Andhra Pradesh

News April 24, 2024

చిత్తూరు జిల్లాలో 44 నామినేషన్లు దాఖలు

image

చిత్తూరు జిల్లాలో సోమవారం 44 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి 5, పుంగనూరు అసెంబ్లీకి 5, నగిరికి ఒకటి, చిత్తూరుకు నాలుగు, పూతలపట్టుకు 6, పలమనేరుకు ఆరు, కుప్పం అసెంబ్లీకి ఆరు నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు.

News April 24, 2024

విశాఖ: 29, 30 తేదీల్లో విభిన్న ప్రతిభావంతుల క్రికెట్ టోర్నమెంట్

image

విభిన్న ప్రతిభావంతుల స్టేట్ ఇంటర్ జోన్ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 29, 30 తేదీల్లో విశాఖలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను సోమవారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మ్యాచ్ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.

News April 24, 2024

అల్లూరి జిల్లా కలెక్టర్‌ను కలిసిన క్రికెటర్ రవని

image

అల్లూరి జిల్లా కలెక్టర్ విజయ సునీతను అంధుల క్రికెటర్ వలసనేని రవని కలిశారు. ఆల్ ఇంగ్లాండ్ అంధుల క్రికెట్ ప్రపంచ పోటీలలో గెలిచిన టీంలో ఈమె సభ్యురాలిగా ఉన్నారు. ఆల్ రౌండ్ ప్రతిభతో 2023లో బంగారు పతకం సాధించారు. రవని కుటుంబ సభ్యులు పరిస్థితులు, మెరుగైన క్రికెట్ ఆడేందుకు అవసరమైన సాయం చేయాలని విన్నవించగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఓట్లు వేసేందుకు యువతను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆమెకు సూచించారు.

News April 24, 2024

ప్రజల ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించండి: మంత్రి అంజాద్ బాష

image

ప్రజల ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని మంత్రి అంజాద్ బాష అన్నారు. సోమవారం సాయంత్రం కడప నగరంలోని 26వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని వివరించారు. మరోసారి కడప ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వైఎస్ అవినాశ్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

News April 24, 2024

26లోగా దరఖాస్తులను సమర్పించాలి: కలెక్టర్ అరుణ్

image

26వ తేదీలోగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను అందజేయాలని శ్రీ సత్యసాయి కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఉద్యోగులు ఎక్కడ ఉన్నా పని చేసే చోట ఫామ్-12ను సమర్పించే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకోవచ్చన్నారు.

News April 24, 2024

శ్రీకాకుళం వ్యాప్తంగా 26,833 మంది ఉత్తీర్ణత

image

ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారి సంఖ్య 23,157 కాగా ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు 2,774 తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారి సంఖ్య 902గా ఉంది. జిల్లా మొత్తం ఉత్తీర్ణులైన వారి సంఖ్య 26,833గా అధికారులు సోమవారం వెల్లడించారు. వీరందరికీ జిల్లాలోని విద్యాశాఖ అధికారులతో పాటుగా పలువురు ఉన్నతాధికారులు అభినందించారు.

News April 24, 2024

6ఏళ్లుగా మహానంది నుంచి గంగా జలం తీసుకెళ్తున్న తమిళనాడు భక్తులు

image

తమిళనాడులోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైన పళని దేవాలయమునకు చెందిన అర్చకులు, సేవకులు దురైరాజ్, రాజన్ ఆధ్వర్యంలో 50 మంది సభ్యులు
రేపు చిత్రాపౌర్ణమి సందర్భంగా పళని సుబ్రహ్మణ్య స్వామి అభిషేకానికి మహానంది క్షేత్రంలోని కోనేటి నీరును తీసుకుని వెళ్లారు. దేశంలోని అనేక ప్రసిద్ధ తీర్ధములు నుంచి ప్రతి ఏడాది నీరు తీసుకుని వెళ్ళడం ఆనవాయితని తెలిపారు. ఆరేళ్లుగా మహానంది నుంచి నీరు తీసుకెళ్తున్నామన్నారు.

News April 24, 2024

ప్రకాశం జిల్లాలో 51 నామినేషన్లు దాఖలు

image

ప్రకాశం జిల్లాలో సోమవారం ఒంగోలు పార్లమెంట్, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు 51 నామినేషన్లు దాఖలయినట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఒంగోలు పార్లమెంట్‌కు 4, ఒంగోలు అసెంబ్లీకి 5, యర్రగొండపాలెంకు 6, దర్శికి 4, సంతనూతలపాడుకు 6, కొండపికి 3, మార్కాపురానికి 5, గిద్దలూరుకు 5, కనిగిరి నియోజకవర్గానికి 3 నామినేషన్లు దాఖలయినట్లు తెలిపారు.

News April 24, 2024

ప.గో.: నాన్న గెలుపు కోసం.. ఇస్త్రీ చేస్తూ ప్రచారం 

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమార్తె దీపిక సోమవారం ప.గో. జిల్లా తణుకులో ప్రచారం చేపట్టారు. పట్టణంలోని స్థానిక 24వ వార్డులో తణుకు MLAగా నాన్న కారుమూరి వెంకట నాగేశ్వరరావు గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఓ ఇస్త్రీ దుకాణంలో ఇస్త్రీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు.

News April 24, 2024

అనకాపల్లి జిల్లాలో పది పరీక్షలో 89.04 శాతం మంది ఉత్తీర్ణత

image

అనకాపల్లి జిల్లాలో 10 పరీక్షల్లో 89.04 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. జిల్లాలో మొత్తం 21,169 మంది పరీక్షకు హాజరు కాగా 18,848 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 14,725 ప్రథమ శ్రేణిలో, 2,867 మంది ద్వితీయ శ్రేణిలో, 1256 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు డీఈఓ వెంకటలక్ష్మమ్మ తెలిపారు. పాయకరావుపేట జడ్పీ బాలికల హైస్కూల్‌కు చెందిన కె. సత్య ధనస్వాతి 592 మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది.