Andhra Pradesh

News April 24, 2024

కర్నూలు: 3రోజులు బడికి వెళ్లి 509 మార్కులు

image

చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వనూరమ్మల కుమార్తె బోయ నవీన పదో తరగతిలో 509 మార్కులు సాధించింది. తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు. తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది. ఇంటి పరిస్థితుల కారణంగా వారంలో మూడు రోజులు కూలీ పనులకు వెళ్తూ.. మూడు రోజులు బడికి వెళ్లేది. చిప్పగిరి ఉన్నత పాఠశాలలో చదివి 509 మార్కులు సాధించింది.

News April 24, 2024

నెల్లూరు: కాల్వలో దూకి వృద్ధుడి ఆత్మహత్య

image

ఓ వృద్ధుడు కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరు నగరంలో జరిగింది. రంగనాయకులపేటలోని రైల్వే రోడ్డు ప్రాంతంలో నివాసం ఉంటున్న జమీర్ సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి సమీపంలో ఉన్న జాఫర్ సాహెబ్ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 24, 2024

గుమ్మనూరు జయరాం ఆస్తుల విలువ రూ.78.93 లక్షలు

image

గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో నమోదు చేసిన వివరాలు.. ఆయన ఎస్‌ఎస్ఎల్‌సీ విద్యార్హతగా పేర్కొన్నారు. ఆయనపై ఒక్క కేసు ఉంది. అదేవిధంగా చరాస్తులు రూ.18.93 లక్షలు, స్థిరాస్తులు రూ.60లక్షలు, బంగారం 173 గ్రాములు, అప్పులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

News April 24, 2024

చీరాల: తల్లి కళ్లెదుటే ఏడాది కూతురు మృతి

image

చీరాల-వేటపాలెం బైపాస్ రోడ్డులో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. స్నేహలత తన తల్లి, కూతరితో కలిసి చిన్నగంజాం నుంచి బాపట్ల వెళ్తుండగా లారీని తప్పించబోయి కింద పడ్డారు. అదే సమయంలో లారీ వారిపై ఎక్కడంతో అన్విత(1), బోడు సుబ్బారావమ్మ(45) అక్కడికక్కడే మృతిచెందారు. తన కళ్లెదుటే కూతురు, తల్లిని కోల్పోవడంతో స్నేహలత ఆవేదన వర్ణణాతీతంగా మారింది.

News April 24, 2024

ప.గో: పదో తరగతి విద్యార్థులకు గమనిక

image

పదో తరగతి విద్యార్థుల మార్కుల జాబితాలను www.bse.ap.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని డీఈవో అబ్రహం తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించాలని పదో తరగతి అనుబంధ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు ఈ నెల 30లోగా రుసుము చెల్లించాలన్నారు.

News April 24, 2024

బొత్స డ్రామాలాడి ఇదంతా చేశారు: చంద్రబాబు

image

ఎస్.కోట నియోజకవర్గంలో నిన్న జరిగిన సమావేశంలో బొత్సపై చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గ ప్రజలు విశాఖపైనే ఆధారపడతారని..కానీ ఈ నియోజకవర్గాన్ని విశాఖలో కలపకుండా విజయనగరంలో ఉంచారని అన్నారు. ఇదంతా బొత్స డ్రామాలాడి చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే ఎస్.కోటను విశాఖ జిల్లాలో కలుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

News April 24, 2024

విశాఖ: ఈరోజు సాయంత్రం వరకే ఛాన్స్

image

హోమ్ ఓటింగ్ కోసం ఈరోజు సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని విశాఖ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మల్లికార్జున కోరారు. 85 సంవత్సరాల పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యం గల దివ్యాంగులలు హోమ్ ఓటింగ్‌కు అర్హులుగా సర్వే ద్వారా గుర్తించి వారికి ఫారం-12(డి) అందించినట్లు పేర్కొన్నారు. ఓటర్లు ఇంకా మిగిలి ఉంటే అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి వ్యక్తిగతంగా దరఖాస్తు చేయాలన్నారు.

News April 24, 2024

అనంత: నేటి నుంచి డిగ్రీ పరీక్షలు

image

అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో మంగళవారం నుంచి డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. ఇవాళ నుంచి ఈ నెల 29వ తేదీ వరకు యూజీ 2, 4, 6 సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ ఓ ప్రకటనలో తెలిపారు.

News April 24, 2024

నారాయణ ఆస్తి వివరాలు ఇవే..!

image

➤ నియోజకవర్గం: నెల్లూరు సిటీ
➤ అభ్యర్థి: నారాయణ (TDP)
➤ చరాస్తులు: రూ.78.66 కోట్లు
➤ స్థిరాస్తులు: రూ.207.50 కోట్లు
➤ అప్పులు: 62.43 కోట్లు
➤ భార్య చరాస్తులు: 100.84 కోట్లు
➤ భార్య స్థిరాస్తులు: రూ.437.02 కోట్లు
➤ భార్య అప్పులు: రూ.127.16 కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.81,636
➤ బంగారం: 35.90 కేజీలు
➤ వాహనాలు: 4
NOTE: ఎన్నికల అఫిడవిట్ వివరాలు ఇవి.

News April 24, 2024

తిరుపతి: రైతు కూలి కుమార్తెకు 597 మార్కులు

image

కలకడ మండలం గరడప్పగారిప్లలెలోని ఏపీ గురుకుల(బాలికలు) పాఠశాల విద్యార్థిని పి.లిఖిత 597 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ సుమిత్ర తెలిపారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం కొత్తవేపకుప్ప గ్రామానికి చెందిన సాధారణ రైతు కూలి ఇంటి జన్మించిన పి.లిఖిత రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడంతో పలువురు అభినందించారు.