Andhra Pradesh

News April 25, 2024

VZM: మే 13న వేతనంతో కూడిన సెలవు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13న జరిగే పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్టు జిల్లా ఉప కార్మిక కమిషనర్ ఎన్.సుబ్రహ్మణ్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ దుకాణాలు, సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సెలవు ప్రకటించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు దుకాణదారులు, వివిధ సంస్థల యాజమాన్యాలకు ఆదే శాలు జారీ చేశామన్నారు.

News April 25, 2024

విశాఖ: ఆర్పీలు తొలగింపు.. సీఓలపై సస్పెన్షన్

image

ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా రిసోర్స్ పర్సన్స్‌ను తొలగిస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు మరో ఇద్దరు కమ్యూనిటీ ఆర్గనైజర్లను, ఒక సోషల్ వర్కర్ ను సస్పెండ్ చేశారు. ఆర్పీలు ఓటర్ల ఎపిక్ నెంబర్లు, ఆధార్ కార్డులు, సెల్ ఫోన్ నెంబర్లు సేకరించారన్న ఫిర్యాదుపై విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకున్నారు.

News April 25, 2024

చిత్తూరు: డిప్యూటీ మేయర్‌పై కేసు నమోదు

image

కర్ణాటక మద్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన కేసులో చిత్తూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రాజేశ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. కొంగారెడ్డి పల్లెలోని డిప్యూటీ మేయర్ రాజేశ్ కుమార్ రెడ్డికి చెందిన కారు షెడ్డులో నిల్వ ఉంచిన కర్ణాటక మద్యాన్ని ఈ నెల 18న ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పోలీసులతో కలిసి పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎంసీసీ అధికారులు ప్రకటించారు.

News April 25, 2024

తాగునీటి ఎద్దడిపై దృష్టి సారించాలి: అన్నమయ్య కలెక్టర్

image

జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ కెఎస్.జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

News April 25, 2024

కృష్ణా జిల్లాలో 5వ రోజు 28 నామినేషన్లు దాఖలు

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణలో భాగంగా 5వ రోజైన మంగళవారం జిల్లాలో మరో 28 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం MP స్థానానికి 07, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 21 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం అసెంబ్లీకి 07, గన్నవరంకు 07, అవనిగడ్డకు 03, పెడనకు 01, పామర్రుకు 01, పెనమలూరుకు 01, గుడివాడకు ఒక నామినేషన్ దాఖలైనట్టు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.

News April 25, 2024

మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేదు: కలెక్టర్

image

జిల్లాలో ప్రస్తుత వేసవిలో మంచినీటికి ఎటువంటి సమస్య తలెత్తకుండా పటిష్ఠమైన ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డికి తెలిపారు. BZA నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ప్రస్తుతం వేసవిలో ఎక్కడా తాగునీటికి ఎటువంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News April 25, 2024

సమర్థవంతంగా విధులు నిర్వహించాలి: SP వకుల్

image

ఎస్పీ వకుల్ జిందాల్ ఎస్.ఎస్.టి బృందాలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఎస్.ఎస్.టి బృందాలు సమర్థవంతంగా తమ విధులు నిర్వర్తించాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చెయ్యాలన్నారు. అక్రమంగా మద్యం, నగదు ఇతర వస్తువుల రవాణాను కట్టడి చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.

News April 25, 2024

శ్రీకాకుళం: ఎన్నికల సాధారణ పరిశీలకులు రాక

image

సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు (జనరల్ అబ్జర్వర్)గా హరియాణాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శేఖర్ మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఘన స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్‌తో కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన కలెక్టర్ అనంతరం జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై కొద్దిసేపు వివరించారు.

News April 25, 2024

39 మంది అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్

image

నంద్యాల ఎంపీ స్థానానికి మంగళవారం నలుగురు, అసెంబ్లీ స్థానాలకు 35 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని పేర్కొన్నారు. నంద్యాల పార్లమెంట్‌కు నలుగురు, ఆళ్లగడ్డకు ఆరుగురు, శ్రీశైలానికి ఆరుగురు, నందికొట్కూరుకు నలుగురు, నంద్యాలకు 11 మంది, బనగానపల్లెకు ఆరుగురు, డోన్‌కు ఇద్దరు దాఖలు చేశారన్నారు.

News April 25, 2024

సార్వత్రిక ఎన్నికల్లో 100% పోలింగ్ సాధించాలి: విశాఖ జేసీ

image

సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ లక్ష్యాలను చేసుకోవటంలో అధికార యంత్రాంగానికి, ఓటర్లకు సహకారం అందించాలని జాయింట్ కలెక్టర్, తూర్పు నియోజకవర్గ ఆర్.వో. కె. మయూర్ వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కోరారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారందరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియలో పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.