Andhra Pradesh

News April 25, 2024

మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి చిత్రాన్ని పచ్చబొట్టుగా వేసుకున్న అభిమాని

image

మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ భాష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి కోళ్ల బైలు పంచాయతీలో పర్యటించారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.  ఓ అభిమాని షాజహాన్ భాష చిత్రాన్ని తన ఛాతిపై వేసుకొని అభిమానాన్ని చాటుకున్నాడు.

News April 25, 2024

నియోజకవర్గంలో హిందూపురం ఓటర్లే అధికం

image

హిందూపురం నియోజకవర్గ ఓటర్ల తుది జాబితా విడుదలైంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,46,002 మంది కాగా వీరిలో పురుష ఓటర్లు 1,23,752, మహిళలు 1,22,232, ఇతరులు 18మంది ఉన్నారు. హిందూపురం పట్టణంలో 1,26,488మంది ఓటర్లు ఉన్నారు. గ్రామీణ ఓటర్లు 1,19,514 మంది ఉన్నారు. హిందూపురంలో గెలుపునకు పట్టణ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు.

News April 25, 2024

రూ.9.64 కోట్ల బంగారు ఆభరణాలు స్వాధీనం

image

చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద చిల్లకూరు పోలీసులు మంగళవారం అకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో రూ.9.64 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకుండా నెల్లూరు నుంచి తిరుపతి, మదనపల్లె, చిత్తూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆభరణాలను సీజ్ చేసినట్లు గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు.

News April 25, 2024

చింతమనేని ప్రభాకర్‌ పై 93 కేసులు

image

➤ నియోజకవర్గం: దెందులూరు
➤ అభ్యర్థి: చింతమనేని ప్రభాకర్ (TDP)
➤ విద్యార్హతలు: డిగ్రీ
➤ చరాస్తి విలువ: రూ.34,93,887
➤భార్య పేరిట రూ.2,15,17,185
➤ స్థిరాస్తులు: రూ.41,85,19,800
➤ భార్య పేరిట రూ.7,12,89,500
➤ కేసులు: 93
➤ అప్పులు: రూ.77,34,471
➤ భార్య పేరిట రూ.1,04,45,990
➤ NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

News April 25, 2024

నెల్లూరు: 9 గంటల నుంచే ఓపీ సేవలు

image

నెల్లూరులోని జీజీహెచ్ లో ఉదయం 9 గంటల నుంచి ఓపీ సేవలు ప్రారంభించాలని సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ ఆదేశించారు. సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. రోగులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా ఓపీతో పాటు సర్జరీలు, ఇతర సూపర్ స్పెషాలిటీ సేవలు పెంచాలన్నారు. జీజీహెచ్ లోని అన్ని విభాగాల అధికారులతో ఆయన ఈ మేరకు సమీక్ష నిర్వహించారు.

News April 25, 2024

ప్రత్తిపాటి పుల్లారావుపై 13 కేసులు

image

పల్నాడు జిల్లా చిలకలూరిపేట కూటమి అభ్యర్థిగా ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అందజేసిన అఫిడవిట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. ఐదేళ్ల కాలంలో ఆయనపై 13 కేసులు నమోదయ్యాయి. పుల్లారావు పేరుతో చరాస్తులు రూ.55.70 కోట్లు, స్థిరాస్తులు రూ.15.51 కోట్లు, అప్పులు రూ.35.90 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు.

News April 25, 2024

కెమెరాలు చూస్తున్నాయ్.. జాగ్రత్త!

image

NLR: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు అధికారులు నిఘా పెంచారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కూడా నిబంధనల ఉల్లంఘనుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో సీసీ కెమెరాలు బిగించిన వాహనాలు కూడా రోడ్డెక్కాయి. ఈసీ నిబంధనలను ఉల్లంఘించే వారి కోసం డేగ కళ్లతో వేటాడుతున్నాయి.

News April 25, 2024

నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో నామినేషన్లు వేసేది వీళ్లే..

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బలసాని కిరణ్, ప్రత్తిపాడు కాంగ్రెస్ అభ్యర్థిగా కొరివి వినయ్ కుమార్, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, అన్నాబత్తుని శివకుమార్, మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మారెడ్డి, వినుకొండ టీడీపీ అభ్యర్థిగా జీవీ ఆంజనేయులు, గురజాల వైసీపీ అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. 

News April 25, 2024

REWIND: ఆలూరు ఏకైక మహిళా ఎమ్మెల్యే నీరజారెడ్డి

image

ఆలూరు నియోజకవర్గం మొదటి మహిళా ఎమ్మెల్యేగా నీరజారెడ్డి ఎన్నికయ్యారు. 1955 నుంచి 2019 వరకు ఎన్నికల వరకు అందరూ పురుషులే ఎమ్మెల్యేలు కాగా నీరజారెడ్డి మాత్రమే మహిళా ఎమ్మెల్యే కావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ప్రజారాజ్యం పార్టీ నుంచి బరిలో ఉన్న గుమ్మనూరు జయరాంపై విజయం సాధించారు. 2004లో మసాల పద్మజ, 2014లో కోట్ల సుజాతమ్మ కాంగ్రెస్, 2019లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు

News April 25, 2024

నేటి నుంచి ద్రాక్షారామ ఆలయం మూసివేత

image

ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో బుధవారం నుంచి గర్భాలయ దర్శనాలను నిలిపివేస్తున్నారు. శివలింగంపై గుంటలు పడి శిథిలావస్థకు చేరుకుంది. దీంతో శివలింగానికి రసాయనాలు పూసి మళ్లీ పూర్వ స్థితికి తీసుకువచ్చేందుకు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా బుధవారం నుంచి జూన్ 30వ తేదీ వరకు ఆలయాన్ని మూసి ఉంచుతామని ఆలయ అధికారులు తెలిపారు.