Andhra Pradesh

News April 24, 2024

గండేపల్లి: వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్‌కు ఏడాది జైలు

image

ఓ వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్‌కు కోర్టు ఏడాది జైలుశిక్ష, రూ.3వేలు జరిమానా విధించినట్లు గండేపల్లి పోలీసులు తెలిపారు. 2019 జనవరి 22న గండేపల్లి గ్రామ శివారులో ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్, స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టగా.. స్కూటీ చోదకుడు మృతి చెందాడు. ఈ క్రమంలో సోమవారం పెద్దాపురం కోర్టు మెజిస్ట్రేట్ జి.హర్షవర్ధన్ తీర్పు వెల్లడించారు.

News April 24, 2024

విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆస్తుల వివరాలు

image

➤ అభ్యర్థి: బొత్స ఝాన్సీ
➤ చరాస్తులు: రూ.4.75 కోట్లు
➤ స్థిరాస్తులు: రూ.4.46 కోట్లు
➤ అప్పులు: రూ.2.32కోట్లు
➤ భర్త బొత్స పేరిట చరాస్తులు: రూ.3.78కోట్లు
➤ భర్త పేరిట స్థిరాస్తులు: రూ.6.75 కోట్ల విలువైన భవనాలు,భూములు
➤ భర్త పేరిట అప్పులు: రూ.1.92కోట్లు
➤ కేసులు: లేవు
➤➤ఆమె పేరిట 325 తులాల బంగారం, రెండు కార్లు.. భర్త పేరిట 31 తులాల బంగారు ఆభరణాలు, ఒక కారు ఉన్నట్లు అఫడివెట్‌లో పేర్కొన్నారు.

News April 24, 2024

నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన చిరంజీవి

image

నెల్లూరు జిల్లాకు చెందిన ఏపీ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అమరావతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యకర్శి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరి కండువా కప్పుకున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేశ్ చర్చలు ఫలించినట్లు సమాచారం. కాకర్ల సురేశ్ సోదరుడు సునీల్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు.

News April 24, 2024

12 ఏళ్లు పెద్దిరెడ్డి కోమాలో ఉన్నారా..?: నల్లారి

image

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మరోసారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డిని తాను అరెస్ట్ చేశానని 12 ఏళ్ల తర్వాత పెద్దిరెడ్డి అంటున్నారని.. ఇప్పటి వరకు ఆయన కోమాలో ఉన్నారా అని ప్రశ్నించారు. జగన్ అరెస్ట్‌కు తనకేంటి సంబంధమన్నారు.

News April 24, 2024

బొత్స ఝాన్సీ ఆస్తుల వివరాలు

image

➤ అభ్యర్థి పేరు: బొత్స ఝాన్సీ
➤ చరాస్తులు: రూ.4.75 కోట్లు
➤ స్థిరాస్తులు: రూ.4.46 కోట్లు
➤ అప్పులు: రూ.2.32కోట్లు
➤ భర్త బొత్స పేరిట చరాస్తులు: రూ.3.78కోట్లు
➤ భర్త పేరిట స్థిరాస్తులు: రూ.6.75 కోట్ల విలువైన భవనాలు,భూములు
➤ భర్త పేరిట అప్పులు: రూ.1.92కోట్లు
➤ కేసులు: లేవు
➤➤ఆమెకు 325 తులాల బంగారం, రెండు కార్లు.. భర్త పేరిట 31 తులాల బంగారు ఆభరణాలు, ఒక కారు ఉన్నట్లు అఫడివెట్ లో పేర్కొన్నారు.

News April 24, 2024

నెల్లూరు: ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఆస్తుల విలువ రూ. 22 లక్షలు

image

నెల్లూరు నగర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.డీ ఖలీల్ అహ్మద్ కుటుంబం ఆస్తుల విలువ రూ. 22.18 లక్షలు ఉన్నట్లు ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఖలీల్ పేరుపై రూ.16.25 లక్షలు, ఆయన సతీమణి పేరుపై రూ. 4.26 లక్షలు, కుమారుడి పేరున రూ. 1.67 లక్షల చరాస్తులు ఉన్నట్లు చూపించారు. అప్పులు, కేసులు లేవు.

News April 24, 2024

జమ్మలమడుగు కౌన్సిలర్ అనుమానాస్పద మృతి

image

జమ్మలమడుగు మున్సిపాలిటీ 4వ వార్డ్ కౌన్సిలర్ జ్ఞాన ప్రసూన (32) సోమవారం రాత్రి మృతి చెందారు. జమ్మలమడుగుకు చెందిన వంగల నాగేంద్ర కుమార్తె జ్ఞాన ప్రసూన తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉంటోంది. సోమవారం రాత్రి కోయంబత్తూర్లోని తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈమె మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికపై అభ్యంతరం వ్యక్తం చేసి YCPకి రాజీనామా చేసింది.

News April 24, 2024

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆస్తి వివరాలు

image

డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి నామినేషన్ పత్రాలను ఆయన తరఫున ఆ పార్టీకి చెందిన లక్ష్మీనారయణ యాదవ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మహేశ్వర్ రెడ్డికి శనివారం సమర్పించారు. అఫిడవిట్‌లో కోట్ల పేరు మీద రూ.22.6కోట్లు ఆస్తులు, రూ.94.90 లక్షల అప్పు, రెండు ఇళ్లు, మూడు కార్లు, ఒక్క కేసు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన భార్య కోట్ల సుజాతమ్మ పేరపై రెండు కార్లు, 40 తులాల బంగారం, రూ.1.28 లక్షల నగదు ఉంది.

News April 24, 2024

తూ.గో జిల్లాలో జోరందుకున్న నామినేషన్ల పర్వం

image

తూ.గో జిల్లాలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. 4వ రోజు సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీ లత తెలిపారు. లోక్‌ సభకు 4, అసెంబ్లీలకు 20 దాఖలయ్యాయని అన్నారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగా సోమవారం వరకూ లోక్‌ సభకు 5 నామినేషన్లు, అసెంబ్లీ స్థానాలకు 48 దాఖలయ్యాయి.

News April 24, 2024

జగన్‌పై దాడి ఘటన.. సతీశ్‌ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్

image

విజయవాడలో సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీశ్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో సోమవారం ఈ పిటిషన్ సమర్పించారు. సతీశ్ నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. అతడిని ఏడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సతీశ్ తరఫు న్యాయవాదిని జడ్జి ఆదేశించారు.