

image

యువ సినీ హీరో నిఖిల్ మామ, చీరాల టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనడానికి గురువారం చీరాల వస్తున్నారు. కార్తికేయ-2 మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఈమధ్య ఆయన తన బావ అమర్నాథ్, మహేందర్నాథ్ లతో కలిసి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ను కలుసుకోగా పార్టీ తరఫున ప్రచారం చేయాలని ఆయన కోరారు.