Andhra Pradesh

News August 26, 2025

తాడేపల్లి: ‘ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు’

image

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసే పథకంలో భాగంగా MEPMA మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఐఏఎస్ మూడు ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ నిషేధించి వాటి స్థానంలో పర్యావరణంలో కలిసిపోయే బాటిల్స్, కంపోస్టబుల్ ఎరువులు తయారికి అవసరమయ్యే కర్మాగారాలను నెలకొల్పడంలో ఈ సంస్థలు సహకారం అందిస్తుందన్నారు.

News August 26, 2025

మచిలీపట్నం: సులభతర వాణిజ్యంపై వర్క్ షాప్

image

వ్యాపారవేత్తలకు సులభతర వాణిజ్యంపై జరిగే సర్వే గురించి సంపూర్ణ అవగాహన కలిగించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, వ్యాపారవేత్తలకు సులభతర వాణిజ్యంపై కార్యశాల నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే DPIIT అవుట్ రీచ్ సర్వే గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో PPT ద్వారా లోతుగా వివరించారు.

News August 26, 2025

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలి: SP

image

శ్రీకాకుళం జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం సూచించారు. ఉత్సవాలలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు, అపసృతులకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ వేడుకల వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవలసిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు.

News August 26, 2025

ప్రకాశం జిల్లా ప్రజలకు.. ఎస్పీ కీలక సూచన.!

image

ప్రకాశం జిల్లా ప్రజలకు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎస్పీ దామోదర్ మంగళవారం కీలక సూచన చేశారు. ముందుగా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ, గణేష్ నిమజ్జనాల సందర్భంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే అవాంఛనీయ ఘటనలు, అపశృతులకు తావులేకుండా ప్రజలు పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు. ఏవైనా అనుకోని ఘటనలు తలెత్తితే.. 112, 100 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.

News August 26, 2025

ప్రకాశం: 5రోజుల పాపను అమ్మబోయిన తండ్రి.!

image

ఐదు రోజుల పాపను అమ్మాలని చూసిన కసాయి తండ్రి వద్ద నుంచి ప్రకాశం జిల్లా బాలల సంరక్షణ అధికారులు పాపను రక్షించిన ఘటన ఒంగోలులో మంగళవారం జరిగింది. మద్యానికి బానిసైన ఓ తండ్రి తన పాపను అమ్మాలని ప్రయత్నించాడు. ఈ ఘటనతో సమాచారం అందుకున్న అధికారులు వెంటనే పాపను తమ సంరక్షణలో ఉంచారు. అలాగే మరో ఆరు సంవత్సరాల బాలికను సైతం అధికారులు నేడు రామ్‌నగర్‌లోని శిశు గృహల్లో చేర్పించారు. అధికారులను కలెక్టర్ అభినందించారు.

News August 26, 2025

రాజమండ్రి: జిల్లా పరిశ్రమల ప్రగతికి సింగిల్ డెస్క్ విధానం

image

జిల్లాలో పరిశ్రమలను ప్రోత్సహించే క్రమంలో ఔత్సాహిక పారిశ్రామిక వ్యవస్థాపకులకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యాన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి కోసం సింగిల్ డెస్క్ విధానం ఉందన్నారు.

News August 26, 2025

విజయనగరం: కరుస్తున్నాయి.. కాటేస్తున్నాయి..!

image

జిల్లాలో పాము కాట్లు, కుక్కల దాడులు భయాందోళన రేపుతున్నాయి. 2024లో 383 మంది పాముకాటుకు గురికాగా ఇద్దరు మరణించారు. 2025 (ఆగస్టు వరకు) 143 కేసులు నమోదయ్యాయి. 2024లో 12,767 కుక్క కాటు కేసులు నమోదవ్వగా నలుగురు చనిపోయారు. 2025 (ఆగస్టు వరకు) 7,545 కేసులు నమోదవ్వగా ఆరుగురు ప్రాణాలొదిలారు. కుక్క, పాముకాట్లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటీ రేబీస్, యాంటీ వెనమ్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు.

News August 26, 2025

సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడిగా రంగన్న

image

ఒంగోలులో జరిగిన సీపీఐ రాష్ట్ర 28వ మహాసభలలో ఆ పార్టీ ఎమ్మిగనూరు పట్టణ కార్యదర్శి రంగన్నను రాష్ట్ర సమితి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం సీపీఐ, ప్రజా సంఘాల ప్రతినిధులు సమివుల్లా, విజయేంద్ర, తిమ్మగురుడు, వీరేశ్ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర సమితి సభ్యుడిగా రంగన్నను ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

News August 26, 2025

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

భారీ వ‌ర్షాల ప‌ట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా క‌లెక్ట‌ర్‌ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ ఆదేశించారు. అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒడిషా, శ్రీ‌కాకుళం జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో, ముఖ్యంగా నాగావ‌ళి ప‌రీవాహ‌క మండ‌లాల అధికారులు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు. ఎస్‌.కోట‌, నెల్లిమ‌ర్ల మండ‌లాల్లో రేపు అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు.

News August 26, 2025

విశాఖ: సమస్యలు చెప్పుకున్న 54 మంది మహిళలు

image

సమస్యలతో బాధపడే మహిళలకు అధికార యంత్రాంగం అండగా ఉండాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చనా మజుందార్ కోరారు. జడ్పీ సమావేశ మందిరంలో ఆమె మహిళల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. 54 మంది మహిళలు తమ సమస్యలను వివరించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలకు న్యాయపరమైన సేవలు అందించాలన్నారు. భరణం వచ్చేలా చూడాలని, స్వయం ఉపాధి కోసం సహకరించాలని కోరారు.