Andhra Pradesh

News April 25, 2024

కావలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

image

కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకి తరలించారు. చెన్నై నుంచి కొయ్యలగూడెంకు వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. మృతులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన జ్యోతి కళ్యాణి, రాజీ, కుమార్‌లుగా గుర్తించారు.

News April 25, 2024

కడప జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కలకలం

image

జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గత వారంలో కడపలోని ఓ బిల్డింగ్‌లోకి ఈ గ్యాంగ్ ప్రవేశించినట్లు సీసీ పుటేజీల ద్వారా వెల్లడైంది. సోమవారం రాత్రి మరికొన్ని చోట్ల తిరిగారని పోలీసులు అన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాత్రివేళల్లో పెట్రోలింగ్ కట్టుదిట్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, రాత్రిళ్లు ఎవరైనా బట్టలు లేకుండా వీధుల్లో కనపడితే 100కు ఫోన్ చేయాలని తెలిపారు.

News April 25, 2024

రేపు గుంటూరుకు షర్మిల పర్యటన

image

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గురువారం గుంటూరు నగరంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆమె నగరంలో రోడ్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. గురువారం మధ్యాహ్నం గుంటూరు చేరుకోనున్న ఆమె సాయంత్రం సంజీవయ్యనగర్, రాజీవ్ గాంధీనగర్, శారదాకాలనీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. అనంతరం రోడ్ షో నిర్వహించి ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.

News April 25, 2024

ప.గో: నేడు నామినేషన్లు వేసేది వీరే..!

image

ఉమ్మడి ప.గో జిల్లాలో బుధవారం పలువురు అసెంబ్లీ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వారిలో పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడాల గోపి, పోలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మి, నూజివీడు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొలుసు పార్థసారథి, నిడదవోలు కాంగ్రెస్ పెద్దిరెడ్డి సుబ్బారావు నామినేషన్ వేయనున్నారు.

News April 25, 2024

గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఆధునీకరణ పనులు కారణంగా విశాఖ నుంచి, విశాఖ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేశారు. గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ ను మే 27 వరకు, కాకినాడ-విశాఖ-కాకినాడ ఎక్స్ ప్రెస్ మే 26 వరకు రద్దు చేసినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొన్నారు.

News April 25, 2024

విజయవాడ: రూ.20కే భోజనం

image

విజయవాడ రైల్వే స్టేషన్లో ఎకానమీ మీల్స్ రూ.20, స్నాక్స్ మీల్స్ రూ.50కే అందిస్తున్నారు. వేసవి రైలు ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని IRCTCతో కలిసి తక్కువ ధరకే భోజనం పథకానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా జనరల్ బోగీల ప్రయాణికులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీటిని ప్రయోగాత్మకంగా విజయవాడతో పాటు రాజమహేంద్రవరంలో ప్రారంభించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DRM నరేంద్ర పాటిల్ కోరారు.

News April 25, 2024

కాటసాని కుటుంబం పేరిట 245.6 ఎకరాల భూమి

image

కాటసాని రాంభూపాల్ రెడ్డి మొత్తం ఆస్తుల విలువ రూ.75.19 కోట్లుగా నామినేషన్ అఫిడవిట్‌లో ఎన్నికల అధికారులకు సమర్పించారు. కుటుంబం మెుత్తం చరాస్తుల విలువ రూ.26.95 కోట్లు, స్థిరాస్తులు విలువ రూ.48.24 కోట్లు.. అప్పులు రూ.3.01కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. భూమి ఎకరాల్లో కాటసాని పేరుతో 10.87, ఆయన సతీమణికి 164.33, కుమారుడు, కుమార్తెల పేరిట 70.40 ఎకరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కాటసానిపై ఒక్క కేసు ఉంది.

News April 25, 2024

ప్రకాశం: ఆఖరి క్షణంలో అభ్యర్థులు మార్పు

image

ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటు చేసుకుంది. ఒంగోలుకు తొలుత బీఆర్ గౌస్ పేరు ప్రకటించగా ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టారు. మూడో జాబితాలో కొత్తపట్నం మండలానికి చెందిన దాసరి నాగలక్ష్మి ఖరారయింది. కొండపి సీటు తొలుత శ్రీపతి సతీశ్‌కు ఇచ్చారు. ఇప్పుడు పసుమర్తి సుధాకర్‌కు కేటాయించారు. అటు కనిగిరి సీటు కదిరి భవానికి కేటాయించగా ఇప్పుడు సుబ్బారెడ్డి పేరు తెరపైకి వచ్చింది.

News April 25, 2024

ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి ఆస్తుల వివరాలు

image

➤ నియోజకవర్గం: ఏలూరు పార్లమెంట్
➤ అభ్యర్థి: కారుమూరి సునీల్ కుమార్ (YCP)
➤ విద్యార్హతలు: బీఏ- బిజినెస్ మేనేజ్ మెంట్
➤ చరాస్తి విలువ: రూ.1.85 కోట్లు
➤ స్థిరాస్తులు: రూ.18.06 కోట్లు
➤ భార్య పేరున: రూ.6.48 కోట్లు
➤ కేసులు: 0
➤అప్పులు: రూ.1.02 కోట్లు
➤ NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

News April 25, 2024

VZM: అంధ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

విజయనగరంలోని పూల్ బాగ్ లో ఉన్న ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాచార్యుడు మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 38 సీట్లు ఉన్నాయన్నారు. 40 శాతం అంధత్వం కలిగిన 6 నుంచి 14 ఏళ్లలోపు బాల, బాలికలు అర్హులన్నారు. ఉచిత వసతి, పౌష్టికాహారం, ఆధునిక బ్రెయిలీ సామగ్రితో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు.