Andhra Pradesh

News April 25, 2024

నరేంద్ర వర్మ ఆస్తులు ఎంతంటే.?

image

బాపట్ల కూటమి అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో దంపతుల ఉమ్మడి ఆస్తి రూ.109.47 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వర్మ పేరిట చరాస్తులు రూ.73.72 కోట్లు, స్థిరాస్తులు రూ.22.59 కోట్లు.. అప్పు రూ.25.91 కోట్లు ఉంది. భార్య హరికుమారికి రూ.11.29 కోట్ల చరాస్తులు, రూ.1.87 కోట్ల స్థిరాస్తులున్నాయి. ఈయనకు సొంత కారు లేదు. 9 పోలీసులు కేసులున్నాయి.

News April 25, 2024

VZM: మొన్న చంద్రబాబు.. నిన్న జగన్.. నేడు పవన్

image

ఉత్తరాంధ్రపై ప్రధాన పార్టీల అధ్యక్షులు ఫోకస్ పెంచారు. సోమ, మంగళవారాల్లో చంద్రబాబు S.కోట, గజపతినగరం సభల్లో పాల్గొనగా.. నిన్న చెల్లూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగించారు. నేడు నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల్లో జరిగే సభల్లో చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్ పాల్గోనున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంటోంది. మరి మీ మద్దతు ఎవరికో కామెంట్ చెయ్యండి..

News April 25, 2024

నామినేషన్ నిర్ణయం వెనక్కి తీసుకున్న మాజీ ఎమ్మెల్యే

image

టీడీపీ టికెట్ ఆశించి బంగపడిన పాతపట్నం మాజీఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లా పర్యటనకు విచ్చేసిన చంద్రబాబు మంగళవారం రాత్రి కలమటను పిలిచి మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి ఇస్తామని కలమటకు చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో కలమట ఆయన అనుచరులతో మాట్లాడి, నామినేషన్ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.

News April 25, 2024

నెల్లూరు నగరంలో యువకుడి దారుణహత్య 

image

నెల్లూరు భక్తవత్సలనగర్‌కు చెందిన రామయ్య కుమారుడు దశరథ తాతతో కలిసి పుచ్చకాయల వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం పని ఉందని ఇంట్లో నుంచి వెళ్లిన దశరథ తిరిగి రాలేదు. మంగళవారం ఆటోనగర్‌లో దశరథ మృతదేహం వెలుగుజూసింది. కత్తులతో తీవ్రంగా దాడిచేయడంతో దశరథ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

News April 25, 2024

గూడూరు: పెళ్లి కావడం లేదని యువకుడి సూసైడ్

image

పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గూడూరు మండలంలోని రాయవరంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రమేశ్(33) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా పెళ్లి కాలేదని మనోవేదనతో ఉన్నాడు. ఈ క్రమంలో మద్యంలో విషం కలుపుకొని తాగాడు. దీంతో అతడిని బందరు ఆస్పత్రి, అక్కడి నుంచి విజయవాడ తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు.

News April 25, 2024

పాలకొండ రిటర్నింగ్ ఆఫీసర్‌గా శుభం బన్సాల్

image

పాలకొండ రిటర్నింగ్ ఆఫీసర్, సీతంపేట ఐటిడిఏ పిఓగా శుభం బన్సాల్‌ను నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే విధుల్లో చేరి బుధవారం మధ్యాహ్నం 1:00 లోపు జాయినింగ్ రిపోర్టును సమర్పించాలని ఐటిడిఏకు సమాచారం అందింది. ఐటిడిఏ రిటర్నింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన కల్పనా కుమారిని బదిలీ చేశారు. అనంతరం జేసి శోభికకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.

News April 25, 2024

పాణ్యంలో గెలుపునకు వారే కీలకం

image

పాణ్యం, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు మండల పరిధిలో కర్నూలు కార్పొరేషన్‌లోని 16 వార్డులు కలిపి 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. కాగా పాణ్యం మండలంలో 36,893 ఓటర్లు, ఓర్వకల్లు మండలం 48,121, గడివేముల 34,411, కల్లూరు మండలంలో 2,03,068 మంది ఓటర్లతో కలిపి మెుత్తం ఓటర్లు 3,22,493 ఉన్నారు. పాణ్యం నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపులో కల్లూరు మండల ఓటర్లు కీలక పాత్ర వహించనున్నాయి.

News April 25, 2024

రేపు రాజంపేటకు పవన్, చంద్రబాబు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు గురువారం రాజంపేటకు రానున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట, రైల్వేకోడూరు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం ఇద్దరు హెలికాప్టర్‌లో తిరుపతికి వెళతారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారి జిల్లాకు పవన్, చంద్రబాబు కలిసి రానుండటంతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సభలో పాల్గొననున్నారు.

News April 25, 2024

మార్కాపురం: కూతురి ఫంక్షన్‌కి వస్తూ తండ్రి మృతి

image

మార్కాపురంలో మంగళవారం హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. కొనకనమిట్ల మం, గుర్రాలమడుగుకు చెందిన కాశయ్య, కృష్ణ అన్నదమ్ములు. కాశయ్య కుమార్తె వీరమ్మ పుష్పాలంకణ వేడుక బుధవారం జరగనుంది. అందుకు సామగ్రి తెచ్చేందుకు వారు మార్కాపురం వెళ్లారు. తిరిగి వస్తుండగా రాయవరం సమీపంలో కారు వీరిని ఢీకొట్టగా, కాశయ్య అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో తండ్రి మృతిని చూసి ఆ చిట్టితల్లి గుండెలవిసేలా రోదించడం అందర్నీ కలచిచేసింది.

News April 25, 2024

మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి చిత్రాన్ని పచ్చబొట్టుగా వేసుకున్న అభిమాని

image

మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ భాష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి కోళ్ల బైలు పంచాయతీలో పర్యటించారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.  ఓ అభిమాని షాజహాన్ భాష చిత్రాన్ని తన ఛాతిపై వేసుకొని అభిమానాన్ని చాటుకున్నాడు.