Andhra Pradesh

News April 24, 2024

బాపట్ల: విధుల్లో దురుసుగా ప్రవర్తించిన SI కి నోటీసులు

image

ఎన్నికల విధుల్లో దురుసుగా ప్రవర్తించిన SI కి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. మంగళవారం ఎస్సై నాగశివారెడ్డిని పర్చూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద విధులకు వేశారు. ఈ సమయంలో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు పై దురుసుగా ప్రవర్తించడంతో, సాంబశివరావు తనకు ఫిర్యాదు చేశారని దీనిపై వివరణ అడిగి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.

News April 24, 2024

ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న సాయికుమార్

image

ధర్మవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో సినీనటుడు, బీజేపీ నాయకుడు సాయికుమార్ పాల్గొన్నారు. నేడు సత్యకుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పట్టణంలోని శివానగర్ శివాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కూటమి పార్టీల కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

News April 24, 2024

శ్రీకాకుళం: రేపు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం బుధవారం శ్రీకాకుళం జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు,16 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ మంగళవారం తెలిపారు. ఆమదాలవలస,బూర్జ,గంగువారి సిగడాం, పొందూరు, సరుబుజ్జిలి, నర్సన్నపేట, జలుమూరు, టెక్కలి, కోటబోమ్మాళి, సారవకోట, పాతపట్నం, హిరమండలం, ఎల్ ఎన్ పేట మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయన్నారు.

News April 24, 2024

విజయసాయిరెడ్డిపై 21 కేసులు

image

➤ నియోజకవర్గం: నెల్లూరు ఎంపీ
➤ అభ్యర్థి విజయసాయి రెడ్డి(VSR)
➤ VSR ఆస్తి: రూ.66.73 కోట్లు
➤ భార్య ఆస్తి: రూ.13.99 కోట్లు
➤ అప్పులు: రూ.10.34 లక్షలు,
➤ భార్య అప్పులు రూ.22.84 లక్షలు
➤ వాహనాలు: ఒకే కారు
➤ బంగారం: 1456 గ్రాములు
➤ డైమండ్లు: 345.07 క్యారెట్లు
NOTE: తనపై సీబీఐతో పాటు మొత్తం 21 కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు.

News April 24, 2024

ప.గో.: ఇండిపెండెంట్ MLA అభ్యర్థి స్థిరాస్థులు రూ.4,36,07,949

image

➤ నియోజకవర్గం: ఉండి
➤ అభ్యర్థి: వేటుకూరి శివరామరాజు (ఇండిపెండెంట్)
➤ చరాస్తులు: రూ.81,58,379
➤ స్థిరాస్తులు: రూ.4,36,07,949
➤ అప్పులు: లేవు
➤ భార్య చరాస్తులు: రూ.50,57,238
➤ భార్య స్థిరాస్తులు: రూ.80,00,000
➤ ఇద్దరి చేతిలో ఉన్న డబ్బులు: రూ.54,000
➤ 4 క్రిమినల్ కేసులు (పెండింగ్)
NOTE: ఎన్నికల అఫిడవిట్ వివరాలు ఇవి.

News April 24, 2024

చంద్రబాబు, జగన్ ప్రజల చేతిలో చిప్ప పెట్టారు: షర్మిల

image

టీడీపీ హయాంలో ఎమ్మెల్యేలు కిటికీలు తెరిచి దోపిడీ చేస్తే వైసీపీ హయాంలో ఏకంగా తలుపులే తెరిచారని వైఎస్ షర్మిల అన్నారు. కర్లపాలెంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైనా చెప్పుకోవడానికి రాజధాని ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్ కలిసి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించి ప్రజల చేతిలో చిప్ప పెట్టారన్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి బానిసలుగా తయారయ్యారన్నారు.

News April 24, 2024

విశాఖ-చెన్నై ఎగ్మోర్-విశాఖ స్పెషల్ రైళ్లు

image

వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విశాఖ-చెన్నై ఎగ్మోర్-విశాఖ వీక్లీ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్ రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 27 నుంచి జూన్ 29 వరకు ప్రతి శనివారం విశాఖ నుంచి ఈ రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే తిరుగు ప్రయాణంలో ఈనెల 28 నుంచి జూన్ 30 వరకు ప్రతి ఆదివారం చెన్నై ఎగ్మోర్ నుంచి విశాఖకు నడుపుతున్నట్లు తెలిపారు.

News April 24, 2024

పెదకాకానిలో మహిళ మృతి.. కేసు నమోదు

image

మహిళ మృతి చెందిన ఘటనపై మంగళవారం పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకాకాని నుంచి గుంటూరు వెళ్ళు హైవే రోడ్డుపైన గుర్తు తెలియని మహిళ పడి ఉందని గుర్తించారు. మతిస్థిమితం లేని ఆమెను గుంటూరు GGHకు తరలించారు. ఆమె పేరు లావణ్య అని చెప్పినట్లు సమాచారం. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు.

News April 24, 2024

ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ నామినేషన్

image

ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మంగళవారం నామినేషన్ వేశారు. ముందుగా ఏలూరు నగరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలుతో భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు తరలి వెళ్లారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు.

News April 24, 2024

సత్యసాయి జిల్లా నుంచి 27 నామినేషన్ల దాఖలు: కలెక్టర్

image

శ్రీ సత్య సాయి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల నుంచి 27 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు వేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి 8 మంది, పుట్టపర్తి నుంచి ఐదుగురు, మడకశిర నుంచి ఐదుగురు, హిందూపురం నుంచి నలుగురు, ధర్మవరం నుంచి ముగ్గురు, కదిరి నుంచి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు వేశారన్నారు.