Andhra Pradesh

News April 24, 2024

విజయబాబుకు సోమిరెడ్డి నివాళి

image

దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయబాబు మరణం బాధాకరమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని వారి నివాసంలో విజయబాబు భౌతిక కాయానికి సోమిరెడ్డి నివాళులర్పించారు. ఒంగోలు ఎంపీ శ్రీనివాసులు రెడ్డితో పాటు కుటుంబసభ్యులను సోమిరెడ్డి పరామర్శించారు.

News April 24, 2024

నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదు: సుంకర పద్మశ్రీ

image

తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదని సుంకర పద్మశ్రీ ట్వీట్ చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థినిగా పోటీ చేయాలని ఆశించానని, అధిష్ఠానం అవకాశం కల్పించలేకపోయిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు తన వంతు కృషి చేస్తానన్నారు. తన నిర్ణయాన్ని అధిష్ఠానం మన్నిస్తుందని భావిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు అభ్యర్థిగా పద్మశ్రీని నిన్న కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే.

News April 24, 2024

ప్రకాశం: పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.266

image

జిల్లాలోని పలు పొగాకు వేలం కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన వేలంలో వెల్లంపల్లి, కొండపిలో పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.266, ఒంగోలు-1 రూ. 265, ఒంగోలు-2 రూ. 261, టంగుటూరు రూ.263 చొప్పున పలికింది. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 3,374 బేళ్లు తీసుకురాగా, అందులో 2,683 బేళ్లు, ఎస్ఎల్ ఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 3,534 బేళ్లురాగా, అందులో 2,697 బేళ్లను కొనుగోలు జరిగాయి.

News April 24, 2024

కాల్వ శ్రీనివాసులు ఆస్తుల వివరాలు

image

రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
విద్యార్హత :MA,
కేసులు :15,
చరాస్తులు: రూ.10.33 లక్షలు,
బంగారం: 90 గ్రాములు,
స్థిరాస్తులు: రూ. 5.45 కోట్లు,
అప్పులు: 1.02 కోట్లు ఉన్నట్లు నామినేషన్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో వారు పేర్కొన్నారు.

News April 24, 2024

సాయి ప్రసాద్ రెడ్డి ఆస్తి వివరాలు

image

ఆదోని వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. దంపతుల ఆస్తి మెుత్తం రూ.13.77 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చరాస్తి: రూ.1.85కోట్లు, స్థిరాస్తి:రూ.4.22కోట్లు, అప్పులు:రూ.1.22కోట్లు, నగదు:10.30లక్షలు ఉన్నాయి. అంతేగాక 25 తులాల బంగారం, రూ.3లక్షల విలువగల వెండి ఉన్నట్లు వెల్లడించారు. ఆయనకు వాహనం లేనట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

News April 24, 2024

నారా లోకేశ్‌పై 23 కేసులు

image

➤ నియోజకవర్గం: మంగళగిరి
➤ అభ్యర్థి: నారా లోకేశ్(TDP)
➤ భార్య: నారా బ్రాహ్మణి
➤ విద్యార్హతలు: MBA
➤ చరాస్తి విలువ: రూ.341.68కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.45.06కోట్లు
➤ కేసులు: 23
➤ అప్పులు: రూ.3.48కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.16,600
➤ బంగారం: లేదు, భార్యకు 2500.338గ్రాములు బంగారం, 97.441కేజీల సిల్వర్.
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

News April 24, 2024

నామినేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న దువ్వాడ వాణి

image

టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని ప్రకటించిన వైసీపీ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ముందుగా ఈనెల 22న నామినేషన్ వేస్తానని ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ పెద్దలు వాణితో సంప్రదింపులు జరిపారు. దీంతో నామినేషన్ వేసే నిర్ణయాన్ని ఆమె వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

News April 24, 2024

పాలకోడేరులో RRR ఎన్నికల ప్రచారం

image

పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామం నుంచి నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారాన్ని మంగళవారం ప్రారంభించారు. సందర్భంగా గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన వెంట ఎమ్మెల్యే మంతెన రామరాజు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News April 24, 2024

ప్రత్యేక అలంకరణలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ

image

తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో జాతర ముందు నిర్వహించే వారాలలో రెండో మంగళవారం అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. మొక్కు జొన్నతో అలంకరణ చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అంతేకాకుండా పౌర్ణమి సందర్భంగా చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.

News April 24, 2024

ధర్మవరం: పెయింటర్ కూతురుకి.. 594 మార్కులు

image

ధర్మవరం మండలం కుణుతూరు గ్రామానికి చెందిన S.దీక్షిత పోతుకుంటలో గల పాఠశాలలో చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 594 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్ట్స్‌లో 100కి 100 మార్కులు సాధించారు. దీక్షిత తండ్రి నరసింహులు పెయింటర్‌గా పనిచేస్తున్నారు. ఈ విద్యార్థిని ప్రతిభ పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.