Andhra Pradesh

News April 24, 2024

సమర్థవంతంగా విధులు నిర్వహించాలి: బాపట్ల ఎస్పీ

image

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి SST బృందాలతో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఎస్.ఎస్.టి బృందాలు నిర్వహించే విధులు కీలకమని తెలిపారు. సమర్థవంతంగా విధులు నిర్వహించాలని తెలిపారు.

News April 24, 2024

SKLM: ఎన్నికల సమయంలో మరో ఐఏఎస్ అధికారి బదిలీ

image

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మరో ఐఏఎస్ అధికారిణిని బదిలీ చేశారు. సీతంపేట ఐటీడీఏ పీఓ, పాలకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కల్పనా కుమారిని బదిలీ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ శోభితకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నియమించారు.

News April 24, 2024

ప.గో.: మహిళపై అత్యాచారం.. జైలు

image

మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. కామవరపుకోట మండలం వీరిశెట్టివారిగూడేనికి చెందిన వితంతువుపై 2015లో అదే గ్రామానికి చెందిన నిజపరపు సత్యనారాయణ అలియాస్ సత్తియ్య అత్యాచారయత్నం చేసి పరారయ్యాడు. అప్పటి తడికలపూడి SIవిష్ణువర్ధన్ కేసు నమోదుచేసి దర్యాప్తుచేపట్టారు. తుది విచారణ అనతరం ఏలూరు 5వ అదనపు జిల్లాజడ్జి, మహిళా కోర్టు న్యాయమూర్తి రాజేశ్వరి ఈమేరకు తీర్పునిచ్చారు.

News April 24, 2024

పది ఫలితాల్లో ఉత్తరాంధ్ర‌కే టాపర్‌గా నిలిచిన శ్రీకర్

image

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో కాశీబుగ్గకు చెందిన విద్యార్థి ఎస్ శ్రీకర్ 597/600 మార్కులు సాధించి ఉత్తరాంధ్ర జిల్లాల టాపర్‌గా నిలిచాడు. సంతకవిటి మండలం వాసుదేవుపురం గ్రామానికి చెందిన శ్రీకర్ తండ్రి ఎస్ రామరాజు కాశీబుగ్గ శ్రీ చైతన్య కళాశాలలో ఎఓగా పని చేస్తుండగా తల్లి లలిత గృహిణిగా ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీకర్ కు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు

News April 24, 2024

లేపాక్షి: టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి: బాలకృష్ణ

image

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంగళవారం లేపాక్షి మండలం కల్లూరు, నాయనపల్లి, కొండూరు పంచాయతీల్లో ప్రచారం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బీకే పార్థసారథిని గెలిపించాలని, ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించాలని అభ్యర్థించారు. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని అన్నారు. ఓటు అనే వజ్రాయుధంతో సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు బాలయ్య పిలుపునిచ్చారు.

News April 24, 2024

ఆదాలకు కార్లు లేవట..!

image

➤ నెల్లూరు రూరల్: ఆదాల ప్రభాకర్ రెడ్డి (YCP)
➤ ఆదాల స్థిరాస్తి: రూ.41.11 కోట్లు
➤ భార్య వింధ్యావళి స్థిరాస్తి: రూ.85.46 కోట్లు
➤ ఆదాల చరాస్తి: 136.66 కోట్లు
➤ వింధ్యావళి చరాస్తి: 48.70 కోట్లు
➤ మొత్తం ఆస్తి: రూ.312 కోట్లు
➤ మొత్తం అప్పులు: రూ.15.64 కోట్లు
➤ బంగారం: 9.65 కేజీలు
➤ వాహనాలు: ఏమీ లేవు
NOTE: ఎన్నికల అఫిడవిట్‌ వివరాలు ఇవి.

News April 24, 2024

తూ.గో.: మహిళ దారుణహత్య

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం రెళ్లుగడ్డలో మంగళవారం బొంతు మణికుమారి (30) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాత్రూంలో మాటువేసిన ఆగంతకుడు గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు. హత్య సమయంలో డోరు లోపల గడియ వేసిఉందని, కిటికీ లోంచి ఆమె తోడికోడలు, కుమారుడు చూసి కేకలు వేశారు. ఎస్ఐ హరీష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 

News April 24, 2024

విశాఖలో మృతి చెందిన యువకుల వివరాలు ఇవే

image

విశాఖలో <<13107489>>అంబులెన్స్ ఢీకొని<<>> మృతి చెందిన ఇద్దరు యువకుల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన రామకృష్ణ, విజయవాడకు చెందిన చందు మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. రామకృష్ణ తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడంతో అనాథల పెరిగాడు. చందు తల్లి నిరుపేద కావడంతో ఛార్జీలకు పోలీసులు కొంత నగదు ఇచ్చి పంపించారు. ప్రస్తుతం ఇద్దరు మృతదేహాలు కేజీహెచ్ ఆస్పత్రిలో భద్రపరిచారు.

News April 24, 2024

కృష్ణా: అంబులెన్స్ ఢీకొని ఇద్దరి దుర్మరణం

image

విశాఖలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న విజయవాడకు చెందిన చందు(20) అతడి స్నేహితుడు రామకృష్ణ (19) సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విశాఖలో వీరు బైక్‌ పై వెళుతుండగా.. 108 అంబులెన్స్ ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలిలోనే కన్నుమూశారు. కుమారుడి మృతదేహాన్ని చూసేందుకు సైతం దారి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో, విశాఖ పోలీసులు చందు తల్లికి డబ్బు పంపి విశాఖకు రప్పించినట్లు సమాచారం.

News April 24, 2024

భరత్ ఆస్తి రూ.కోటి కన్నా తక్కువే..!

image

➤ కుప్పం అభ్యర్థి: KRJ భరత్ (YCP)
➤ చరాస్తి: రూ.98.47 లక్షలు
➤ స్థిరాస్తి: రూ.30 లక్షలు
➤ భార్య దుర్గ చరాస్తి: రూ.41.88 లక్షలు
➤ ఇద్దరు పిల్లల పేరిట ఆస్తి: రూ.32.78 లక్షలు
➤ అప్పులు: రూ.11.60 లక్షలు
➤ బంగారం: 950 గ్రాములు
➤ కేసులు: ఒకటి
➤ వాహనాలు: ఒకే కారు
NOTE: తనకు హైదరాబాద్‌కు సమీపంలో ఓ విల్లా తప్ప ఎలాంటి స్థలాలు, బిల్డింగ్‌లు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.